Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ముప్పై మూడవ అధ్యాయం

సర్వకామ ప్రద విద్య

మహేశా! నేనిపుడు సర్వకామప్రద అను ఒక విద్యను ఉపదేశిస్తాను. దీనిని ఏడు రాత్రులపాటు ఉపాసిస్తే అన్ని ప్రయత్నాలలోనూ విజయం లభిస్తుంది. ఇది స్తోత్ర రూపంలో వుంటుంది, ఇలా

సర్వకామ ప్రదాం విద్యాం |
సప్తరాత్రేణ తాం శ్రుణు ||

నమస్తుభ్యం భగవతే |
వాసుదేవాయ ధీమహి ||

ప్రద్యుమ్నాయా నిరుద్ధాయ |
నమః సంకర్షణా యచ ||

విజ్ఞాన మాత్రాయ |
పరమానంద మూర్తయే ॥

ఆత్మారామాయ శాంతాయ |
నివృత్త ద్వైత దృష్టయే ||

త్వద్రూ పాణిచ సర్వాణి
తస్మాత్ తుభ్యం నమోనమః ||

హృషీ కేశాయ మహతే |
నమస్తే నంత మూర్తయే ||

యస్మిన్నిదం యతశ్చైతత్ |
తిష్ఠ త్యగ్రే పి జాయతే ||

మృణ్మయీం విహసి క్షోణీం |
తస్మైతే బ్రహ్మణే నమః ||

యన్న స్మృశంతి న విదుః |
మనోబుద్ధీంద్రియా సవః ||

అంతర్బహి స్వం చరసి |
వ్యోమ తుల్యం నమామ్యహం ||

ఓం నమో భగవతే మహాపురుషాయ మహా భూత పతయే సకల సత్త్వ భావి వ్రీడని కర కమల రేణూత్పల నిభ ధర్మాఖ్య విద్యయా చరణారవింద యుగళ పరమేష్ఠిన్ నమస్తే! అవాప విద్యా ధరతాం చిత్ర కేతుశ్చ విద్యయా ||

చిత్ర కేతువను సామాన్యుడు ఈ విద్య ద్వారానే ఉత్కృష్టమైన విద్యాధరత్వాన్ని పొందగలిగాడు.

నూట ముప్పై మూడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment