Skip to content Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – యాబై ఒకటవ అధ్యాయం

సరోవరమాహాత్మ్యం

మార్కండేయు డిట్లనెను :-

మహామునీ ! స్థాణుతీర్థమహిమ సమగ్రంగా వినగోరెదను. అచట సర్వపాపాలు పోగొట్టే సిద్ధిని ఎవరు పొందారు? అందులకు సనత్కుమారుడిలా చెప్పదొడగెను. ఓ మార్కండేయ మహర్షీ! అత్యుత్తమ మైననీస్థాణుతీర్థమహిమ సాకల్యంగా వినవలసినది. దీనిని వినిన తరుడు సకలపాపలవిముక్తుడౌతాడు. మహాప్రళయ సమయాన ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతా నశించిపోగా అవ్యక్తజన్ముడైన ఆ విష్ణుమూర్తి బొడ్డునుండి కమలం పుట్టింది. దాని నుండి సర్వలోక పితామహుడగు బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన నుండి మరీచి జనించగా ఆయన కుమారుడుగా కశ్యపుడు పుట్టాడు. కశ్యపునకు సూర్యుడు కలగగా ఆయనకు మనువు జన్మించాడు. ఆ మనువు తుమ్మగా ఆయన ముఖం నుంచి ఉద్భవించిన పుత్రుడు చతురంత భూమండలానికంతకూ రాజైనాడు. మృత్యుముఖాన్నుంచి కాలుని కుమార్తెగా జనించి భయాన్ని కల్గించే ”భయా” అనునామె ఆ రాజు భార్య అయినది. ఆమెకు. దుష్టుడు వేదదూషకుడైన వేనుడు పుట్టాడు. ఆ దుష్టుని ముఖంచూచినంతనే కోపంతో తండ్రి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన కఠోర తపస్సుచేసి ధర్మంతో భూమ్యాకాశాలను నిలిపి పునరావృత్తిలేని బ్రహ్మ సదనానికి వెళ్ళిపోయాడు. కాలుని దౌహిత్రుడైన వేనుడ భూమికంతా పాలకుడై తన మాతామహదోషం వల్ల వేదనిందకుడై రాజ్యంలో యిలా చాటింపచేశాడు. “నా రాజ్యంలో ఎవరూ దానాలు యజ్ఞయాగాలు చేయరాదు. అహుతులు వ్రేల్చరాదు. నేనొక్కడనే వందనీయుడను. నన్నుమాత్రమే అందరూ పూజించాలి. యిలా చేసినా రాజ్యంలోని మీరంతా సుఖించగలరు. నా కంటె వేరైన దేవుడెవడూ లేడు.” అతని వాక్యాలకు చింతించి ఋషులంతా కలిసివెళ్ళి యిలా హితంపలికారు. రాజా! వేదాలు ధర్మానికి మూలమైన ప్రమాణాలు. అవి యజ్ఞ కర్మను విధించినవి. యజ్ఞాలు చేయకపోతే దేవతలు సంతోషించి పైరులకు అవసరమైన వర్షాలు గురిపించరు. ఆ విధంగా ఈ సృష్టి అంతా దేవ తలు యజ్ఞాలమీద ఆధారపడి యున్నది.

ఋషుల మాటలు­ని కోపంతో పిచ్చివాడై దురాత్ముడకు వేనుడు యజ్ఞాలు చేయరాదు. దానాలు యివ్వకూడదు. అంటూ మాటిమాటికీ గర్జించాడు. దానితో ఆ మునులందరూ కోపించి అభిమంత్రించిన వజ్రోపమాలైన కుశలతో నా దుష్టుని ప్రహరించి సంహరించారు. అంతట రాజులేని ప్రజలంతా, దస్యులు తమను పీడించగా నానా బాధలకు లోనై ఘోషిస్తూ మహర్షులను శరణు వేడుకున్నారు. అంతట నా ఋషులా వేనుని ఎడమ చేతిని మథించగా దానినుంచి ఒక మరుగుజ్జు పుట్టాడు. వారంతట నతనితో నీ­క్కడ కూర్చోమని చెప్పారు. ఆ పొట్టివానినుండి వేనుడి పాప ఫలంగా నిషాదులు జన్మించారు. అంతట ఋషులు ఆ వేనుని కుడిచేతిని మథించారు. దానినుంచి సాంవృక్షమంత పొడవుగలిగి దివ్య లక్షణాలతో కూడిన పురుషుడుద్భవించాడు. అతని చేతులలో ధ్వజ ధనుర్బాణ శంఖ చక్రాది రేఖలున్న­. ఆ పురుషుని చూచి ఇంద్రుడు మొదలయిన దేవతలందరు, వృథ్వీ పాలకునిగా అతనికి అభిషేకం చేశారు. అతడు ధర్మాత్ముడై భూమిని రంజింప చేశాడు. తన తండ్రి పెట్టిన బాధలకు క్షోభించిన వృథి­ని అతడు తన పాలనతో రంజింపజేసి ‘రాజు’ అనే శబ్దాన్ని సార్థకం గాంచాడు. ప్రజల నుంచి రాజ్యం స్వీకరించిన తదుపరి అతనిలా ఆలోచనలో పడ్డాడు- నా తండ్రి ఆధార్మికుడు. యజ్ఞ ­ఘాతకుడు, ఆయనకు ఉత్తమలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది? అలా చింతావ్యాకులుడైన రాజు వద్దకు నారద మహర్షి రాగా నా రాజు తగిన ఆసనం యిచ్చి నమస్కరించి యిలా ప్రశ్నించాడు- భగవన్‌ | తమరు సర్యజ్ఞులు. శుభాశుభ కర్మల రహస్యం తెలిసినవారు. నా తండ్రి దుష్టుడు, లోకవేద నిందకుడు, ­హితకర్మలు చేయ కుండానే మరణించాడు. అంతట దివ్యదృష్టితో అంతా గ్రహించి నారదుడిలా అన్నాడు. రాజా! నీ తండ్రి క్షయ కుష్టు రోగాలతో వ్లచ్ఛులలో జనించాడు. మహాత్ముడగు నారదుని మాటలు ­ని ఆ రాజు చాలా దుఃఖించి తాను ఏ­మి చేయవలెనా అని ఆలోచనలో దిగాడు. పుత్రుడనగా పితరులను భయాలనుంచి రక్షించువాడే నన్న భావం ఆయనకు తోచింది. అంతట మరల నా మహామునిని తన తండ్రి తరించుటకు తానే­మీ చేయవలెనో ­వరించమని వేడుకున్నాడు.

అపుడు నారదుడన్నాడు నీవు తీర్థాలన్నింటిని దర్శించి అచట నీళ్ళతో ఈతని దేహాన్ని శుద్ధి చేయము. వానితో సన్నిహిత సరోవరం దగ్గర ఉన్న స్థాణు తీర్థానికి గూడ వెళ్ళుము. నారద మహర్షి వచనాలు ­ని ఆ రాజు తన రాజ్య భారాన్ని మంత్రుల కప్పగించి తాను బయలుదేరాడు. అచట నుండి ఉత్తర భూములకు వెళ్ళి అక్కడ వ్లచ్చుల మధ్య కుష్ఠ క్షణ వ్యాధులతో బాధపడుతున్న తండ్రిని చూచి చాలా దుఃఖించి ఆ వ్లచ్ఛలతో యిలా అన్నాడు. ఓ వ్లచ్చులారా! నేనీ పురుషునకు నమస్కరించి యీయననింటికి తీసికొనిపోయి రోగముక్తుణ్ణి చేసుకుంటాను. మీరనుమతినివ్వండి. అందులకా వ్లచ్ఛులంతా ప్రణామం చేసి అలాగే యిష్ట ప్రకారం చేసుకోవచ్చని అన్నారు. అంతట నారాజు పల్లకీ బోయీలకు యిబ్బడి కూలి యిచ్చి తన తండ్రిని ఒక శిబికలో ఎక్కించుకుని యంటికి తీసుకొని పోయినాడు. బోయీలా దయామయుని కోర్కె మన్నించి ఆ శిబిక నెత్తుకొని త్వరిత గతిని కురుక్షేత్రంలోని స్థాణు తీర్థం వద్ద దించి వెళ్ళిపోయారు. అంత నా రాజు మధాహ్న కాలాన అతనిని నదిలో స్నానం చేయించాడు. అ సమయాన ఆకాశాన్నుంచి వాయువేతెంచి యిలా అన్నది. వత్సా! తొందరపడవద్దు. తీర్థ ప­త్రతను కాపాడుము. ఇతన్ని మహా ఘోరమైన పాపాలు చుట్టుకొని ఉన్న­. వేదనింద అనే పాపానికి నిష్కృతి లేదు. అలాంటి దుష్టుడు స్నానం చేస్తే తీర్థ ప­త్రత నశించి పోతుంది. వాయువు మాటలు ­ని మరింతగా దుఃఖిస్తూ, అయ్యో! ఈయన ఎంతటి భయంకర పాపాలకు నెలవైనాడని వి­లపించాడు. యీ పాప పరిహారానికేదైనా ప్రాయశ్చిత్తం ఉంటే నేనది తప్పక చేయగలను. దయతో దేవతలు సెల­య్యండి. అని అర్థించాడు. అంతట దేవతలందరు యిలా సలహాయిచ్చారు. నీవు వరసగా ఒక్కొక్క తీర్థంలో స్నానంచేసి ఆ నీళ్ళతో యీతణ్ణి అభిషేకించుము. ఇలా ఓజస తీర్థం నుంచి సరస్వతి కావలనున్న చలుక తీర్థం వరకు చేయుము. శ్రద్ధాళువు లిలా తీర్థ స్నానం చేస్తే ముక్తలౌతారు. ఇక ఇతడో, అతి స్వార్థపరుడు దేవ దూషకుడు. బ్రాహ్మణులితణ్ణి పరిత్యజించారు. అంచేత ప­త్రుడు కానేరడు. కనుక యితని నుద్ధేశించి నీవు తీర్థాలలో మునిగి ఆనీటితో మార్జనం చేస్తే శుద్ధుడౌతాడు.

ఆ మాటలు విన్న ఆ రాజు ఆయనకొక కుటీరమచ్చట నిర్మించి అందతని నుంచి, తాను మనస్సులో తండ్రి ముక్తిని కాంక్షిస్తూ తీర్థాటనానికి బయలుదేరాడు. ప్రతిరోజూ ఆయా తీర్థాల్లో మునిగి అందలి పవిత్రోదకాలు తెచ్చి తండ్రి మీద ప్రోక్షణం చేసేవాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకచటకొక కుక్క వచ్చింది. అది పూర్వ జన్మలో స్థాణుమఠంలో కాల స్వామియొక్క ద్రవ్యరక్షిణా బాధ్యత అప్పగించబడిన అధికారిగా ఉండేది. మొదట్లో దేవద్రవ్య రక్షణ, పరిగ్రహం, వినియోగం మొదలయిన విషయాలలో చాలా నిక్కచ్చిగా, పవిత్రంగాఉంటూ అందరి మన్ననలకు పాత్రుడైన అధికారి కాలాంతరంతో బుద్ధి చెడిపోయి దేవద్రవ్య నాశనానికి కారకుడైనాడు. ధర్మదూరుడై మరణించిన అతడు పరలోకానికి పోగా యముడాతనిని చూచి తత్‌ క్షణమే వెళ్ళి కుక్కవై జన్మించమని శిక్షించాడు. అతడు మరుక్షణం సౌగంధిక వనంలో శునక జన్మయెత్తి అనేక శునకాలతో కలిసి తిరుగసాగాడు. కొన్నాళ్ళకొక ఆడకుక్క (సరమ) చేత అవమానం పొంది ఎంతగానో దుఃఖించాడు.అద్వైతవనాన్ని వదలి వంటరిగా పవిత్రమైన సంనిహిత్య సరోవరానికి పారిపోయాడు. అక్కడ స్థాణ్వీశ్వరుని దయవల్ల విపరీతమైన దాహం తీర్చుకోవడానికి సరస్వతీనదిలో మునిగాడు. దాహశాంతికి నీళ్ళలో మునిగిన ఆ కుక్క సకల పాపాల నుంచి విముక్తి పొందింది. స్నానం చేయగానే కరకర ఆకలి వేయడంతో ఆహారాన్ని వెతుక్కుంటూ అది రాజు తండ్రి ఉన్న గుడిసెలో దూరింది. రాజా కుక్కను చూచి భయంతో మెల్లగా తాకాడు. వెంటనే ఆ స్థాణుతీర్థంలో మునిగాడు. వెనకటి తీర్థంలో మునిగిన శరీరాన్ని ఆ కుక్క విదిలించుకొనగా అవి రాజుమీద పడినాయి. కుక్క వంటిమీది నీటిబిందువులు తన మీదపడగా ఆ రాజు భయపడినాడు. స్థాణుతీర్థ మహిమవల్ల ఆ విధంగా కుమారుని మూలాన ఆయన తరించాడు. వెంటనే ఇంద్రియ జయంకలిగి దివ్యశరీరాన్ని పొందాడు. అంతమహానందంతో ఆ వేనుడు ప్రణమిల్లి స్థాణు భగవానుని స్తోత్రం చేయసాగాడు.

వేనుడిట్లు ప్రార్థించెను. ప్రభూ శంకరా ! దేవుడవు ఈశానుడవు అభవుడవు చంద్రభూషణుడవగు నీకు శరణా గతుడనగుచున్నాను. నీవు మహాదేవుడవు, మహాత్ముడవు జగత్పతివి. దేవదేవేశ్వరా సర్వశత్రు నాశకా, ఇంద్రశక్తిని అదుపులో నుంచువాడా, దైత్యులచేత పూజింపబడువాడా, నిరూపాక్షా సహస్రాక్షా ముక్కంటీ, కుబేరసఖా, నీకు నమస్కారము. సర్వత్రా పాణిపాద అక్షిమస్తక, ముఖాల రూపంలో శ్రవణాల రూపంలో సమస్త విశ్వాన్ని ఆవరించియున్నావు !అన్ని చోట్ల ఉన్నావు. నీవు శంకు కర్ణుడవు (కొసదేలిన చెవులు గలవాడవు) మహాకర్ణుడవు, కుంభకర్ణుడవు, సముద్రాలకు నిలయుడవు, గజేంద్ర కర్ణుడవు, గోకర్ణుడవు, పాణికర్ణుడవు నీకు నమస్సులు. ఓ శతజిహ్వా ! శతావర్తా (అనేక జడలు గలవాడా) శతోదరా!శతాననా! గాయకులు నిన్ను పాడుచున్నారు. సూర్యారాధకులు నిన్నే ఆరాధిస్తున్నారు! ఓ శతక్రతూ! నిన్ను వారంతా పరబ్రహ్మగా పరిగణించుచున్నారు. ఓ మహామూర్తీ! నీ అనంతమైన మూర్తిలో సముద్రాలు, మేఘాలు, దేవతలు అందరూ పశువులకొట్టంలో ఆవులకు వలె ఆశ్రయం పొంది యున్నారు. ప్రభో!నీ శరీరంలో చంద్రాగ్ని వరుణులను నారాయణ సూర్య విరించి బృహస్పతులను దర్శిస్తున్నాను. దేవా! నీవు కారణం, కార్యంక్రియకు కారణుడవు, సర్వం నీ నుంచి ప్రభవిస్తవి, నీవే ప్రలయానివి, సదసత్‌ దైవతానివి నీవే! భవా! నీకు నమస్కారము శర్వా, వరదా, ఉగ్రరూపీ, అంధకాసుర నాశకా, పశుపతీ, త్రిజటేశ్వరా, త్రిశీర్షా త్రిశూలధరా, త్రినేత్రా త్రిపుర సంహారకా నీకు నమోవాకములు! ముండివి, చండుడవు, అండరూపివి, జగద్యోనివి, డిండిమ హస్తుడవు, డిండిముండ (ఒక ఓషధి) రూపి గు నీకు ప్రణామములు. ఊర్ధ్వ కేశివి, ఊర్ధ్వదంష్ట్రుడవు, శుష్కుడవు, విరూపివి, ధూమ్రలోహితకృష్ణ వర్ణుడవు, నీలకంఠడవునగు నీకు నమస్సులు, నీకు సాటి ఎవ్వరూలేరు,వికృతాకారుడవు నీవు, అయినా సర్వకల్యాణకరుడవు, సూర్యుడవు, ఆదిత్యమూలాధారివి, నీ రూపమే నీకు ధ్వజమాలికలు, మానము అతిమానము నీవే, పాటవమంతా నీ రూపమే, సమస్త గణాధీశులకు ప్రభువు నీవే వృషభ స్కంధుడవు, మహాధానుష్కుడవు; నీకు నమస్సులు ! నీవు సంక్రందనుడవు, చండుడవు, పత్రధార పుటములు గలవాడవు, హిరణ్య వర్ణుడవు కనకాభశరీరుడవు నీకు ప్రణామములు. స్తుతింపబడినవాడవు, స్తుతింపబడదగినవాడవు, స్తుతి రూపాన నిలచునాడవు నీవే. నీకు నమస్సులు. సర్వుడవు,సర్వభక్షకుడవు, సర్వభూత శరీరి నీవు. వినతుడవు నీవు, తృణజటాధారివి నీవు, అట్టి నీకు నమోవాకములు. ఓ కృశనాసా! శయితా (శయనించిన) ఉత్థితా (లేచిన) స్థితా (నిలచిన) ధావకా (పరుగిడునట్టి) ముండిత శిరస్కుడా, కుటిలుడా నీకు నమస్సులు!

ఓ నర్తనశీలీ, లయవాడిత్ర శాలీ, నీకు నమస్సులు, నాట్య ప్రదర్శనలోలా ముఖవాద్య ప్రవీణా (సుషిరవాద్యాలు) జ్యేష్ఠా ! శ్రేష్ఠా ! అత్యంత బలశాలురను నిర్జించువాడా, మృత్యునాశకా, కాంస్వరూపా, లయరూపా నీకు నమస్కారము. ఓ పార్వతీ ప్రియా! భైరవా! ఉగ్రా! దశబాహూ నీకు ప్రతతినిత్యమూ నమశ్శతాలు. చితి భస్మప్రియా, కపాలహస్తా, విభీషణ, భయంకరా! కఠోరవ్రతధరా! వికృతముఖా, పవిత్రమైన తీవ్రదృష్టి గలవాడా, పక్వంచేసిన అమమాంసలోలుసా, తుంబి వీణా ప్రియా నీకు ప్రణామములు. వృషాంక (రుద్రాక్ష) వృక్షరూపా, ఆంబోతు రంకెవంటి కంఠధ్వనికల ప్రభూ! కటంకటా (అగ్నిరూపా), భీమా, పరా అపరా స్వరూపా నీకు నమస్సులు. ఓ సర్వశ్రేష్ఠా, వరా, వరదా, నిరాసక్తా, కర్మఫల దాతా (భావనా) రుద్రాక్షమాలాతరా, విభేద భేద భిన్నరూపా, ఛాయారూపా, ఊష్మరూపా, అఘోర ఘోరరూపా (సౌమ్యఘోరరూపా) ఘోరఘోరతరా (ఉగ్రాతి ఉగ్రుడా) నీకు నమస్సులు. శివా నీకు ప్రణామం, శాంతా, శాంతతమ రూపా, బహునేత్ర కపాలా, ఏకమూర్తీ (పరస్పర విరుద్ద గుణరూపా) నీకు నమోవాకములు. క్షుద్రరూపా, లుబ్ధరూపా, యజ్ఞ భాగప్రియా ! పంచాలా (పాంచాల జాతి) శ్వేతాంగధరా, యమా (మృత్యు) నిరోధకా విచిత్రమైన పెద్దగంట కలవాడా, గంట మరియు ధాతు నివాసం కలవాడా, వందలు, వేలు గంటలు కలవాడా, గంటల మూలిక ధరించువాడా నీకు అనంత ప్రణామములు. ప్రాణవాయు సంఘటన శక్తితో గర్వించువాడా, కిలికిలినాద ప్రియా, హుంకారరూపా హుంకార ప్రియా నీకు ప్రణామములు. సమసమా (శాంతినాశకా) గృహ వృక్షనివాసీ (బిల్వరూపీ) గర్భమాంససృగాలా (శిశుమాంస భోజియగునక్క) తారకా, (నావికా) తరా (నౌకారూపా) నీకు నమోవాకాలు. యజ్ఞరూపా, యూజకా, హుతా, ప్రహుతా (సర్వభూత బలి), యజ్ఞవాహకా, హవ్యరూపా, తప్యా, ధపనా (తపస్సు -సూర్యుడు) నీకు నమస్కారం, పయ (జలం) స్వరూపా, తుండపతీ (వక్త్రాధిపతి) అన్నదాతా, అన్నపతీ, నానాన్న భోజీ నీకు ప్రణామములు. సహస్ర శీర్షా! సహస్ర చరణా, సహస్రోద్యత శూలీ, సహస్రాభరణా, బాలానుచర గోప్తా (చిన్న పిల్లలను రక్షించువాడా) బాలలీలావిలాసీ, బాలరూపా, వృద్ధరూపా, క్షోభించినవాడా, క్షోభింపజేయువాడా, గంగాలులితకేశా (గంగాధర) , ముంజకేశా, నమస్కారము. షట్కర్మ సంతోషీ, కర్మత్రయనిరతా, నగ్నప్రాణా, చండా ! కృశా ! స్ఫోటనా (సాక్షాత్కరించువాడా) చతుర్విధ పురుషార్థరూపా, చతుర్విధ పురుషార్థ ప్రతిపాదకా నీకు నమోవాకములు.

ప్రభూ! సాంఖ్య శాస్త్రం నీవే, ఆసాంఖ్యసారతత్వం నీవే. సాంఖ్యయోగ శాస్త్రాధినేతవు నీవే. విరథుడవు, రథ్యుడవు, చతుష్పథరథికుడవు నీవే. ఇట్టి నీకు నమస్కారము. మృగచర్మధరా, సర్పయజ్ఞోపవీతా, వక్త్రా సంధానకేశా (ముఖానికంటుకొనిన కేశములు కలవాడా) హరికేశా నీకు ప్రణామము. మూడు కన్నులుగల అంబికాపతీ, వ్యక్తావ్యక్త స్వరూపా, విరించీ, నీకు నమస్కారము. కామకామదాతా, కామహరా, తృప్తాతృప్త విచారకా, సర్వదాతా, పాపనాశకా, కల్ప సంఖ్యా విచారకా నీకు నమోవాకములు. మహాసత్వా, మహాబాహో, మహాబలా, మహామేఘా, మహాప్రఖ్యా, మహాకాళా, మహాద్యుతీ, మేఘావర్తా, యుగావర్తకా, చంద్రసూర్యపతీ నీకు నమస్సులు. అన్నానివి నీవు అన్నభోక్తవు నీవు, పక్వభోజివి, పోవనోత్తముడవు, జరాయుజ, అండజ, స్వేదజ ఉద్భిజాలనే నాలుగురకాల జీవసమూహంనీవే, ఈ చరాచర జగత్తు సృష్టించినది నీవు. దీనిని రక్షించి లయముచేసేదీ నీవే. బ్రహ్మవేత్తలగువారు నిన్ను సృష్టికర్తగా బ్రహ్మవేత్తలకు పరమ గమ్యముగా పేర్కొంటారు. నీవు మనస్సుయొక్క వెలుగువు. దివ్యజ్యోతులలోని వాయువు నీవే. హంస వృక్షం (జీవాత్మల) పై తిరిగే మధుకరమని నిన్ను బ్రహ్మవాదులు ప్రశంసిస్తారు. ఋగ్యజుస్సామ వేదమయుడవు నీవు, వేదోపనిషత్తు లెల్లప్పుడు నిన్నే స్తుతిచేస్తుంటాయి. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర తదితర వర్ణాలు నీవే, మేఘబృందం, విద్యుత్తు, అశని పాతం, సంపత్సర ఋతుమాస పక్షములు, యుగములు, నిమేషకాష్ఠాలు, నక్షత్రగ్రహ కళలు అన్నీ నీ రూపాలే. నీవు వృక్షాల్లో అర్జున వృక్షానివి, గిరులలో హిమవంతానివి, మృగాల్లో వ్యాఘ్రానివి, పక్షులలో వైనతేయుడవు, సర్పాలలో అనంతుడవు, సముద్రాల్లో క్షీరసముద్రానివి, యంత్రాలలో ధనుస్సువు, ప్రహరణాల్లో వజ్రానివి, వ్రతాలలో సత్యానివి. ద్వేషం, కోరిక, రాగమోహాలు, క్షమాక్షమలు, వ్యవసాయం, ధృతి లోభం కామక్రోధ జయాపజయాలన్నీ నీవే. నీ వద్ద బాణాలు, గదలు, ధనుస్సలు, ఖట్వాంగాలు, తూణీరాలు, ఉన్నవి. నీవు ఛేత్తవు, భేత్తవు, ప్రహర్తవు, మంతవు (మననశీలివి) నేతవు సనాతనుడవు, దశలక్షణ లక్షితమైన ధర్మానివి, అర్థకామాలు నీవే, సముద్రాలు, నదులు, గంగ, పర్వత సరోవరాలు, లతలుతృణాలు, ఓషధులు పశుమృగపక్షి గణాలు అన్నీ నీవే ప్రభూ ! ద్రవ్య, కర్మ గుణాల ఉద్గమం, కాలమనే పుష్పం, దాని ఫలం యిచ్చేది నీవే, వేదాల ఆద్యంతాలు, గాయత్రి, ప్రణవ ఓంకారం, లోహిత, హరిత, నీల, కృష్ణ, పీత, శ్వేత, కద్రు, కపిల, కపోత, మేచకాది వర్ణాలు అన్నీ నీ విలాసాలే. వర్ణ (రంగు) రాహిత్యం, వర్ణత్వం, కర్తృత్వం, ఉపసం హరణం అంతా నీవే. నీవింద్రుడవు, యముడవు, వరుణుడవు, కుబేరుడవు, వాయువు, రాహువు, అగ్నివి.

నీవు శిక్షాహోత్రుడవు (యజ్ఞజ్ఞానోపదేష్టవు) త్రిసుపర్ణ ఛందః స్వరూపివి. యజుర్వేదములోని శంరుద్రీ యమవు, పవిత్రులలో పవిత్రుడవు, శివంకరులలో శివంకరుడవు; తిందుక, గిరజ తరువులు, అందతకు జీవనరూపమైన ముద్గ (పెసర) ధాన్యము, ప్రాణతత్వము, సత్వరజస్తమాలు, ప్రతిపత్పతి, ప్రాణాపాన సమానోదాన వ్యానములు, ఉన్మేషనిమేషాలు, చీదుట, ఆవులించుట అన్నియు నీవే; రక్తంలో నీవే దాగియున్నావు, దృష్టివి, మహావక్త్రుండవు, మహోదరుడవు, శ్వేతరోముడవు, హరితశ్మశ్రు (వచ్చని గడ్డముగల) డవు, ఊర్ధ్వకేశివి, చలాచలడవు, నీకు నమస్సులు, గీతవాదిత్రనృత్య జ్ఞాతవు. గీతవాదిత్రనృత్య ప్రియుడవు, మత్స్యానివి, పలవు, జలగవు, కాలుడవు, కేళికశవు, కవివి, అకాల, వికాల, దుష్కాల, కాలములు నీరూ పాలే. మృత్యువు, మృత్యకారకుడు, యక్షుడు, యక్షులకు భయము గొల్పువాడు. సంవర్తకుడు, అంతకుడు, సంవర్తక పలాహక మేఘములు, అన్నీ నీ రూపాలే. గంటవు, గంట కలవాడవు, గొప్ప గంట కలవాడవు, మందగతి, మాలాధండవు, మాతలివి, బ్రహ్మవు, కాలుడవు, యముడవు, అగ్నివి, దండ ధరుడవు, కేశ రహితశిరుడవు, త్రిమస్తకుడవు, నాల్గుయుగాలను నాల్గు వేదాలను, నాల్గు హోత్రాలను ప్రవర్తింపజేయువాడవు. నాలుగాశ్రమాలకు అధినాయకుడవు. చాతుర్వర్ణ్య కర్తవు, అన్నీ నీవే. ఎప్పుడూ జూదప్రియుడవు. ధూర్తుడవు, సర్వ గణాలను నిరీక్షించువాడవు, గణాధీశ్వరుడవు, ఎర్రని మాలలు వస్త్రాలు ధరించువాడవు, కందుకానివి, కందుక ప్రియుడవు, శిల్పానివి, శిల్పులలో శ్రేష్ఠుడవు, సర్వ శిల్పాలను ప్రవర్తింపచేసిన ప్రభుడవునీవు. భగుని నేత్రాలను పూషుని పండ్లను రాలగొట్టిన భయంకరుడవు, స్వహా,స్వధా, పషట్కార నమస్కారరూపివైన నీకు శతశః నమస్సులు. నీవు, గూఢ వ్రతుడవు, గుహ్య తపస్వివి, తాధివు, తారకామయుడవు. ధాతవు, సంధాతవు, పృథివికి వేరొండు ఆధారానివి. వేద బ్రహ్మ, తపస్సు. సత్యం, వ్రతాచచణం, ఆర్జనం, భూతాత్మ, భూతకర్త, ఐశ్వర్యం, భూంభవిష్యద్వర్తమానాలు, భూర్‌ భవఃసురవర్లోకాలు, ఋతఁధ్రువం, దాంతం, అన్నీ నీరూపాలే. నీవు మహేశ్వరుడవు, దీక్షతుడవు. దీక్షా రహితుడవు, చక్కని వాడవు, దుర్దాంతుడవు, దాంతికి మూలానివి! చంద్రుని రూపాన, యుగాల రూపాన, మేఘాల రూపాన నీవే మాటి మాటికీ వస్తుంటావు. బిందురూపివి, అణు రూపివి, స్థూలుడవు, కర్ణికార (గన్నేరు) పుష్పమూలాస్రియుడవు. నంది ముఖుడవు, భీమ ముఖుడవు, సుముఖుడవు, దుర్ముఖుడవు, హిరణ్య గర్భుడవు, పక్షివి, భయంకరమైన సర్ప శ్రేష్ఠుడవు, విరాట్పురుషుడవు, అధర్మ నాశకుడవు, మహా దేవుడవు, దండధారివి, ఉత్కట గణరూపివి, ఎద్దువలె రంకె వేయువాడవు(గోవర్ద) గోవు ను దాటించువాడవు, పృషభేశ్వర వాహనుడవు, త్రిలోక రక్షకుడవు, గోవిందుడవు, గోమార్గానివి, మార్గానివు, స్థిరుడవు, శ్రేష్ఠుడవు, స్థాణు రూపివి, విక్రోశ, క్రోశ రూపివి అయిన నీకు నమస్సులు. నిన్నెవ్వరూ వారించలేరు, సహించలేరు అతిక్రమించలేరు, ధర్షించలేరు: నీ వెలుగు (కొందరకు) దుష్టమైనది, నిన్ను దర్శించుట కష్టము. నిన్నెవరు జయింపలేరు. నీవు విజయానివి. చంద్రాగ్నులవలె చల్లగా వేడిగా ఉంటావునీవు. ఆకలి దప్పిక, ఆరోగ్యము, అధి వ్యాధులు, వ్యాధి శమనము అంతా నీవే. సమూహాలకు సమూహాలనే సంహరిస్తావు. సనాతన దైవానివి, శిఖండివి, పుండరీకాషుడవు, పుండరీకవనాల్లో (సరస్సుల) ఉంటావు. త్ర్యంబకుడవు, దండ ధరుడవు, ఊగ్రదంష్ట్రలు కలవాడవు, కులాంతకుడవు. విషశనాకుడవు, దేవశ్రేష్ఠుడవు, సోమరసపాయివి, మరుత్తుల నాయకుడవు. అమృతభోజివి, దేవతలకు దేవగణాలకు అధిపతివి, మధువులొలికించువారల మధువు త్రాగువాడవు, బ్రహ్మవాణివి వేయిరాల్చువాడవు. సర్వలోకాలు నీకు భోజ్యాలు. సర్వ లోకాలకు పితామహుడవు నీవే. నీకు నమోవాకములు.

ప్రభూ ! నీవు హిరణ్యరేతస్కుడవపు ! ఏకైక పరమపురుషుడవు. నీవు స్త్రీవి, పురుషుడవు, నపుంసకుడవు, బాలుడవు, ముసలివాడవు, స్థవిరుడవు ఐరావత గజానివి. సర్వమాన్యుడవైన విశ్వకారకుడవు. నీకు నమస్సులు. సృష్టిచేయు విధాతలలో నీవు సర్వశ్రేష్ఠుడవు. శ్రద్ధాశువు లెల్ల వేళల నిన్నారాధిస్తారు. చంద్ర సూర్యులు నీ నేత్రాలు. నీవే అగ్నివి బ్రహ్మవు. సరస్వతీ రూపాన నిన్నారాధించి నరులు వాక్కుకు సంపాదింతురు. రాత్రంబవళ్ళు నీవే. నిమేషం (కన్నులుమూయుట) ఉన్మేషం (కండ్లు తెరచుట) నీవే. ఓ మంగళ స్వరూపాః నీ మహిమను యథార్థముగా తెలిసికొనుట బ్రహ్మ విష్ణువు ప్రాచీన మహర్షులకు గూడనలవి కాదు. వేలాది ప్రజల నావరించి నిబిడీకృతమైన ఘోరాంధకారాని కవ్వల వెలుగుచు నీవు వారందరనూ రక్షిస్తూ నడుపుతూ ఉంటావు. నిద్రా ప్రాణాలను నిరోధించి, జితేంద్రియులై సర్వగుణ ప్రధానులగు మహాత్ములు జ్యోతిస్సు రూపంలో దర్శించే యోగాత్మవు, పరమాత్మడవు నీవు, అట్టి నీకు నమస్కారము. నిర్దేశించుట కలవిగాని సూక్ష్మాతి సూక్ష్మాలయిన నీ అనంతమూర్తులలో, కన్నకొడును తండ్రివలె నీవు నన్ను రక్షింపుము. నే నీచే రక్షింపబడదగిన వాడను. అట్టినన్ను సదారక్షించుము. ఓ పాపరహితా నీకు నమస్సులు. భక్తుల కనికరించు భగవాన్‌ నే నెల్లవేలల నీకు దాసుడను. ఓ జటాధరా ! ముండీ ! దండధరా ! లంబోదర దేహా ః కమండలుధరా ! రుద్రరూపా నీకు నమస్కారము. నీ కేశాలలో మేఘాలున్నవి, సర్వాంగ సంధుల యందూ నదులున్నాయి, నీకుక్షి సర్వసముద్రాలకు నిలయం, అలా జలాత్మకుడవగు నీకు ప్రమామాంజలులు ! యుగాంతరవేళల్లో సకల జీవరాశినీ భక్షించి జలాల్లో విశ్రమించే జలశయానుడగు ప్రభువును శరణువేడుచున్నాను. ఆ ప్రుభువు రాహువు నోటిలో ప్రవేశించి రాత్రివేళల్లో సోమపానం చేస్తాడు. అనీ తేజస్సు రక్షా కవచం కాగా రాహువు సూర్యునే మ్రింగుచున్నాడు. రుద్రుని రక్షణలో యిచట గర్భపాతాలు జరుగుతున్నవి ! అద్భుతానికి స్వధా, స్వాహాగా మారుతున్నది. అంగుష్ఠమాత్ర పురుషాకృతిలో సకల శరీరాలలో నెలకొన్న ప్రభువు ప్రతి నిత్యము నన్ను రక్షించుగాక. ముందుకు నడుపుగాక నదులలో, సముద్రాల్లో, పర్వత గుహలలో, వృక్షమూలాలలో గోశాలల్లో , కీకారణ్యాలలో, చతుష్పథాలలో, రాజమార్గాలలో, సభాసదనాలలో, గజాశ్వరథశాలల్లో, శిథిలాలయాలలో, ఉద్యానవానాల్లో, పంచభూతాల్లో, దిగ్దిగంతరాలలో, చంద్ర సూర్యులలో, వారలకిరణ సమూహంలో, పాతాళ వాసులలో తదితరస్థానాల్లో సర్వత్రా ఆ విధంగా వ్యాపించియుండే ఆ ప్రభువు మూర్తులకు అహరహం నమస్సులు, ప్రణామాలు, నతులు చేయుచున్నాను. లెక్కకు మిక్కుటమైన రూపాకృతులలో, అసంఖ్యాకంగా గణాల రూపంలో సర్వత్రా వ్యాపించి యున్న రుద్రులకు నమోవాక శతాంజలులు ! మీరందరు నా యెడ ప్రసన్నులుకండు. మీకు కళ్యాణమగుగాక. నేను మీ వడను. ఓ దేవదేవా ! నీవే నా హృదయం, నా బుద్ధి మతి సర్వస్వమూను. నీకు నమస్సులుః ఆ విధంగా మహాదేవుడైన శంకరుని స్తుతించి ఆ ఉత్తమ ద్విజుడు వినతుడయ్యెను.

ఇది శ్రీ వామన మహాపురాణం సరోవరమాహాత్మ్యంలో యిరువది యారవ అధ్యాయం సమాప్తం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment