బలి ఇలా అన్నాడు:-
పితామహా! మీరు నాకు అంతయు వివరించారు జనార్దనుని చక్కగా ఆరాధించిన వారలకు ఏ పదవి కలుగుతుందో వివరించండి ఏ విధంగా ఆరాధిస్తే ప్రభువు సంతోషిస్తాడు? ఆ జగద్గురువు ప్రీతికై ఏ యే దానాలు తగినవి? ఉత్తమమైనవి ఏ యే తిథులలో ఉపవాసాదు లాచరిస్తే ఆ దేవుడు ప్రీతు డౌతాడు? సంతోష స్వాంతులూ సోమరులు కాని వారలు యింకా ఏమేమి చేయవలెనో అదంతా చెప్పండి అది విని ప్రహ్లదుడిలా…
శునీ మోక్షప్రాప్తి
నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను. మహారాజా! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు,…
పుష్కరిణి - ఫలశ్రుతి
నారదమహర్షి రాజర్షి అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడింటిలోనే తిధియందు వైశాఖస్నానాదులను…
వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం
మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసం గా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది. వైశాఖ మాసం…
శ్రీ వామన పురాణం సంపూర్ణం
ఓం నమో నమః కారణ వామనాయ
ఓం నమోభగవతే వాసుదేవాయ!
ఫలశ్రుతి పులస్త్యుడిలా అన్నాడు :-
బ్రహ్మర్షీ నారదా ! పుణ్య తమమైన ఈ వామన పురాణాన్ని నీకు సాకల్యంగా వినిపించాను. దీనిని శ్రద్ధా భక్తుల తో వినినా పఠించినా కీర్తించినా విష్ణు పద ప్రాప్తి కలుగుతుంది. గంగా నదీ జలాల్లో మునిగి నందున పాపాలు తొలగు…
నైమిశారణ్య వర్ణనమ్
శ్రీమాత్రే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ…
సృష్టి కథనము
ఇట్లు ప్రజాపతి ప్రజలను సృజించి అయోనిజయైన శతరూపను బత్నిగ బడసెమ. ద్యులోకము నావరించి యుండెడి ఆపవునియొక్క మహిమచే ధర్మముచే శతరూప జనించినది, ఆమె పదివేలేండ్లు దుశ్చరతపమ్ముజేసి తపోదీప్తుని స్వాయంభువమనువును భర్తనుగా బొందెను. డెబ్బదియొక్క మహాయుగములా మనువుయొక్క ఆయుర్దాయము. అదే మన్వంతర మనబడును. ఆ పైరాజుని వలన శతరూప వీరుడను…
దేవాసురాణా ముత్పత్తి కథనం
మునులు లోమహర్షణ ! దేవదానవ గంధర్వోరగ రాక్షసులయొక్క ఉత్పత్తిని విపులముగ తెలుపుమనిరి. ఆన లోమహర్షణుడిట్లనియె స్వయంభువునాజ్ఞచే దక్షుడు సృష్టిచేయనారంభించెను. తొలుత మనస్సుచే భూతముల సృజించె. వారు దేవదానవ గంధర్వయక్షరాక్షసాదులు. కాని యాసంతతి యంతగ పెరుగదయ్యెను. అప్పుడు మైథున ధర్మముచే దానిం బెంపదలచి అసిక్నియను దానిని వీరణుడను ప్రజాపతికూతురుం గ్రహించెను. తపస్విని…
పృథుప్రభృతి సర్వదేవాదీనాం రాజ్యాభిషేక వర్ణనమ్
మహదేత దధిష్ఠానం పురాణ తదధిష్ఠితమ్
లోమహర్షుడు ఇట్లనియె.
బ్రహ్మ వేనుని కుమారుని పృథుని చక్రవర్తిగా నభిషేకించి క్రమముగా వారివారికి రాజ్యములను నిర్ణయించియిచ్చెను. ద్విజులు ధాన్యములు నక్షత్రములు గ్రహములు యజ్ఞములు తపస్సులు అను వాని రాజ్యాధికారమందు సోమునకు పట్టాభిషేకము చేసెను. అప్పులకు వరుణుని, రాజులకు రాజరాజును, (కుబేరుని) అదిత్యులకు విష్ణుని, వసువుల…
మన్వంతర కీర్తనము
ఋషులు పలికిరి: -
ఓ బుద్ధిశాలీ లోమహర్షణ ! మన్వంతరముల నన్నింటిని వానియొక్క విశేష సృష్టిని వర్ణింపుము. మనుపు లెందరో వారి కాలమేదియో వారి సమయమందు జరిగిన విశేషములేవియో స్పష్టమున నెఱుగ గోరెదము. మన్వంతరములను గూర్చిన చరిత్ర…
ఆదిత్యోత్పత్తి వర్ణనమ్
సూతు డిట్లనియె :-
ద్విజోత్తములారా ! కశ్యవునికి దక్షసుతయందు వివస్వంతుడుదయించెను. అతని భార్య సంజ్ఞ. ఆమె త్వష్టృ ప్రజాపతి కుమార్తె. నురేశ్వరియను పేర త్రిలోక ప్రఖ్యాతి నందినది. రూపవనశాలినియైన యా దేవికి భగవంతుడగు వివస్వంతుని యొక్క (మార్తాండుని యొక్క) యంద మంత యానందమీయదు . ఆమె మంచి తపస్సుచేసి మంచి దీప్తి గడించుకొన్నది.…
సూర్యవంశ నిరూపణమ్
లోమహర్షణుడు పలికెను : -
వైవస్వతమనువునకు తొమ్మండుగురు కుమారులు గల్గిరి. వారు తండ్రియంతవారు. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, రిష్టుడు, కరూశుడు, పృషధృడు యనువారు. వారు కలుగక ముందు మనువు మిత్రావరుణులను ఉద్దేశించి పుత్రకామేష్టినొనసరించెను. అందతుడు మిత్రావరుణులనెంచి యాహతులిచ్చెను. అక్కడ దివ్యాంబరాభరణములు దాల్చి దివ్యశరీరముతో ఇలయను అంగన యావిర్భవించెనని వినికిడి. మనువు దండధరుడై ఆమెను ఇలా ఇలాయని పేర్కొని ఓ కల్యాణి నావెంటరమ్మని పిలిచెను. పుత్రకామియైన ఆ ప్రజాపతింగని ధర్మయుక్తముగ…