పురుషోత్తమ క్షేత్ర దర్శనము
బ్రహ్మయిట్లనియె.
అరాజవంతీ నగరమందు (ఉజ్జయిని యందు) ప్రజలును స్వనంతానమట్లు పాలించెను. సత్యవచనుడు శూరుడు సర్వసుగుణ సంపన్నుడు ధార్మికుడు జ్ఞాని బుద్దిశాలి సర్వశాస్త్రజ్ఞుడు. వరరాజుల గెల్చినవాడునై యతడు ప్రతాపమున రవిని రూపముచే అశ్వినీ కుమారులను పరాక్రమమున ఇంద్రుని వ్రజారంజమున చంద్రుని బోలియుండెను. అశ్వమేధాది యజ్ఞములను దానములను తపస్సులను ఆ చరించి అష్టైశ్వర్య సంపన్నుడై ఉండెను. విప్రులకు…
పురుషోత్తమ క్షేత్ర వర్ణనము
మునులిట్లనిరి.
పురుషోత్తమము అను నా పుణ్య వైష్ణవ క్షేత్రమున ఆ రాజు ససైన్య పరివారముగ సేవించి అందు బలరామ కృష్ణులను ప్రతిష్టించి…
పురుషోత్తమ క్షేత్ర వర్ణనము 2
ఆ మీదికథను, అ క్షేత్రరాజమునకేగి ఇంద్రద్యుమ్న ప్రభుడేమి చేసెను? తెలుపుమని మునులడిగిరి. బ్రహ్మ ఇట్లనియె …
ప్రాసాదకరణము
ఇట్లా రాజు విష్ణుప్రాసాద నిర్మాణమును గురించి ఆలోచించి ప్రారంభము చేసెను. జోతిష్కులను పిలిపించి భూశోధనము చేయించెను. అంతియే గాక జ్ఞానులు, వేదశాస్త్ర పారంగతులు, అమాత్యులు, మంత్రులు, మొదలగు వారితో సమాలోచించి సుముహూర్తమున చంద్ర తారాబల సంపత్తి గ్రహానుకూల్యము గల శుభ సమయమున వాస్తు విద్వాంసులతో నీ ఆరంభము జరిపించెను. మంగళవాద్యములు, వేదాధ్యయనము మనోహరముగా జరిగెను. పూవులు, అక్షతలు, పేలాలతో దీపములతో పూర్ణకుంభములతో నా…
ప్రతిమా నిర్మాణ విధానపర్యాలోచనమ్
మునులిట్లనిరి.
దేవదేవా! ఆ ప్రతిమలు ఇంద్రద్యుమ్నునిచే నెట్లు నిర్మింపబడినవి, ఏ ప్రకారముగా మాధవుడు సంతుష్టుడయ్యె అదియెల్ల ఆనతిమ్ము వినవలెను. మా మనసులు ఉవ్విళ్ళూరుచున్నవి. బ్రహ్మ ఇట్లనియె. …
కారుణ్య స్తవ వర్ణనము ఇంద్రద్యుమ్నుడు
పురుషోత్తమదేవుని స్తుతించుట
వాసుదేవా!మోక్షకారణ! జన్మ సంసార సాగరమునుండి రక్షింపుము. అచ్చమైన ఆకాశమువంటివాడవు నిర్లేపుడవు.(గణసంగములేనివాడవన్నమాట) ఈ స్తుతి పారాయణ నారాయణ నామావళి. 1 శ్లో నుండి 9 బలరామాది వివిధ మూర్తులన్నియు నీవే వేఱువేఱుగా ననిపించుచున్నవి. గరుడుడు శంఖచక్రాదులు దిక్పాలురు కేశవాది రూపములన్నియు నీయవయవములే. …
ప్రతిమావిర్భావ నిరూపణము
బ్రహ్మ యిట్లనియె :-
ఓమునివరులార! అమ్మహీపతి యిట్లు జగన్నాధుని మ్రొక్కి వినుతించి ఆలోచనలో మునిగి దర్బలు పరచుకొని ఆ మీద బట్టపరచుకొని ఆ దేవునిపై మనసునిల్పి ఆ బాధను హరించు దేవదేవుదేవుడు ప్రత్యక్షమగునని అనుకొనుచు నేలపై నిదురించెను. …
ఉపాసనా ఖండము మొదటి భాగము
భృగు సోమకాంత సంవాదం
శబ్దబ్రహ్మయై - వాక్కులకు ఛందోగణాలకూ అధిపతి గణపతి స్వరూపియైన బ్రహ్మణస్పతి కి భక్తిపూర్వక నమస్కారము/ సమస్త కార్యములకూ విఘ్నభయం నివారించే విఘ్నపతి కి నమస్కారము. మాకు సమస్త సంపదలనూఇచ్చే లక్ష్మీగణపతి కి, లక్ష్మిని కటాక్షించే మహా గజమునకు నమస్సులు/ సిద్ధి'ని…
ఉపాసనాఖండము మొదటి భాగము
సోమకాంత వర్ణనం
సూతమహర్షి ఇలా కొనసాగించాడు: - ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా ఆతడికి పూర్వజన్మకర్మ పరిపాకంవల్ల అతిదారుణమైన కుష్టువ్యాధి సంక్రమించింది. శుభాశుభ కర్మ లేవైనప్పటికీ అవి అవశ్యము అనుభవించి తీరవలసిందే నన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి, సోమకాంత…
ఉపాసనాఖండము మొదటి భాగము
ఆచార నిరూపణం
సోమకాంత మహారాజు కుమారునకు ఆచారమూ ధర్మము రాజనీతులను ఉపదేశించుట అలా రహస్య మందిరంలో రాజైన సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠుని స్వర్ణమయమై, బహురత్నఖచితమై, ఇంద్రుని స్వర్గ సింహాసనంతో సమానంగా మెరిసిపోతున్న తన సింహాసనంపైన ప్రక్కన కూర్చుండబెట్టుకుని అతని వీపుపై ప్రేమగా ఆశ్వాసం కలిగేలా తన కుడిచేతిని ఉంచి అతనితో…
ఉపాసనాఖండము మొదటి భాగము
సోమకాంత తపశ్చర్య
సూతుడు తిరిగి యిలా చెప్పసాగాడు!"ఓ మహర్షులారా!ఇలా సోమకాంతమహారాజు తన కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి,సద్ బ్రాహ్మణులకు విలువైన మణిమాణిక్యాలనూ, ఇతరులందరికి వారివారికి తగినట్లుగా ఏనుగులను, ఆవులను, జాతిగుఱ్ఱాలనూ, ధనధాన్యాలనూ యిచ్చి భూరిగా సత్కరించాడు. దేశవిదేశాల నుంచి వచ్చిన రాయబారులకు చీని చీనాంబరములనిచ్చీ, జలతారు శాలువలతోనూ సత్కరించాడు.…
ఉపాసనాఖండము మొదటి భాగము
సుధర్మా -చ్యవన సంవాదం
సూతమహర్షి తరువాత కధనిలా కొనసాగించాడు ఓ మహర్షులారా! తండ్రి ఆదేశమును మీరలేని హేమకంఠుడు తన తల్లియైన సుధర్మను ప్రేమగా సమీపించి ఇలా అన్నాడు. “ఓ తల్లీ! నన్ను యిలా ఒంటరిని చేసి వెళ్ళటం మీకేమన్నా న్యాయమా? …