Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ అగ్ని మహాపురాణం 🌹🌹🌹 – ఇరవై నాల్గవ అధ్యాయం

అథ ముద్రా లక్షణము | నారద ఉవాచ

దేవతా సాన్నిధ్యాదులను కలిగించు ముద్రల లక్షణమును చెప్పెదను. హృదయమునకు సమీపమున కట్ట బడిన అంజలి మొదటిముద్ర. రెండవది వందని. మూడవది హృదయానుగ.

ఎడమ చేతిపిడికిలిని బొటన వ్రేలు పైకి నిలచి ఉండు నట్లును, (అంజలి) కుడిచేతి బొటన వ్రేలు వంచి బంధించి నట్లును (వందని) ఉంచ వలెను.అట్లే రెండు పిడికెళ్ళ అంగుష్ఠములును పైకి నిలచి ఉండవలెను. (హృదయానుగ). ఈ మూడునువ్యూహాము నందు సాధారణ ముద్రలు. వరుసగా కనిష్ఠిక మొదలైన వాటిని విడువగా ఏర్పడిన ఎనిమిది ముద్రలు అసాధారణములు.

ఈ ఎనిమిదిముద్రలను పూర్వము చెప్పిన బీజములు ఎనిమిదింటికిని క్రమముగా వినియోగించవలెను.కనిష్ఠిక వరకును ఉన్న మూడు వ్రేళ్ళను అంగుష్ఠము చేత వంచి, పైకి ఉండునట్లును, సమ్ముఖముగాను చేసి నవమ బీజమునకు వినియోగించ వలెను. వామ హస్తమును తిరగ దీసి మెల్లగా పైకివంచ వలెను. అది వరాహ ముద్ర. అంగములకు వరుసగా ఈ చెప్పబోవు ఎనిమిది ముద్రలు ఉపయోగించవలెను. వామ ముష్టి యందు ఒక్కొక్క వ్రేలిని ముణిచి చూప వలెను. పూర్వ ముద్రను వంచ వలెను.దక్షిణ హస్తము నందు కూడ ఇట్లే చేయ వలెను. వామముష్టి యందలి అంగుష్ఠము నిలచి ఉండును.ఈ విధముగా చేసినచో ముద్రా సిద్ధి కలుగును.

అగ్ని మహాపురాణమునందు ముద్రాలక్షణమను ఇరవై నాల్గవ అధ్యాయము సమాప్తము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment