Srimad Bhagavatha Sapthaham - Vrindavan - 2025
వైభవోన్నతమైన వృందావనంలో శ్రీమద్ భాగవత సప్తాహం - వృందావన శ్రీమద్ భాగవత సప్తాహానికి రిజిస్టర్ చేసుకోండి - "దివ్య లీలల సాక్షిగా - వైభవోన్నతమైన భాగవత కథలు"
Limited members - from Rs. 10,000/-
Register on WhatsApp 099516 33336
శ్రీమద్ భాగవతం, భక్తి రసామృతమై నిలిచిన మహాగ్రంథం. ఈ పురాణం మానవ జీవితానికి అర్థాన్ని ప్రసాదించే అద్భుతమైన నిధి. "యద్ భగవద్గీతా సారః,…
శౌచవిధి
మలములను వదలుకొని శుచి కావటం కాబట్టి దీనిని శౌచవిధి అన్నారు. నిజానికి ఇది అశుచికార్యం. దీనిని శౌచ విధి అని పిలవటంలో మన సంప్రదాయపు విలువ ఇమిడిఉంది. బియ్యం అయిపోతే ''బియ్యం నిండుకున్నాయి'' అంటారు. ''దీపం ఆరిపోయింది'' అనకుండా ''దీపం కొండెక్కింది'' అంటారు. ఒంట్లు లెక్క పెడుతూ 6 తరువాత ఆరున్నొక్కటి అంటారు. ఏడు అనరు. అమంగళమైన కుజవారాన్ని మంగళవారం అంటారు. ఇలా…
దంతధావనం
రాత్రి నిద్రాసమయం అంతా నోరు మూసుకుని ఉండడంవల్ల నోటిలో పాచి ఏర్పడుతుంది. అట్టి చెడుని పోగొట్టి నోటిని శుద్ధి చేసుకునే కార్యక్రమమే దంతధావనం. దంతధావనమంటే పళ్లు తోముకోవడం. పళ్లను సరిగా తోముకోనివారికి పళ్ళ సందులలో పదార్థాలు మిగిలిపోయి, కుళ్లి, రోగకారణా లవుతాయి. దానితో పళ్లు దెబ్బతింటాయి. పంటి పోటు, పుప్పిపళ్లు తయారు కావడం, పళ్లు వదులై ఊడిపోవడం జరుగుతాయి. ఇంకా వాటి ప్రభావం లాలాజలాది గ్రంథులమీద,…
స్నానము
మన మహర్షులు
నిత్యం స్నానం నరః కుర్యాత్ నిశాపాయే ప్రయత్నతః
అన్నారు. అనగా రాత్రియొక్క చివర అంటే తెల్లవారుతూనే మనం తప్పక స్నానం చేయాలి అని అర్థం. శాస్త్రవిధిని పాటించడం ధర్మం. దానిని పాటించకపోవడం అధర్మం. ఎందుకు స్నానం చేయాలనే విషయంలో వ్యాసభగవానుడు.
అస్నాత్వా నాచరేత్ కర్మ జపహోమాది కించన
…
స్నానానికి వర్జ్యనిషేధం లేదు.
స్నాన దాన జపాదికే ప్రశస్తా విషనాడికా -
స్నానం, దానం, జపాలకు వర్జ్యం ప్రశస్తమైనదిగా చెప్పబడింది. రోగి అయినవానికి అశుచి ఏర్పడితే కానీ, తప్పక వ్రతాదికం ఆచరింపవలసి వచ్చినప్పుడు కానీ వానికొరకై వేరొకరు స్నానం చేసే విధానం కూడా ఉంది.
మజ్జయేత్తు యముద్దిశ్య -అష్టమాంశం లభేత సః
…
వస్త్రధారణ
స్నానానంతరం కర్తవ్యం వస్త్రధారణ. వస్త్రధారణ మనుజుని అభిమానానికి చాలా ముఖ్యమైనది. అలంకారాలలో ముఖ్యమైనదికూడా వస్త్రమే. ఆరోగ్యంపై దాని ప్రభావ మెంతో ఉంది. వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. దేశ, కాల, జాతి, వృత్తి భేదాలనుబట్టి వేషంలో మార్పుఉంటుంది. అలా ఎక్కడ ఎప్పుడు ఎలా వస్త్రధారణ చేయటం సముచితమో అలా ధరిస్తేనే వ్యక్తిత్వం పెరుగుతుంది. వస్త్రధారణ తనకు అన్నివిధాలా అర్హమయినట్లే చేయటం అవసరం. అధికారి పరిచారకునివలె,…
తిలకధారణ
వస్త్రధారణ కాగానే చేయదగినది తిలకధారణ. అలెగ్జాండర్ కేనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త మన కళ్ల మధ్య ఉండే భృకుటి ధన విద్యుత్ కేంద్రమనీ, మెడ వెనుక భాగం ఋణ విద్యుత్ కేంద్రమనీ చెప్పాడు. అట్టి మానవ ధన విద్యుత్ కేంద్రాన్ని ప్రభావితం చేయగలది తిలకధారణ. అది పీయూష గ్రంథి స్థానం. అదే జ్ఞానగ్రంది. తిలకధారణవల్ల అది ప్రభావితమవుతుంది.…
సంధ్యావందనం
సంధ్యావందన మనగానే అదేదో బ్రాహ్మణులకు మాత్రమే సంబంధించినదని చాలామంది అనుకుంటారు. నిజానికి సంధ్యావందనం కులమత భేదంలేకుండా అందరికీ ఆచరణీయమయినది. సంధ్యావందనం పేరిట ఉపనయనం అయినవారికి ఏర్పరచిన వ్యవస్థ వారికి ప్రత్యేక విధిని ఆదేశించింది. ఆ ఉపనీతులందరూ తమతమ గృహ్యసూత్రాలు చెప్పిన రీతిగా సంధ్యావందనాన్ని ఆచరిస్తూ ఉండేవారు.
అహరహ స్సంధ్యాముపాసీత
అనే వైదిక…
నిత్యపూజ
నిత్యమూ భగవంతుని పూజించాలి. "ఆ! ఈ పూజలకూ, పురస్కారాలకూ టైమ్ ఎక్కడుంటుందండీ! ఏదో ఒక దండం పారేసి మన త్రోవన మనం పోతూ ఉండడమే" అని పూజ చేయకపోవడాన్ని కొందరు సమర్థించుకుంటారు. దేవుడే ఇవ్వకపోతే మనకు టైమ్ ఉండదు కదా! కాబట్టి సమయం చూసుకుని పూజను తప్పక నిర్వహించాలి. మనసుంటే మార్గ ముంటుందనేది సత్యం. దేనినైనా పూర్తి విశ్వాసంతో చేయాలి. అన్యమతాలు విగ్రహారాధనను…
నిత్యపూజా ద్రవ్యసేకరణ
భగవంతుని పూజకై ద్రవ్యాలనన్నింటినీ ముందుగానే సిద్ధం చేసికొని, పూజను మొదలు పెట్టాలి తప్ప ఆయా వస్తువులకోసం మాటిమాటికీ లేస్తూ ఉండడం పద్ధతి కాదు. షోడశోపచారాలకు కావలసిన ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఎటువంటి ద్రవ్యమైనా పర్వాలే దనుకోకుండా ద్రవ్యశుద్ధికి ప్రాధాన్యమివ్వాలి. అన్యాయార్జితంతో భగవంతుని అర్చించడం తగదు. షోడశోపచారాలలో కీలకమైనవి పంచోపచారాలు.…
ఉపచారాలు
నిత్య పూజలో ఏ దేవతను ఆరాధిస్తున్నామో ఆ దేవతా పూజకు గానీ, ఆ దేవతా పూజకు ముందు చేసే మహాగణాధిపతి పూజకు గానీ ఆయా ఉపచారాలు చేయాలి. సాధారణంగా గావించే షోడశోపచారాలు చేయడానికి ఆ దేవతకు ప్రాణప్రతిష్ఠ చేయాలి. అప్పుడే ఆ పసుపుముద్దకైనా, విగ్రహానికైనా, ఏ రూపంలో ఉన్న దేవతకైనా మన ఉపచారాలను స్వీకరించడానికి, మనలను అనుగ్రహించడానికి తగిన స్థితి, శక్తి ఏర్పడుతుంది. కనీసంగా…
మహానివేదన
దేవుడు మనం పెట్టేవి తింటాడా? తినని దేవునికోసం పెట్టడం దేనికి? పెట్టకపోతే దోషమని కూడా అనడమెందుకు? అని కొందరి ప్రశ్న. దేవుడు ఎలా తింటాడో ఈ శ్లోకంలో చెప్పారు. “కపిత్థస్య ఫలే సారం యథా కుంజర భక్షణే …