ఆచార్యాభిషేక విధానం – నారద ఉవాచ
శిష్యుడు ఆచార్యాభిషేకము ఎట్టు చేయవలెనో చెప్పదను. దీనిచేత సాధకుడు సిద్ధిని పొందును. రోగి రోగవిముక్తు డగును. రాజు రాజ్యమును, స్త్రీ కుమారుని, పాపవినాశమును పొందును.
తూర్పున ప్రారంభించి మంచి రత్నములతో కూడిన మట్టి కుండలను మండప మధ్యభాగమున ఉంచవలెను. వాటిని సహస్రావర్తితములు లేదా శాతావర్తితములు చేయవలెను. మండలమునందు తూర్పు – ఈశాన్యదిక్కులందు పీఠముపై విష్ణువును ఉంచి, సాధకునికిని, శిష్యునికిని సకలీకరణము చేయవలెను. పిమ్మట గీతాది పూర్వకముగా అచార్యునకు పూజ చేసి అభిషేకము చేయవలెను.
యోగ పీఠాదులను సమర్పింపవలెను. ”నీవు నరులను అనుగ్రహింపవలెను” అని ప్రార్థించవలెను. గురువు కూడ శిష్యునకు నియమము లన్నియు బోధించవలెను. ఈ విధముగా గురురక్షణ పొందిన శిష్యుడు అన్ని లాభములను సంపాదింపగలడు.
అగ్ని మహాపురాణములో ఆచార్యాభిషేకమను ఇరువది ఆరవ అధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹