మార్తాండజన్మ శరీరలిఖనవర్ణనమ్
దివాకరుడు, శాశ్వతుడు నిర్గుణుడు అని తెల్పితివి. తరువాత పండ్రెండు మూర్తులతో జన్మించినట్లు తెల్పితివి. తేజోరాశియైన ఆ వెలుగు స్త్రీ గర్భమందెట్లున్నది. ఎట్లు పుట్టెను. ఇది మాకు పెద్ద సంశయము. తీర్పుమని మునులడుగ బ్రహ్మయిట్లనియె. …
మార్తండ మాహాత్మ్యము
మునులనిరి : - పితామహ ! సూర్యకథ నెంతవిన్నను తృప్తిలేదు. అగ్నిరాశివలె వెలుంగు నీ మూర్తికి ప్రభావమెందుండి యయ్యెనో తెలియనెంతుము. ఇంకను నా శుభచరిత్ర మాకానతిమ్ము. …
రుద్రాఖ్యానము
సర్వాంతర్యామియైన రుద్రుడు ఉమాదేవికి ప్రియము చేయువాడై సర్వదేవతలను సిద్ధ విద్యాధరులను ఋషులను గంధర్వ నాగ యక్షాదులను మఱి యజ్ఞమునకు వచ్చిన అందరిని పారద్రోలి సర్వశ్రేష్ఠ పదార్థములతో నిండిన యజ్ఞమును సర్వ సంభారములతో నశింపజేసెను. స్వామి ప్రతాపమున కడలి ఇంద్రాదులు శాంతి కరవై కైలాసమున కేగి వరదుడైన ఆ శూలపాణిని దక్షయజ్ఞ ధ్వంసకుడైన భగవంతుని శరణందిరి. అప్పుడు పరమశివుడు…
పార్వతి తపోవర్ణనము
బ్రహ్మ యిట్లనెను : - అఖిల దేవతా మండలి ఆ జగజ్జనని కడకేగి, ఓదేవీ ! తపము వలదు. శీఘ్రకాలములో నా నీలకంఠుడు ఏతెంచి నీకు భర్త కాగలడు. అని నచ్చజెప్పి ప్రదక్షిణముచేసి వెళ్ళిపోయిరి. ఆమె తపస్సు విరమించెను. తన పర్ణశాల గుమ్మమున నున్న యశోకము క్రింద నామె వసించెను. అంతట ఇందుతిలకుడు సురార్తిహరుడునగు హరుడు వికృతరూపియై పొట్టిచేతులు సొట్టముక్కు రాగిజడలు వికృతముఖము మఱిగుజ్జునైవచ్చి దేవి ! నిన్ను…
ఉమామహేశ్వరకల్యాణ వైభవము
బ్రహ్మ యిట్లనియె :-
విశాలమైన హిమవత్పర్వతము మీద విమానముల సమ్మర్ధ మధికమయ్యెను. పార్వతి స్వయంవర సన్నాహమునందు గిరిరాజు తన కుమార్తె అభిప్రాయము హరునిపై నుండుట నెఱింగియును, వంశాచారము పాలించుటకు స్వయంవర వార్తనెల్ల లోకములందును చాటింపు వేయించెను. దేవదానవసిద్ధ గంధర్వాదులందఱి సమక్షమున నా కూమారి బ్రహ్మవరకుగల దేవతలందు పరమేశ్వరుని వరించునేని అదినా పుణ్యము సంస్తవనీయము. నా అభ్యుదయములకది అనుకూలము. అని మదినెంచి తన…
ఉమామహేశ్వర కల్యాణ బ్రహ్మాదికృత శివస్తుతిః
ఉమా మహేశుల వివాహమిట్లు జరుగగా ఇంద్రాదులగు అమరులెల్లరు ఆనందభరితులయి మహేశ్వరునికి ప్రణమిల్లి తొలిపలుకులను ఇట్లు వినుతింపదొడగిరి. ఇట్లు జగత్పతి. భగవంతుడు అయిన ఉమాపతి ఎల్లసురులచే వినుతుడై ఓ నిర్జరులారా ! మీకు నేను జూడ సౌమ్యుడనైతిని.…
మదన దహనము
మహాదేవుడు నిజభవన మందాసనమున గూర్చుండ దుష్టుడగు మన్మథుడాయనను వేధింప నేతించెను. అది యెరింగి ఆ ఆతతాయిని శిక్షింప నిటలాక్షుండు తృతీయ నేత్రమున వీక్షింప - నమ్ముక్కంటి మంటకెఱయై యనంగుడు మూర్చవడెను. ఆయన సతి రతి మిక్కిలి శోకించెను. అంత జాలిగొని ఆ ఉమా శంకరులు రతీదేవింగని యిట్లనిరి. …
దక్షయజ్ఞ విధ్వంసనము
ఋషులు పలికిరి:-
వైవస్వత మన్వంతరమున ప్రాచేతసుడగు దక్ష ప్రజాపతియొక్క అశ్వమేధయాగమెట్లు నాశమొందెను. దేవియొక్క క్రోధవ్యాపానమెఱింగి సర్వాత్మకుడగు ఈశ్వరుడెట్లు కోపించెను? అమిత తేజోవంతుడగు దక్షుని యాగము మహాదేవునిచే రోషముతో నశింపచేయబడిన వృత్తాంతమును సవిస్తరముగ మా కెఱింగింపుము ఋషులతో బ్రహ్మ యిట్లనియె! మేరు శృంగమొకటి ''జ్యోతి…
దక్షకృత శివస్తుతిః
దక్షకృత శివస్తవము
బ్రహ్మ యిట్లనియె:- దక్షప్రజాపతి శంభు ప్రభావముగని ప్రాంజలియై ప్రణతుడై ఇట్లు స్తుతింప నారంభించెను. ఈ దక్షకృత శివస్తుతి శివసహస్రనామావళి రూపము. పారాయణ ప్రథానము కావున 2-81 శ్లోకముదాక తాత్పర్యము వ్రాయబడలేదు శివుని విరాడ్రూపమున వినుతించిన ఘట్టము …
ఏకామ్రక్షేత్ర మాహాత్మ్యము
లోమహార్షణుం డిట్లనియె:- మునివరులార! వ్యాసులు తెలుపుచుండ రుద్రుడు కోపించిన మీదట జరిగిన పుణ్యకథను పార్వతి రోషము శంభుని క్రోధము వీరభద్రుని యెక్కయు, భద్రకాళి యొక్క అవతారము దక్షయజ్ఞ ధ్వంసము శంకరుని ఆద్భుత విక్రమము తిరిగి ఆయన మహాత్ముడగు దక్షునికి ప్రసన్నుడగుట రుద్రునకు యజ్ఞ భాగమిచ్చుట దక్షునికి క్రతుఫలము లభించుట చూచి సంప్రీతులు విస్మితులునై ఋషులు వ్యాసుని తక్కిన …
ఉత్కల క్షేత్రవర్ణనము
విరజయను క్షేత్రమందు విరజయను తల్లి సరస్వతీదేవి సుప్రతిష్ఠింపబడినది. ఆమెను దర్శించి మనుజుడు ఏడు తరముల వారిని పవిత్రులను చేయగలడు. ఆ దేవిని ఒక్కమారేని దర్శించి పూజించి మ్రొక్కినవాడు తన వంశమును ఉద్ధరించి ఆ లోకమున కేగును. ఆ విరజ క్షేత్రమున లోకమాతలు ఇంకా ఎందఱోయున్నారు. వారు సర్వపాపహారిణులు భక్తవత్సలలు, వరప్రదాత్రులు. అక్కడ సర్వపాపహారిణి వైతరిణీనదిఉన్నది. అందు స్నానముచేసిన నరోత్తముడు సర్వపాపవిముక్తుడగును.…
అవంతీ వర్ణనము
బ్రహ్మ యిట్టనియె
విప్రులారా! మున్ను కృతయుగమునందు'' ఇంద్రద్యుమ్నుడు'' అనురాజుండెను. అతడింద్రతుల్య పరాక్రముడు. సత్యవాది శుచి సమర్థుడు సర్వశాస్త్ర విశారదుడు. రూపవంతుడు,శుభగుడు, శూరుడు,దాత,భోక్త,ప్రియభాషి. యజ్వ బ్రహ్మజ్ఞాని, సత్యప్రతిజ్ఞుడు,ధనుర్వేదమందు వేదమందు శాస్త్రమునందు నిపుణుడు స్త్రీపురుషులకు పున్నమచంద్రుడిలా ఆనందకరుడు. ప్రతాపమున సూర్యుడట్లు తేరిపారజూడ అలవికానివాడు. శత్రుకూటమునకు భయంకరుడు విష్ణుభక్తుడు. సత్త్వశాలి. జితక్రోథుడు జితేంద్రియుడు. యోగశాస్త్ర సాంఖ్య (జ్ఞాన) శాస్త్రముల అధ్యయనము…