సరోవర మహాత్మ్యం
రోమహర్షణవచనము : –
అచట నుంచి తీర్ణసేవ చేయగోరు బ్రాహ్మణోత్తముడు రామహ్రదాని కెళ్ళాలి. ఆచోటనే మహాతేజస్వియయిన భార్గవరాముడు క్షత్రియ సంహారం చేసి వారల రక్తంలో అయిదు నరోవరాలను నింపాడు. ఈ విషయం మేము విన్నాము. ఆ జలాలలో పితృపితామహులకు తర్పణా లిచ్చాడు. అంతటపరమ ప్రీతులైరాముని పితరులు అతనితో యిలా అన్నారు. మహాపరాక్రమవంతుడవైన రామా ! నీ విక్రమానికి పితరులయెడ భక్తికి సంతోషించాము మహాయశస్వీ ! నీకేమి వరంకావలయునో అడుగుము నీకు కళ్యాణమగుగాక. అంతట మహాబలశాలియైన భార్గవ రాముడు ఆకాశాన నిలబడిన పితృదేవతలకు చేతులెత్తి నమస్కరించి యిలా అన్నాడు. మీరలు నాయెడ ప్రసన్నులైనచో నన్ననుగ్రహించుచో మీ అనుగ్రహం వల్ల నేను మరల తపోసిద్ది పొందవలెను. రోషాతిరేకంతో క్షత్రియ సంహారం చేసి నందున నాకు గల్గిన పాపం నశించవలెను. మీ ప్రభావంవల్ల ఈ అయిదు సరోవరాలు పవిత్ర తీర్థాలుగా ప్రసిద్ధి చెందవలె. రాముడు పలికిన ఈ శుభవాక్యాలు విని హర్షంతో ఆయన పితరులు ప్రేమతో అభయమిఇచ్చారు. పుత్రా ! విశిష్టమైన నీ పితృభక్తివల్ల నీ తసస్సు వర్ధిల్లుతుంది. కోపవశాన నీకు సంక్రమించిన క్షత్రియ వధపాతకం తొలగిపోయినది. ఆ క్షత్రియులు తమదుష్కర్మల వల్లనే చంపబడ్డారు. నిస్సందేహంగా, నీవు నిర్మించిన ఈ సరస్సులకు తీర్థత్వం లభిస్తుంది. ఈ సరస్సులలో మునిగి ఎవరు తమ పితరులకు తర్పణాలు విడుస్తారో వారల కోర్కెలు వారి పితరులు సిద్ధింప చేస్తారు. వారలకు శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా పరశురామునకు వరాలిచ్చి ఆయన పితృదేవతలు అంతర్ధానమైనారు. ఈ విధంగా మహాత్ముడగు భార్గవరామునిచే నెలకొల్పబడిన రామసరోవరాలు పరమపవిత్రాలు. బ్రహ్మచారియై నియమంతో వానిలో స్నానంచేసి రాముని అర్చిస్తే బహుసువర్ణ ప్రాప్తికలుగుతుంది.
జితేంద్రియడగు తైర్థికుడు తన వంశాభివృద్ధికోసం వంశమూలంలో స్నానంచేసి అటనుండి కాయశోధనం అనే ముల్లోకాల్లో పేరుగన్న తీర్థంలో స్నానంచేసి తప్పకుండా కాయసిధ్ది పొందుతాడు. పరిశుద్ధమైన దేహం కలిగి పునరావృత్తిలేని లోకాలకుపోతాడు. తీర్థమరాయణులయిన సిద్ధులు కాయశోధనం పొదనంతవరకు తీర్థాటనం చేస్తూ ఉంటారు. ఆ తీర్థంలో స్నానంచేసి సంయతచిత్తులగు వారు పరమపదాన్ని చేరుకుంటారు. అనంతరం ఉత్తములగు విప్రుడు, సకలప్రాణులు విష్ణువుచేత ఉద్ధరించబడిన త్రిలోకఖ్యాతిగల లోకోద్ధారమను తీర్థంలోస్నానంచేసి శాశ్వత లోకాలను పొందుతారు. సనాతనులయిన శివవిష్ణువు లిరువురు నిత్యం సన్నిహితలుగుచోట, నా దేవులకు ప్రణమిల్లి ప్రసన్నుల గావించు కొని ముక్తిపొందనగును. ఆటనుండి పరమోత్తమమైన శాలగ్రామ శ్రీతీర్థంలో స్నానంచేసిన సదాపరమేశ్వరి సాన్నిధ్యం పొందవచ్చు. తర్వాత త్రిలోకఖ్యాతి గల కపిల తీర్థంలోస్నానం చేసి. దేవపితరులను అర్చించినచో, వేయి కపిలగోవులు దానమిచ్చిన ఫలం కలుగును. అచటనే కపిలరూపంలో వెలసిన మహాదేవుని, ఋషి పూజితుని దర్శించినచో ముక్తికలుగును. ఆపైని, సూర్యతీర్థంలో స్నానంచేసి స్థిరచిత్తంతో ఉపవాసపూర్వకంగా పితరులను దేవతలను అర్చించిన, అగ్నిష్టోమ యాగఫలం కలిగి సూర్యలోక ప్రాప్తి పొందనగును. జ్జానియగు నరుడు సహస్రఖరకిరణుడగు సూర్యదేవుని దర్శించి మోక్షగామి అవుతాడు. అనంతరం భవాని వనంచేరి అచటనభిషేకాదులొనర్చిన గోసహస్రదాన ఫలందక్కుతుంది. పూర్వకాలాన బ్రహ్మ అమృతపానంచేసి పుక్కిలించగా అందులోంచి సురభి (కామధేనువు) పుట్టి పాతాళానికి వెళ్ళింది. లోకమాత అయిన ఆ సురభికి ఎన్నోగోవులు జన్మించాయి. వానితో పాతాళంనిండి పోయింది. తర్వాత బ్రహ్మయజ్ఞం చేసినపుడు దక్షిణ యివ్వడానికి ఆ గోవులను పిలిచాడు. అవి ఒక బిల ద్వారాన ప్రయాణించి వెళ్లాయి. ఆ బిలద్వార ముఖాన వేంచేసిన గణపతిని దర్శించినచో సకల కోర్కెలు సిద్ధిస్తాయి.
అనంతరం ముక్తినిలయమైన సంగిని తీర్తంలోని దేవీతీర్థంలో స్నానంచేసి, నరుడుచక్కని రూపవంతుడు కాగలడు. అనంతైశ్వర్యాలు పుత్రపౌత్రులుగలిగి విస్తారమైన భోగాలనుభవించి పరమపదమందగలడు. బ్రహ్మావర్తంలో స్నానమాడినవాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. స్వేచ్ఛామరణం పొందుతాడు. సందేహంలేదు. బ్రాహ్మణోత్తముటారా! అచట నుండి రందుకద్వార పాలుని సేవించాలి. మహాత్ముడగు నాయక్షేంద్రుని సరస్వతీతీర్థంలో ఉపవాసముండి స్నానమాడుచో యక్ష ప్రసాదంవల్ల కోరిన ఫలములు పొందనగును. అట నుండి మునిస్తుతమైన బ్రహ్మావర్తతీర్థంలో స్నానంచేసిన తప్పక బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. అచటి నుండి దేవతలకు పితరులకు నిత్యనివాసమైన సుతీర్థకమను ఉత్తమ తీర్థంలో పితృదేవార్చనలు అభిషేకాదులుచేసి వారలను సంతోషపెట్టి అశ్వమేధ ఫలంపొందవచ్చు. అక్కడనుంచి అంబువనంవెళ్ళి అచటకామేశ్వర తీర్థంలో భక్తితోస్నానంచేసినవాడు సర్వరోగముక్తుడై బ్రహ్మజ్ఞాని అవుతాడు. తప్పదు. అక్కడే మాతృతీర్థం ఉంది. అక్కడ భక్తితోస్నానంచేస్తే సంతానవృద్ధి కలిగి అనంతైశ్వర్యాలు అభిస్తాయి. అక్కడ నుంచి నియతాహార సేవియై శీత వనానికి వెళ్లాలి. బ్రాహ్మణులారా ! అక్కడ అన్యత్ర దుర్లభమైన తీర్థంఉంది. దర్శనమాత్రన్నే పవిత్రంచేసే ఆ క్షేత్రం దండకం. అక్కడ శిరోముండనం చేసికొని మానవుడు పవిత్రుడౌతాడు. పాపాలుపోతాయి. అక్కడే స్వానులోమాయనమనే మనో త్రైలోక విఖ్యాతిగాంచిన తీర్థంఉంది. అక్కడ మహాప్రాజ్ఞులైన తీర్థపసేవలు ప్రాణాయామవిధిచే తమ శరీరం మీది రోమాలన్నీ పోగొట్టుకుంటారు. అలాంటి పవిత్రులు పరమపదం పొందుతారు. ఆవలదశాశ్వమేధికతీర్థం ప్రఖ్యాతమైనది. అక్కడ భక్తితోస్నాంచేస్తేదశాశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. తర్వాత శ్రద్ధాళువులు, లోకవిఖ్యాతమైన మానుషతీర్థానికి వెళ్తారు. దానిని చూసినంతనే కిల్బిషాలుతొలగి ముక్తులౌతారు. పూర్వసమయాన ఆ ప్రదేశాన వేటకాని బాణాలకు గురియై కృష్ణమృగాలు ఆ సరస్సులోపడి మనుష్యశరీరాలు ధరించాయి. అలావచ్చిన బ్రాహ్మణోత్తములను చూచి వేటగాళ్లు వారలతో ఓ ఋషులారా ! మా బాణాలుతగిలిన లేళ్ళు సరస్సులో మునిగిపోయాయి. అవి తర్వాత ఏమైనవని అడిగారు. అందులకా బ్రాహ్మణులు మేమే ఆ జింకలము. ఈ తీర్థమహిమ వల్ల ఉత్తమమానుష రూపములు ధరించాము. మీరుగూడ మావలెనే మత్సరరహితులై స్నానంచేసి పాపాలనుండి ముక్తులవండి. అని చెప్పారు. అంతటవారుగూడ అందోస్నానంచేసి పవిత్ర శరీరులై స్వర్గానికి వెళ్ళారు. ఓ విప్రోత్తములారా ! యిలాంటిమహిమ గల మానుషతీర్థం గరిమనువిన్న శ్రద్ధాశువులు గూడ పరమపదం పొందుతారు.
ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోవర మహాత్మ్యంలో పదునాలుగవ అధ్యాయం సమాప్తం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹