అఖండ ద్వాదశీ వ్రతం
మునులారా! ఇపుడు మోక్ష, శాంతిప్రదమైన అఖండ ద్వాదశీ వ్రతాన్ని వినిపిస్తాను. మార్గశిర శుద్ధ ద్వాదశినాడు ఆవుపాలు, పెరుగులను మాత్రమే భోజనంగా స్వీకరించి జగన్నాథుడైన విష్ణువును పూజించాలి. నాలుగు నెలలపాటు అనగా ఫాల్గుణ మాసం దాకా ప్రతి ఇలా ప్రతి ద్వాదశినాడు చేసి చివరి అయిదు రకాల ధాన్యాలను అయిదు పాత్రలలో నింపి బ్రాహ్మణునికి దానం చేసి విష్ణుభగవానుని ఈ విధంగా ప్రార్థించాలి.
సప్త జన్మనిహేవిష్ణో యన్మయా హి వ్రతం కృతం |
భగవంస్త్వ ప్రసాదేన తడఖండ మిహాస్తు మే ||
యథాఖండం జగత్సర్వం త్వమేవ పురుషోత్తమ |
తథాభిలాస్య ఖండాని వ్రతాని మమ సంతువై ||
ఇలా తాను ఏడు జన్మలలో చేసే ప్రతిపుణ్య కర్మఫలాన్నీ అఖండం చేయుమని దేవుని ప్రార్థిస్తూ చైత్రాది నాలుగు మాసాల్లో సక్తు (సక్తు = పేలపిండి) తో నింపిన పాత్రలనూ, శ్రావణాది నాలుగు మాసాలలో నేయి నింపిన పాత్రలనూ బ్రాహ్మణునికి దానం చేయాలి.
(సామర్థ్యం లేనివారు సంవత్సరంలో మూడు మార్లే దానమీయవచ్చును) ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చేసినవారికి ఉత్తమ స్త్రీ, మంచి కొడుకులూ లభిస్తారు. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి వుంటుంది.
ఎనభై ఏడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹