Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ అగ్ని మహాపురాణం🌹🌹🌹 – పద్నాల్గవ అధ్యాయం

పాండవ చరిత వర్ణనమ్ : కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనాదులు మరణించారు. ధర్మరాజు రాజ్యాభిషిక్తుడయ్యాడు

అగ్ని ఉవాచ

ఓద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుండగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమము నుండి మరియొక ఆశ్రమమున సంచరించుచుండిరి.

విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసికొని, ధర్మ రక్షణము కొరకును, అధర్మ వినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూ భారమును హరించెను. విప్రశాపమను వంకచే, ముసలముచే, భూ భారకరమగు యాదవ కులమును నశింప చేసెను.

శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాస క్షేత్రము నందు తన దేహమునుపరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మ లోకము లందు స్వర్గ వాసులచేపూజింప బడెను. బలరాముడు ఆదిశేష రూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.

వినాశ రహితుడగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింప బడువాడు. అట్టి శ్రీకృష్ణుడు లేని ద్వారకను సముద్రముముంచి వేసెను.

అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదక ధనాది దానములు చేసెను. అష్టావక్రుని శాపముచే విష్ణు భార్యలుగా అయిన స్త్రీలను, మరలఅతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల గోపాలకులుఅర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను. వ్యాసు డాతనినిఊరడించెను. కృష్ణుడు న్నప్పుడే నా బలము అని అతడు గ్రహించెను. అతడు హస్తినా పురమునకువచ్చి, రాజ్య పాలకుడైన యుధిష్ఠిరునకు ఇదియంతయు చెప్పెను.

కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళి పోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదేరథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చినదానము వలె నష్టమై పోయెను.

ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్య పాలనకైనియోగించి, ఈ సంసార మనిత్య మను విషయముగ్రహించిన వాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తర శత నాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలు దేరెను.

ఆ మహా ప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడి పోయిరి. రాజు శోకాతురు డయ్యెను.ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారత కథనుచెప్పితిని. దీనిని పఠించిన వారు స్వర్గమునకు వెళ్లెదరు.


అగ్ని మహాపురాణములో మహాభారతాఖ్యానమను పడ్నాల్గవ అధ్యాయము సమాప్తము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment