జంబూద్వీపవర్ణనము రెండవ భాగము
సూతుండిట్లనియె : -
క్షీరసముద్రముచే జంబూద్వీపము చుట్టబడినట్లు ప్లక్షద్వీపము లవణోదధిచే పరవృతమై యున్నది. జంబూద్వీప విస్తృతి లక్ష యోజనములు, దానికి రెట్టింపు ప్లక్షద్వీపము. ప్లక్షద్వీపేశ్వరుడు మేధాతిది. వాని కుమారులు ఏడుగురు. శాంతమయుడు (జ్యేష్ఠుడు) శిశిరుడు సుఖోదయిడు ఆనందుడు…
పాతాళప్రమాణకథనమ్
లోమహర్షుణుడిట్లనియె -
మునిశ్రేష్ఠులరా ! భూమియొక్క వైశాల్యము డెబ్బదివేల యోజనములు, దానియెత్తునంతే. ఒక్కొక్క పాతాళము వైశాల్యము పదివేల యోజనములు. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము, యనునవి సప్తపాతాళములు. అచట కృష్ణా శుక్లా అరుణా పీతా శర్కరా శైలకాంచనీ అను భూములు ఉత్తమసౌధములతో నొప్పుచుండును. ఆ ప్రదేశములందు దైత్యదానవ జాతులు వందలకొలది గలరు. బ్రాహ్మణొత్తములారా!…
నరకవర్ణనమ్
లొమహర్షణు డిట్డనెయె -
ఓ విప్రులారా ! పాపాత్ములు పడవేయబడు రౌరవాది నరకములనుగూర్చి యిక వినుడు. రౌరవము - శౌకరం - రోధము తాలము - విశసనము - మహాజ్వాల - త ప్తకుడ్యము మహాలోభము - వియోచనము రుధిరాంధము…
భూర్ఛువ స్సువరాదిలోకవర్ణనమ్
ఓ లోమహర్షణ ! నీవు సర్వమును మాకు దెలిపితివి. భువర్లోకము మొదలగు లోకములను , గ్రహసంస్థానమును వాని ప్రమాణమును తెలుపుము. అని మునులడుగ లోమహర్షణు డిట్లనియె. సూతుడిట్లనియె : - …
ధ్రువసంస్థితినిరూపణమ్
సూతుడిట్లనియె: -
భగవంతుడగు హరియొక్క తారా (నక్షత్ర)మయమైన రూపము శిశుమార నక్షత్ర మంతరిక్ష చక్రమునందు ప్రకాశించుచున్నది. దాని తోక యందు ధ్రువుడున్నాడు. అతడు దాను దిరుగుచు చంద్రాదిత్యాది గ్రహములను ద్రిప్పుచున్నాడు. తిరుగుచున్న యీ ధ్రువుననుసరించి నక్షత్రముల చక్రమువలె తిరుగుచుండును. సూర్యచంద్రులు తారానక్షత్రగ్రహ సమూహము వాయుమయములైన బంధములచే ధ్రువుని యందు అనుబద్ధములై యున్నవి. అంతరిక్షమందు జ్యోతిశ్చక్రము శిశుమారాకారమున (మొసలివలె) నున్నదని…
సర్వతీర్థ మాహాత్మ్యము
సూతుడిట్లనియె:- ఎవని చేతులు పాదములు మనస్సు స్వాధీనములు చేయబడునో, జ్ఞానము తపస్సు కీర్తియునెవ్వనికి గల్గునో ఆతడు సర్వతీర్థముల సేవించిన ఫలమందును. ఎవని మనస్సు మాట, ఇంద్రియములు పరిశుద్ధములో అవి వాని శరీర మందున్న తీర్థములే, అవి స్వర్గమార్గమును జూపగలవు. అంతఃకరణము దుష్టమైనయెడల తీర్థములందెన్నింట మునిగినను ఆశుచియైన కల్లుకుండ నూరుమారులు నీటగడగినను శుచిగానట్లు పరిశుద్ధము గానేరదు. తీర్థములు దానములు…
స్వయంభూ బ్రహ్మర్షి సంవాదః
ప్రవచన నిపుణా! పృథివి యందు ఉత్తమ మయినది ధర్మార్థకామమోక్షములను ఒసంగునదియగు భూమిని తీర్థములకెల్ల ఉత్తమ తీర్థమును తెల్పుమని మునులడుగ సూతుడిట్లు చెప్పదొడంగె, మున్ను మునులీప్రశ్నను మా గురువులనడిగిరి. కురుక్షేత్రమున నానాతరులతా పుష్పఫలోపశోభితమైన తన ఆశ్రమమునందు ఆసీనుడైయున్న మహాభారతకర్తను సర్వశాస్త్ర విశారదుని ఆధ్యాత్మనిష్ఠుని…
భారత వర్ష వర్ణనము
బ్రహ్మయిట్లనియె:- భుక్తి ముక్తి ప్రదమై వేదసమ్మితమైన పురాణ మెరిగించెద. వినుండు. భారతవర్షము కర్మభూమి యనంబడు. కర్మఫలభూములు స్వర్గము నరకమును. బ్రాహ్మాణాదులీ భారత వర్షమందే స్వకీయ కర్మముల నాచరించి సిద్ధి పొందిరి. ఇందు సందియము లేదు. ధర్మాది పురుషార్థప్రదము ఈ భూమి. ఇంద్రాదులు ఇచట శుభకర్మము ఆచరించి ఇంద్రాది పదవులందిరి. ఈ…
కోణాదిత్యమాహాత్మ్యము
దక్షిణ సముద్ర తీరమందు ఓఢ్రదేశము గలదు. అది స్వర్గ మోక్షప్రదము. సముద్రమునకు ఉత్తరముగా విరజమండలము సరిహద్దుల దాక అది యున్నది. అచటి బ్రాహ్మణులు జితేంద్రియులు. తపస్స్వాధ్యాయనికతులు. వంద్యులు పూజ్యులును. యజ్ఞదాన వివాహాది శుభకర్మములందు శ్రాద్ధాదులయందు వీరు చాలా ప్రశస్తులు. షట్కర్మనిరతులు. ఇతిహాస పురాణార్థ విశారదులు. సర్వశాస్త్రార్థ సమర్థులు. మాత్సర్యహీనులు పుత్ర దారధనక్షేత్రసంపన్నులు. సత్యవచనులు. దాతలు. క్షత్రియాది వర్ణముల…
సూర్యపూజా ప్రకరణము
మీరు చెప్పిన భాస్కర క్షేత్ర మహిమ వింటిమి. కాని మాకు తృప్తి కలుగలేదు. కావున పూజా విధానము,దానము నమస్కారము,ప్రదక్షిణము,ధూప దీపాది సమర్పణ ఉపవాసము, సూర్యాలయమార్జనము-మొదలగు వాని విశేషములను వినగోరెదము. సూర్యప్రీతికరములైన పూవులను, నమస్కారవిశేషములను, సూర్యార్ఘ్యవిధానము, సూర్యునుద్దేశించి చేయు నుపవాసము, నక్తము (పగలుపవాసముండి రాత్రి భోజనముచేయుట) మొదలగువాని ఫలము, దేశకాల విశేషములను వినవలెనని కుతూహలపడుచున్నాము. అని మునులడుగ బ్రహ్మయిట్లనియె. …
ఆదిత్య మహాత్మ్యము
సూర్య భగవానుని మహిమ నీవు చెప్పగా విన్నాము. ఇంకను విన కుతూహలమగుచున్నది. బ్రహ్మచర్యాశ్రమస్థులు ముక్తినందుటకు ఏ దేవతను ఉపాసింపవలయును. స్వర్గమునుండి దిగజారకుండుటకు ఏమిచేయవలయును? దేవతలకు పితృదేవతలకు పరమ దేవత ఎవరు? ఈ సృష్టి ఎవనివలన నగును? ఎవ్వనియందు లీన మగును. తెలుప వలయును. …
ఆదిత్య మాహాత్మ్య వర్ణనము
బ్రహ్మయనియె:- ఓ మునులారా ! దేవాసుర మానుషమైన సర్వజగత్తు ఆదిత్య మూలము. ఈ తేజస్సు ఇంద్రోపేంద్రాది సర్వదేవతామయము. పరమదైవతమిదియే. అగ్నియందు యధావిధి వేల్వబడిన ఆహుతి ఆదిత్యు నందును, ఆదిత్యునివలన వృష్టి, వర్షమువలన అన్నము దానివలన ప్రజలు గల్గుదురు. ధ్యాననిష్ఠులకు ధ్యానము మోక్షులకు…