చాతుర్మాస్య వ్రతం
ఈ వ్రతాన్ని ఆషాఢమాసంలో ఏకాదశినాడుగాని పూర్ణిమ నాడు గాని భగవానుడైన హరిని వీలైనన్ని విధాల పూజించి ఈ క్రింది శ్లోకాలతో ప్రార్థించి ప్రారంభించాలి.
ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ |
నిర్విఘ్నం సిద్ధి మాప్నోతు ప్రసన్నే త్వయి కేశవ ||
గృహీతే స్మిన్ ప్రతేదేవ యద్య పూర్ణే మ్నియామ్యహం |
తన్మే భవతు సంపూర్ణం త్వత్ప్రసాదాజ్జనార్దన ||
ఒకవేళ ఈ వ్రతం చేస్తూ పూర్తికాకుండా నేను మరణిస్తే సంపూర్ణ వ్రత ఫలాన్నే దయచేయించుమని ఈ శ్లోకం ద్వారా హరిని ప్రార్ధించడం జరుగుతోంది (వ్రతం చెడ్డా ఫలితం దక్కాలనే జాతీయానికి గరుడ పురాణమే మూలమైవుంటుంది – అను)
ఈలాగున ప్రార్థించి హరిని పూజించి వ్రత, పూజన, జపాదిక నియమ గ్రహణం చేయాలి. ఈ సంకల్పంతోనే పాపాలు దూరమవుతాయి. సాధకుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఆషాఢంనుండి (తో) మొదలు పెట్టి నాలుగు మాసాల పాటు ఏకభుక్తముంటూ విష్ణుపూజ చేస్తే ఆయనయొక్క పరమ పవిత్రనిర్మల లోకాన్ని చేరుకుంటాడు.
నూనెలను, మద్య మాంసాదులను విసర్జించి, వేద పారంగతుడు అనిపించుకొని కృచ్ఛపాదప్రతియైన విష్ణుభక్తుడీ వ్రతాన్ని చేస్తే విష్ణులోకానికి వెళతాడు. ఒక రాత్రి ఉపవాసాన్ని చేసిన ప్రతి వైమానిక దేవతగా పదోన్నతిని పొందుతాడు.
మూడు రాత్రులు ఉపవాసం చేసి ఆ తరువాత మూడురాత్రులపాటు ఆరవ అంశనే భోజనం చేయు ప్రతికి శ్రీ ద్వీప నివాసం ప్రాప్తిస్తుంది.
చాంద్రాయణ వ్రతం” చేసిన చాతుర్మాస్య వ్రతికి ముక్తి, విష్ణులోక ప్రాప్తి కోరకుండానే లభిస్తాయి. ప్రాజాపత్యవ్రతం చేసిన ప్రతికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఈ వ్రతం చేసిన పరాకప్రతి కి సాక్షాత్తూ హరిప్రాప్తి యే చెప్పబడింది.
ఈ చాతుర్మాస్య వ్రతంలో సత్తుపిండినీ, యవ అన్నాన్నీ మాత్రమే ఎవరైనా పెడితే తింటూ, పాలు, పెరుగు, నెయ్యిలను ఒక మారే నోటిలో వేసుకొని ఉంటూ, గోమూత్ర యావకాన్ని తింటూ, పంచగవ్యాలను మాత్రమే త్రాగుతూ జీవించాలి.
లేదా షడ్రసాలను, పరిత్యజించి శాక-మూల- ఫలాలను మాత్రమే తినాలి. ఈ విధంగా చేసినవారు విష్ణులోక ప్రాప్తి నందగలరు.
తొంబయ్యవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹