ఆదిత్యవంశాను కీర్తనమ్
లోమ హర్షణుడిట్లనియె:-
సత్యవ్రతుడు భక్తితో కృపతో పట్టుదలతో వినయముతో విశ్వామిత్రుని భార్యను భరించెను. మృగములవేటాడి తెచ్చిన మాంసము నమ్మునియాశ్రమ సమీపమున చెట్టుకొమ్మకు వ్రేలాడగట్టెను. ఉపాంశువ్రతమూని (ఇంద్రియములను మనసును నిగ్రహించి-చేయువ్రతము) ద్వాదశవార్షిక దీక్షగొని తండ్రియాదేశమున నాదేశమందు వసించెను. యజ్ఞకర్తలకు కులగురువులకు గల సంబంధము నమసరించి వశిష్ఠుడయోధ్యా రాజ్యమును రాణివాసమును తానే బర్యవేక్షించెను. సత్యవ్రతుడు మాత్రము అజ్ఞానమువలన భావి దైవ ఘటనమువలనను కులగురువగు వశిష్ఠుని…
సోమోత్పత్తి వర్ణనం
సూతుండిట్లనియె : - ఓ విప్రులార ! సోముని అత్రి భగవానుడు ఋషి అయన బ్రహ్మమానస పుత్రుడు. అతడు గొప్ప తపమొనరించినవాడు. అతడు మూడువేల దివ్య సంవత్సరములు తపమాచరించెనని ప్రసిద్ధి. ఆయనయొక్క తేజస్సు మీదికి జిమ్ముకొనెను. అదియె సోమరూపము దాల్చెను. అయన కళ్ళ నుండి నీరు దిక్కుల ప్రకాశింపజేయుచు. పది తెఱంగుల స్రవించెను. దశదిశాధిదేవతలేకమై విధియానతి నా తేజస్సును ధరింపబోయు శక్యముగాక జారవిడిచిరి. వసుధవై…
సోమ వంశ వర్ణనమ్
సూతు డిట్లనియె : - ఓ మునిశ్రేష్ఠులారా ! బుధుని కుమారుడు పురూరవుడు. విద్వాంసుడు, తేజశ్శాలి. దాత. విపుల దక్షిణలిచ్చిన యజ్వ. బ్రహ్మవాదీ యుద్ధమునందు శత్రువునలకందని వాడు. నిత్యాగ్నిహోత్రి-యజ్ఞకర్త. మహీపతి సత్యవాది. పుణ్యమతి, నిగూఢమైథనుడు, ముల్లోకములందు అనుపమ కీర్తిశాలి. అట్టివానిని బ్రహ్మవాదిని (వేదాధ్యయన రతుని) శాంతుని ధర్మజ్ఞుని సత్యవచనుని యశస్విని యగు ఊర్వశి అభిమానము (గుట్టు) విడిచి వరించెను. …
సోమ వంశ వర్ణనమ్ రెండవ భాగము
లోమహర్షణు డిట్లనియె : -
ఆయుఫుపుత్రులు మహరధులయిదుగురు స్వర్భానుని (రాహువు) కుముర్తె ప్రభయనునామెయందు జన్మించిరి. వారు సహుషుడు - వృద్ధశర్మ-రంభుడు - రజి - అనేనుడు, అనువారు త్రిలోకప్రసిద్దులు. రజి యైదువందలమంది కుమారులంగనెను. ఈ క్షత్రకుటుంబము రాజేయమని ప్రసిద్దికెక్కినది. ఇంద్రునికి గూడ ఇది భయంకరమయ్యెను. దేవాసురయుద్దమైన తఱి నయ్యుభయులును మా యిర్వురకును జరుగు యుద్దమందెవ్వరు…
సోమోత్పత్తి వర్ణనం
సూతుడిట్లనియె : - పితృకన్యయగు విరజయందు మహాతపస్వియగు సహుషుని. ఇంద్రతల్యులైన ఆర్వురు కుమారులుదయించిరి. వారు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, యాతి, నుమాతి అనువారు. అందు యయాతి రాజయ్యెను. అప్పరమ ధార్మికుడు కకుత్ద్స కన్యను గోవు యను నామెను వివాహమాడెను. యతి మునియై మోక్షమార్గమందుండి బ్రహ్మీభావమందెను.
యయాతిసోదరులు ఐదుగురు రాజ్యముం గెల్చుకొని ఉశనసుని (శుక్రుని) తనయను దేవయానిని భార్యగ గైకొనెను. మఱియు వృషపర్వుడను…
పురు వంశ వర్ణనమ్
సూత! పురువంశమును, ద్రుహ్యుడు అనువు యదువు తుర్వసుడు నను వారి వంశములను వేర వేర వినవలతునుని భ్రాహ్మణులడుగ సూతుండిట్లనియె. మునిపుంగవులరా! మొదట మహాత్ముడైన పూరువు వంశమును గూర్చి మొదటినుండి విస్తారముగా జెప్పుచున్నాను. వినుడు. …
శ్రీ కృష్ణజన్మానుకీర్తనమ్
సూతుడిట్లనియె : -
క్రోష్టుని భార్యలు గాంధారి మాద్రియును, గాంధారి అనమిత్రుని మాధ్రి యుధాజిత్తును దేవమీఢుఘడనను నిద్దరింగనెను. వారివంశమే వృష్టి వంశముగా మూడు శాఖలుగా వృధ్ది నందెను. మాద్రికొడుకులు వృష్ణి అంధకుడు. అనువారు శ్వఫల్కడు, చిత్రకుడనువారు వృష్ణియొక్క కుమారులు. …
వృష్ణి వంశ వర్ణనమ్
సూతుడిట్లనియె : -
క్రోష్టునికి వృజినీవంతుడు పుట్టెను. వానికి స్వాహి. యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడు . స్వాహి కుమారుడు ఉషద్గువు. అతడు సంతతి కొఱకు భూరి దక్షిణములైన యజ్ఞములు చేసి చిత్రరథుడను కుమారునిం బడసెను. అతడు మంచి కర్మిష్ఠి. వాని కుమారుడు శశబిందువు యజ్వ. విపులదక్షిణుడు. రాజర్షుల వర్తనము ననుష్ఠించినవాడు. శశిబిందుని నందనుడు పృధుశ్రవుడు యశస్వి రాజయ్యెను. పురాణవిదులాతని కుమారుని అంతరుడని చెప్పుదురు. …
స్యమంతక ప్రత్యానయనమ్
సూతుడిట్లనయె :- భజమానుని సుతుడు రథముఖ్యుడు, విదూరథుడు, విదూరథుని కుమారుడు వీరుడగు రాజాధిదేవుడు. వానికిదత్త - అతిదత్త - శోణాశ్వ - శ్వేత వాహన - ళమి-దండశర్మ -దంతశత్రు - శత్రుజిత్తులు అనుసుతులు. శ్రవణ శ్రవిష్ఠ యును కుమార్తెలు కలిగిరి, శమికుమారుడు ప్రతిక్షత్రుడు, వానికి స్వయంభోజుడు, వానికి భదికుడు కల్గిరి. వాని కుమారులు భీమ పరాక్రములు. వారిలో కృతవర్మ జ్యేష్ఠుడు. శతధన్వ మధ్యముడు. దేవాంతకుడు, నరాంతుడు. భిషక్కు పైతరుణుడు సుదాంతుడు - అతిదాంతుడు నికాశ్యుడు…
శ్యమంతకోపాఖ్యానము
సూతుడిట్లనియె
శ్రీ కృష్ణుడు సత్రాజిత్తునకు మణిరత్నము నొసంగగా, దానిని బభ్రువు, (అక్రూరుడు) భోజవంశీయుడగు శతధన్వునిచే హారింపజేసెను. అక్రూరుడవకాశము కనిపెట్టి శ్యమంతకమడుగున దాగి యుండెను. శతధన్వుడు సత్రాజిత్తును సంహరించి రాత్రివేళ మణింగొనివచ్చి అక్రూరునకొసంగెను. అక్రూరడదిగొని ఈ విషయమెవ్వరికి ఎన్నడును దెలుపనని వానిచే ప్రమాణము చేయించెను. …
భువనకోశద్వీప వర్ణనమ్
మహామతియగు నీవు భరతరాజుల యొక్కయు, దేవదానవ గంధర్వ యక్షోరగాదుల యొక్కయు అద్భుతములగు చరిత్రలను స్థావర జంగమాదుల సృష్ట్యాదులను*మృదుమధురముగ, మనః శ్రవణానందకరముగ జెప్పితివి. ఆహా! ఇప్పుడు భూమండల స్వరూపము విన కుతూహలులమై ఉన్నాము.భువనకోశ సంస్థాన మవధానమున విననున్న మాకది ఆదరములో ఆనతిమ్మని మునులడిగిరి. …
జంబూద్వీపవర్ణనము
సూతుడిట్లనియె : -
సముద్రమునకు ఉత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము గలదు. అందలిసంతతి ''భారతి'' యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమియని దీనికిపేరు. కోరినవారికి స్వర్గము మోక్షమును గూడ నిందే యున్నవి. ఇందు మహేంద్రము మలయము-సహ్యము-శుక్తిమంతము-ఋక్షము-వింధ్యము-పారియాత్రములను సప్తకుల పర్వతములున్నవి.…