Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – చివరి భాగము

భూదేవి చేసిన మాధవ స్తవం :-

ప్రసీద మమ దేవేశ లోకనాథ జగత్పతే,

భక్తాయాః శరణాయాశ్చ ప్రసీద మమ మాధవ ॥

త్వ మాదిత్యశ్చ చన్ద్రశ్చ త్వం యమో ధనదస్తు వై

వాసవో వరుణ శ్చాపి అగ్ని ర్మారుత ఏవ చ॥

అక్షరశ్చ క్షరశ్చా సి త్వం దిశో విదిశో భవాన్,

మత్స్యః కూర్మో వరాహొ థ నారసింహో సి వామనః

రామో రామశ్చ కృష్ణోసి బుద్ధః కల్కి ర్మహాత్మవాన్II

ఏవం యాస్యసి భోగేన శ్రూయతే త్వం మహాయశాః

యుగే యుగే సహస్రాణి వ్యతీతా యేచ సంస్థితాః॥

పృథివీ వాయు రాకాశ మాపో జ్యోతిశ్చ పంచమమ్

శబ్దస్పర్శస్వరూపోసి రసోగనోం సి నో భవాన్॥

సగ్రహ యే చ నక్షత్రాః కలాకాలముహూర్తకాః

జ్యోతిశ్చక్రం ధ్రువ శ్చాసి సర్వముద్యతతే భవాన్ II

మాసః పక్షమహో రాత్రి మృతః సంవత్సరాణ్యపి,

ఋతువశ్చాపి షణ్మాసాః షడ్రసా శ్చాసి సంయుతః ||

సరితః సాగరా శ్చాసి పర్వతాశ్చ మహోరగాః

త్వం మేరు రన్దరో విన్దో మలయా దర్దురోభవాన్ ॥

హిమవాన్ నిషధశ్చాసి చక్రోసి చ వరాయుధః

ధనూంషి చ పినాకోసి యోగః సాంఖ్యల సి చోత్తమః||

పరంపరో సి లోకానాం నారాయణ పరాయణః

సంక్షిప్తం చైవ విస్తారో గోప్తా క్షేప్తా చ వై భవాన్ ॥

యజ్ఞానాం చ మహాయజ్ఞో యుపానా మసి సంస్థితః

వేదానాం సామవేదో సి యజుర్వేదో వరానన ॥

ఋగ్వేదో థర్వ వేదో సి సాంగోపాంగో మహాద్యు

గర్జనం వర్షణం చాసి త్వం వేధా అనృతానృతే ॥

అమృతం సృజసే విష్ణో యేన లోకా నధారయత్

త్వం ప్రీతి స్త్వం పరా ప్రీతిః పురాణః పురుషో భవాన్ ॥

ధ్యేయాయం జగత్సర్వం యచ్చ కిల్చోత్ ప్రవర్తతే

సప్తానామపి లోకానాం త్వం నాథ స్వంచ సంగ్రహః ॥

త్వం చ కాలశ్చ మృత్యుశ్చ త్వం భూతో భూతభావనః

ఆదిమధ్యాంతరూపో _సి మేధా బుద్ధిః స్మృతి ర్భవాన్ ||

ఆదిత్యస్త్వం యుగావర్తః సచ పంచ మహాతపాః

అప్రమాణప్రమేయోం_సి ఋషీణాంచ మహానృషిః ||

ఉగ్రదణ్ణశ్చ తేజస్వీ హ్రీ ర్లక్ష్మీ ర్విజయో భవాన్

అనన్తశ్చాసి నాగానాం సర్పాణా మసి తక్షకః

ఉద్వహః ప్రవహశ్చాసి వరుణో వారుణో భవాన్ II

క్రీడా విక్షేపణ శ్చాసి గృహేషు గృహదేవతాః

సర్వాత్మకః సర్వగతో వర్ధనో మన ఏవ చ ॥

సాఙ్గస్త్యం విద్యుతీనాం చ విద్యుతానాం మహాద్యుతిః

యుగో మన్వన్తర శ్చాసి వృక్షాణాం చ వనస్పతిః ||

అండజోద్భిజ్జ స్వేదానాం జరాయూణాం చమాధవ,

శ్రద్ధా సి త్వం చ దేవేశ దోషాన్ హన్తాం సి మాధవ ॥

గరుడ సి మహాత్మానం వహసే త్వం పరాయణః

దున్దుభి ర్నేమి ఘోషైశ్చ ఆకాశగమనో భవాన్ ॥

జయశ్చ విజయశ్చాసి గృహేషు గృహదేవతాః

సర్వాత్మకః సర్వగత శ్చేతనో మన ఏవ చ॥

భగస్త్వం వృషలిఙ్గశ్చ సరస్వం పరమాత్మకః

సర్వభూతనమస్కార్యో నమోదేవ నమో నమః

మాం త్వం మగ్నామసి త్రాతుం లోకనాథ ఇహార్హసి||

ఆది కాలాత్మకం హ్యేతత్ సర్వపాపహరం శివమ్

య ఇదం పఠతే స్తోత్రం కేశవస్య దృఢవ్రతః

వ్యాధితో ముచ్యతే రోగాత్ బద్దో ముచ్యేత బంధనాత్||

అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధన మాప్నుయాత్

అభార్యో లభతే భార్యా మపతిః పతి మాప్నుయాత్||

ఉభేసంధ్యే పఠేద్ యస్తు మాధవస్య మమాస్తవమ్

స గచ్ఛేద్ విష్ణులోకం హి నాత్ర కార్యా విచారణా||

అంతు అక్షరో పి భవేత్ తు పరికల్పనా

తావద్ వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే||

(శ్లో॥ 25 – 51,అధ్యా-112)

ఈ స్తోత్రం విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరాహావతారాన్ని ధరించి నన్ను ఉద్ధరించాడు. ఎంతో గొప్ప దయామయుడైన శ్రీహరి దయవల్ల నేనీనాడింత ఆనందంగా ఉన్నాను. ఆయన నన్ను ఉద్ధరిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూసాను. “ఆయన శక్తి సామర్ధ్యాలు నాకెంతో ఆశ్చర్యం కలిగించాయి. ఎంతో అవలీలగా తన కోరలతో నన్నాయన రక్షించాడు” అని భూదేవి సనత్కుమారుడికి చెప్పింది.

భూదేవి చేసిన ఈ మాధవ స్తుతి మహిమాన్వితమైనది. సకల పాపాల్ని హరిస్తుంది. మంగళకరమైనది. శ్రద్ధా భక్తులతో ఈ దివ్య స్తుతిని చేసినవాడు సకల రోగాలనుంచీ, భవబంధాలనుంచీ విముక్తుడవుతాడు. పుత్రులు లేనివాడికి పుత్రులు కలుగుతారు. దరిద్రుడికి ధనసంపద లభిస్తుంది. భార్యలేనివాడికి ఉత్తమ ఇల్లాలు వస్తుంది. ఉదయ, సాయం సంధ్యల్లో ఈ మాధవ స్తవాన్ని కేవలం ఒక్కసారి పఠిస్తే చాలు. వేలసంవత్సరాలు స్వర్గలోక నివాసాన్ని పొందుతారు.

శ్రీవరాహ పురాణం ఫలశ్రుతి :-

పరమపవిత్రమైన ఈ వరాహపురాణాన్ని పఠించినవారికి, విన్నవారికి, చెప్పిన వారికి సకల శుభాలు కలుగుతాయి. శ్రీవరాహమూర్తికి, భూదేవికి సంవాద రూపంలో జరిగిన ఈ పురాణాన్ని భక్తి పూర్వకంగా పఠించిన వారు సకల పాపాలనుంచీ విముక్తులై పరమపదాన్ని పొందుతారు.

యథాచమత్యమనాదవైద్నశోధార్య ఘృతం|

ఏమసర్వేషు శాస్త్రేషు వారాహం ఘృత సమ్మితం||

(శ్లో॥ 21,అధ్యా-48)

ఈ వరాహపురాణాన్ని పఠిస్తే చాలు వేదాలతో కూడిన సకల శాస్త్రాలనీ అన్ని పురాణాలనీ పఠించినట్టే అవుతుంది.

నైమిశం, ప్రభాసక్షేత్రం, హరిద్వారం, కాశీ, పుష్కరం. ప్రయాగ, అమరకంటకాది పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకున్న దానికన్నా కోటి రెట్లు అధికఫలం ఈ పురాణ పఠనం వల్ల మానవులకి లభిస్తుంది.

స్వస్తి

సర్వేజనాః సుఖినోభవన్తు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment