Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట నలబై తొమ్మిదవ అధ్యాయం

మృత్యు నివారకాష్టక స్తోత్రం

శౌనకాదులారా! ఇపుడొక మృత్యు నివారకాష్టకమును అనగా ఎనిమిది శ్లోకాల స్తోత్రమును వినిపిస్తాను. ఇది మార్కండేయ కృతం.

దామోదరం ప్రపన్నో… స్మికిన్నో మృత్యుః కరిష్యతి ||

శంఖచక్రధరం దేవం వ్యక్త రూపిణ మవ్యయం ||

అధోక్షజం ప్రపన్నో… స్మి కిన్నో మృత్యుః కరిష్యతి ||

వారాహం వామనం విష్ణుం నారసింహం జనార్దనం ||

మాధవంచ ప్రపన్నోస్మి కిన్నోమృత్యుః కరిష్యతి ||

పురుషం పుష్కర క్షేత్ర బీజం పుణ్యం జగత్పతిం ||

లోకనాథం ప్రపన్నో… స్మి కిన్నోమృత్యుః కరిష్యతి ||

సహస్రశిరసం దేవం వ్యక్తా వ్యక్తం సనాతనం ||

మహాయోగం ప్రపన్నో… స్మి కిన్నో మృత్యుః కరిష్యతి ||

భూతాత్మానం మహాత్మానం యజ్ఞ యోని మయోనిజం ||

విశ్వరూపం ప్రపన్నో స్మి కిన్నో మృత్యుః కరిష్యతి ||

ఇత్యుదీరిత మాకర్ణ్య స్తోత్రం తస్య మహాత్మనః ||

అపయాతస్తతో మృత్యు ర్విష్ణు దూతైః ప్రపీడితః ||

ఇతితేన జితో మృత్యురార్కండేయేన ధీమతా ||

ప్రసన్నే పుండరీకాక్షే నృసింహే నాస్తి దుర్లభం ||

ఈ మృత్వష్టక స్తోత్రం మహా పుణ్యశాలి, మృత్యు వినాశకారి, మంగళదాయకము. భగవంతుడైన శ్రీ మహావిష్ణువే దీనిని మార్కండేయ మహామునికుపదేశించాడు. పవిత్రుడై, త్రికాలాల్లో, భక్తిగా నియమపూర్వకంగా ఈ స్తుతిని చేసిన విష్ణుభక్తునికి అకాల మృత్యువుండదు. తన హృదయకమలంలో ఆ పురాణపురుషుడు సనాతనుడు, అప్రమేయుడు, సూర్యాధిక తేజస్వీయగు శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ఈ స్తోత్రం ద్వారా ధ్యానించు యోగి మృత్యువుపై కూడా విజయాన్ని సాధించగలదు.

నూట నలబై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment