సన్యాసధర్మ నిరూపణ
(సంస్కృతంలో ”సంన్యాస” అనే వుంటుంది. కొన్ని చోట్ల ”సన్యాస” అనే పదం కూడా కనిపిస్తున్నా తెలుగులో ఎక్కువగా కనిపిస్తున్నది ‘సన్యాసమే’. అను)
హే సజ్జనులారా! ఇపుడిక భిక్షు -ధర్మమను నామాంతరం గల సన్యాసధర్మాన్ని వినిపిస్తాను.
గృహస్థ వానప్రస్థాశ్రమాలలో తాను చేసిన అన్ని యజ్ఞాలకూ మకుటాయమానమైన ప్రాజాపత్య యజ్ఞాన్ని కూడా సంపన్నంచేసి చివరగా వేద విహిత విధానానుసారం సమస్త క్రౌతాగ్నులనూ తనలో ఆరోపించుకొని ఒక వ్యక్తి సన్యాసాన్ని పుచ్చుకోవచ్చును.
సన్యాసి అన్ని ప్రాణుల హితాన్నీ కోరాలి, శాంతుడై, త్రిదండాన్ని ధరించి వుండాలి. కమండలువును పట్టుకొని వుండాలి. అన్ని ప్రకారాల సుఖసాధనయుక్త భావాలనూ పరిత్యజించి, అహంకారాన్ని వదులుకొని భిక్షార్థిగా, ఏదో ఒక గ్రామాన్నాశ్రయించి బతుకును గడుపుకోవాలి. సాయంకాలం ఆ గ్రామంలో కనిపించరాదు.
యమనియమపాలన సన్యాసికి తప్పనిసరి. వాటిని పాటిస్తూ యోగసిద్ధిని గానీ పరమహంస స్థాయిని గానీ పొందిన సన్యాసి త్రిదండికానక్కరలేదు. వెదురు కర్ర నొక దానిని (ఏకదండి) పట్టుకోవచ్చు.
ఈ విధంగా సన్యాసాశ్రమాన్ని పాలించిన వారు తగిన సమయంలో ప్రాణాలను కూడా వదలివేసి అమరత్వమును పొందగలరు.
డెబ్భై ఐదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹