Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూరవ అధ్యాయం

దూర్వాష్టమి, శ్రీకృష్ణాష్టమి

భాద్రపద శుద్ధ అష్టమినాడు దూర్వాష్టమి వ్రతాన్ని చేయాలి. దూర్వ యనగా గరిక. ఆ రోజు ఉపవాసం చేసి గౌరీ, గణేశ, శివ ప్రతిరూపాలను గరికెతోనూ ఆపై ఫల పుష్పాదులతోనూ పూజించాలి. ప్రతి పూజాద్రవ్యాన్నీ శంభవేనమః, శివాయనమః అంటూ శివునిపై వేయాలి. దూర్వను కూడా ఇలా ప్రార్ధించాలి.

త్వందూర్వే మృతజన్మాసి వందితా చ సురాసురైః |

సౌభాగ్యం సంతతిం కృత్వా సర్వకార్య కరీభవ ||

యథాశాఖా ప్రశాఖాభిర్విస్తు తాసి మహీతలే ||

తథా మమాపి సంతానం దేహి త్వమజరామరే ||

ఈ దూర్వాష్టమి వ్రతాన్ని చేసిన వారికి సర్వస్వ ప్రదానాన్ని దేవతలు చేస్తారు. ఈ వ్రతం చేసి అగ్ని పక్వం కాని భోజనం చేసేవారు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తులవుతారు.

శ్రీకృష్ణాష్టమి భాద్రపద కృష్ణ అష్టమి నాడు జరపబడుతుంది. ఆ రోజు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో ఆ యుగపురుషునిగా భగవానుడైన శ్రీహరి పుడమిపై నవతరించాడు. సప్తమితో కలిసిన ఈ అష్టమి కూడా వ్రతయోగ్యమే. ఈనాడు కృష్ణుని పూజించిన వారికి మూడు జన్మల పాపాలు నశిస్తాయి. ముందుగా

ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ ||

యోగ సంభవాయ గోవిందాయ నమోనమః ||

అనే మంత్రంతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని ధ్యానించి ఈ క్రింది మంత్రంతో ఆయన ప్రతిమకు స్నానం చేయించాలి.

ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే

యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః |

అనంతరం ఈ మంత్రంతో ఆయనను పూజించాలి.

ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే ||

విశ్వ సంభవాయ గోవిందాయ నమో నమః ||

పిమ్మట ఈ మంత్రంతో స్వామిని శయనింపజేయాలి.

ఓం సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే ||

సర్వసంభవాయ గోవిందాయ నమోనమః ||

ఒక స్థండిలం (వేది) పై చంద్రునీ, రోహిణీనీ శ్రీకృష్ణభగవానునీ ఉంచి పూజించాలి. పుష్ప, జల, చందనయుక్త జలాన్ని ఒక శంఖంలో తీసి పట్టుకొని మోకాళ్ళపై కూర్చుని క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రుని కర్ఘ్యమివ్వాలి.

క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ ||

గృహాణార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ ||

తరువాత మహాలక్ష్మికీ, వసుదేవునికీ, నందబలరామ యశోదలకూ అర్ఘ్యమివ్వాలి.

అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థించాలి.

అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం ||

వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం |

వరాహంపుండరీకాక్షం నృసింహం దైత్య సూదనం ||

దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం |

గోవింద మచ్యుతం దేవమనంతమప రాజితం ||

అధోక్షజం జగద్భీజం సర్గస్థిత్యంత కారణం |

అనాది నిధనం విష్ణుం త్రిలోకేశంత్రివిక్రమం ||

నారాయణం చతుర్భాహుం శంఖ చక్ర గదాధరం |

పీతాంబర ధరం దివ్యం వనమాలావిభూషితం ||

శ్రీ వత్సాంకం జగద్ధామం శ్రీ పతిం శ్రీధరం హరిం |

యేదేవం దేవకీ దేవీ వసుదేవాదజీ జనత్ ||

భౌమస్య బ్రాహ్మణో గ్యు తస్మై బ్రహ్మాత్మనే నమః |

ఈ ప్రకారంగా శ్రీకృష్ణభగవానుని అనేక నామ సంకీర్తన చేసి మరల సద్గతికై ఇలా ప్రార్ధించాలి.

త్రాహిమాం దేవ దేవేశ హరే సంసార సాగరాత్ |

త్రాహి మాం సర్వపాపఘ్న దుఃఖశోకార్ణవాత్ ప్రభో ||

దేవకీ నందన శ్రీశ హరే సంసార సాగరాత్ |

దుర్వృత్తాం స్త్రాయసే విష్ణో యే స్మరంతి సకృత్సకృత్ ||

సోహం దేవాతి దుర్వృత్త స్త్రాహి మాం శోక సాగరాత్ |

పుష్కరాక్ష నిమగ్నో హం మహత్యజ్ఞాన సాగరే ||

త్రాహి మాం దేవ దేవేశ త్వామృతే న్యో స రక్షితా |

స్వ జన్మవాసుదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ||

జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయనమో నమః |

శాంతి రస్తు శివంచాస్తు ధన విఖ్యాతి రాజ్య భాక్ ||

ఈ ప్రార్ధనలో వేడుకొన్నవన్నీ అనగా, అశాంతినుండి రక్షణ, దురాచారం నుండి విడుదల, అజ్ఞాన నాశనం, శాంతి, శుభం, ధనం, విఖ్యాతి, అధికారం ఇవన్నీ ఈ వ్రతం చేసినవారికి లభిస్తాయి.

నూరవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment