వసుమహారాజు వృత్తాంతం
పూర్వం కాశ్మీర రాజ్యాన్ని వసువు అనే మహారాజు పాలించేవాడు. ధర్మతత్త్వాన్ని తెలిసిన ఆ మహారాజు ఎంతో నీతిమంతంగా రాజ్యాన్ని పాలిస్తూ యజ్ఞయాగాది క్రతువుల ద్వారా దేవతల్ని కూడా సంతృప్తి పరుస్తున్నాడు. నిత్యం శ్రీమన్నారాయణుడి మీదే మనసు నిలిపి జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ వసుమహారాజుకి లౌకిక విషయాల మీద ఆసక్తి తగ్గిపోయింది. తపస్సు చేసి తద్వారా మోక్షాన్ని పొందాలన్న కాంక్ష ఆయనకి ఎక్కువైంది. ఒకనాడు తన వందమంది సోదరుల్లో గొప్పవాడైన వివస్వంతుణ్ణి పిలిచి, అతడి కుమారుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాడు. తాను మాత్రం అన్నిటినీ అందర్నీ విడిచి తపస్సు కోసం రాజ్యం వదిలి బయలుదేరాడు.
అలా బయలుదేరిన వసుమహారాజు తీర్థాలన్నిటిలోకీ ఉత్తమ తీర్థంగా ప్రసిద్ధి చెందినది, శ్రీమన్నారాయణుడు పుండరీకాక్షుడుగా నెలకొన్నది అయిన పుష్కరం అనే తీర్థానికి వచ్చాడు. ఆ దివ్య తీర్థంలో తన శరీరం శుష్కించి పోయేలా కఠోరదీక్షతో తపస్సు చేసాడు. తపస్సులో భాగంగా నిరంతరం పుండరీకాక్షుడే పరమదైవం అని భావిస్తూ ఈ విధంగా పుండరీకాక్షపార స్తోత్రాన్ని పఠించసాగాడు.

పుండరీకాక్ష పారస్తుతి :-
నమస్తే పుణ్డరీకాక్ష నమస్తే మధుసూదన |
నమస్తే సర్వలోకేశ నమస్తే తిగ్మచక్రిణే॥
విశ్వమూర్తిం మహాబాహుం వరదం సర్వతేజసమ్
నమామి పుణ్డరీకాక్షం విద్యార్థి విద్యాత్మకం ప్రభుమ్॥
ఆదిదేవం మహాదేవం వేదవేదాఙ్గ పారగమ్
గమ్భీరం సర్వదేవానాం నమామి మధుసూదనమ్॥
విశ్వమూర్తిం మహామూర్తిం విద్యామూర్తిం త్రిమూర్తికమ్, కవచం సర్వదేవానాం నమస్తే వారిజేక్షణమ్॥
సహస్ర శీర్షిణం దేవం సహస్రాక్షం మహాభుజమ్,
జగత్ సంవాప్య తిష్ఠన్తం నమస్తే పరమేశ్వరమ్॥
శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనమ్|
నీలమేఘ ప్రతీకాశం నమస్తే చక్రపాణినమ్॥
శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనమ్ భావాభావ వినిర్ముక్త్రం నమస్యే సర్వగం హరిమ్॥
నాన్యత్ కిత్ ప్రపశ్యామి వ్యతిరిక్తం త్వయాచ్యుత త్వన్మయం చ ప్రపశ్యామి సర్వమేత చ్చరాచరమ్ |
(శ్లో॥10-17,అధ్యా-6)
ఈ విధంగా వసుమహారాజు పుండరీకాక్షుడిని స్తుతిస్తుండగా ఒక్కసారిగా అయన ముందు నల్లగా ఎర్రటి కళ్ళతో భయంకరంగా ఉన్న పురుషుడు ఆవిర్భవించి రాజా! ఏమి ఆజ్ఞ! అని అడిగాడు. వసుమహారాజుకి ఆశ్చర్యం కలిగింది. ఓయీ! కిరాతకా! ఎవరునీవు? ఎక్కణ్ణుంచి వచ్చావు? అని ప్రశ్నించాడు. రాజా! పూర్వం కలియుగంలో నీవు దక్షిణాపథాన ఒక ధర్మప్రభువుగా ఉన్నావు. అలాంటి నీవు ఒకనాడు క్రూరమృగాల్ని వేటాడటం కోసం అడవికి వెళ్ళావు. ఆ అడవిలో మృగంలా దూరం నుంచి కనిపిస్తున్న ఒక మహర్షిని తెలియక మృగమే అనుకుని బాణాలతో కొట్టావు. ఆ బాణం తగిలిన వెంటనే ఆ మునీశ్వరుడు మరణించాడు. నీవు ఒక మృగాన్ని చంపావన్న ఆనందంతో అక్కడికి వెళ్ళి చూడగానే మునీశ్వరుడు చచ్చిపడివున్నాడు. అతన్నలా చూసేసరికి రాజా! నీకు ఎంతో ఆందోళన కలిగింది. నీ మనసెంతో బాధపడింది. లోలోపలే నీవెంతో కుమిలిపోయావు. రాజ్యానికి తిరిగివచ్చాక నీవా వృత్తాంతాన్ని మరొకడికి చెప్పావు. అలా కొంత కాలం గడిచిపోయింది.
మహారాజా! నీకు మాత్రం మనశ్శాంతి కల్గటం లేదు. బ్రహ్మ హత్య చేసానన్న అపరాధ భావం మీ మనసుని తొలిచేస్తుంది. ఎలాగైనా ఆ పాపం నుంచి విముక్తి పొందుదామని భావించావు. శ్రీమన్నారాయణుణ్ణి మనసారా ధ్యానించి శుద్ధ ద్వాదశినాడు ఉపవాసమున్నావు. ఆ పుణ్య దినాన “శ్రీమన్నారాయణుడు నన్ను అనుగ్రహించుగాక” అని సంకల్పించి ఒక ఆవుని దానం చేసావు. ఆ వెంటనే ఉదరశూలతో బాధపడుతూ నీవు మరణించావు.
వసుమహారాజా! నీవానాడు ద్వాదశిరోజు ఉపవాసముండటానికి ఒక కారణం వుంది. ఆనాటి నీ ధర్మపత్ని పేరు నారాయణి. నీవు నీ ప్రాణాలు కంఠం దాకా వచ్చిపోతున్నప్పుడు నారాయణీ! అని ఉచ్చరించావు. ఆ కారణంగా రాజా నీకు ఒక కల్పందాకా విష్ణులోక నివాసం లభించింది.
రాజా! నేనొక బ్రహ్మ రాక్షసుణ్ణి, మహాఘోరమైన వాణ్ణి. నీ దేహంలో వున్న నాకు ఇదంతా తెలుసు. నేను నిన్నెలాగైనా పీడించాలనుకున్నాను. ఇంతలో విష్ణుదూతలు నన్ను బైటికి లాగి రోకళ్ళతో చావగొట్టారు. ఇక లోపలికి ప్రవేశించలేక నీ రోమకూపాలనుంచి పూర్తిగా బైటపడ్డాను. నీవు స్వర్గంలో ప్రవేశించావు. అలాగే నీతో పాటూ నా తేజస్సుని నీలో నింపి, నేను కూడా స్వర్గానికి వచ్చాను. ఇదంతా గడిచిన కల్పంలోని చరిత్ర.
మహారాజా! ఈ కల్పంలో నీవు కాశ్మీర మహారాజు కుమారుడిగా జన్మించావు. నేను నీ రోమకూపాల్లో అలాగే ఆనాటి నుంచి ఉండిపోయాను. నీవు ఎన్నెన్నో గొప్ప యాగాలు చేసావు. అయితే నీవు చేసిన యాగాల్లో ఎక్కడా విష్ణుస్మరణ లేకపోవటంతో అవన్నీ నన్నేం చేయలేకపాయాయి. అయితే రాజేంద్రా! ఇప్పుడు నీవు పుండరీకాక్షుడి దివ్య పారస్తోత్రాన్ని చదవగానే నేను నీ రోమకూపాలనుంచి బైటపడి ఇదిగో ఇలా కిరతుడిలా ఏకరూపాన్ని పొందాను. ప్రభూ! నేను పరమాత్మ స్తోత్రాన్ని విని పూర్వజన్మలో చేసిన పాపరూపం నుంచి విముక్తి పొందాను. రాజా! నాకిప్పుడు ధర్మబుద్ధి కలిగింది” అని విన్నవించాడు.
కిరాతుడి ద్వారా తన పూర్వజన్మవృత్తాంతం విన్న వసుమహారాజు ఎంతో ఆశ్చర్యపోయి ఆ కిరాతకుణ్ణి వరం కోరుకోమన్నాడు. అలాగే అతడితో “ఓ వ్యాధుడా! (కిరాతుడా)నీవల్ల నా పూర్వజన్మ వృత్తాంతాన్నంతా తెలుసుకున్నాను. నా అనుగ్రహంతో నీవు ఈనాటి నుంచి ధర్మవ్యాధుడిగా ప్రసిద్ధిచెందుతావు. పుండరీకాక్షుడే (విష్ణువే) పరమదైవమని ప్రతిపాదించే ఈ దివ్యస్తోత్రాన్ని విన్నవారికి, పఠించినవారికి పుష్కరతీర్థంలో పవిత్రస్నానం చేసిన ఫలం లభిస్తుంది” అని పలికి దివ్యమైన దేవ విమానాన్ని అధిరోహించి స్వర్గానికి వెళ్ళి పోయాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹