వైశాఖమాస ప్రశంస
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా ! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసములయందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు.
వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి ?
ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి ?
మానవులాచరింవలసిన దానములను , వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ , దానము మున్నగువానిని యే దైవము నుద్దేశించి చేయవలయును ?
వాని ఫలమెట్టిది ? పూజాద్రవ్యములెట్టివి ?
మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.
నారదుడును రాజర్షీ ! అంబరీషా ! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయూ ‘నారదా ! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము , మాఘము , వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము , పూజ , దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన , పూజా , జప , దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు.
విద్యలలో వేదవిద్యవలె
మంత్రములలో ఓంకారమువలె
వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె
ధేనువులలో కామధేనువువలె
సర్వసర్పములలో శేషునివలె
పక్షులలో గరుత్మంతునివలె
దేవతలలో శ్రీమహావిష్ణువువలె
చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె
ఇష్టమైన వానిలో ప్రాణమువలె
సౌహార్దములు కలవారిలో భార్యవలె
నదులలో గంగానది వలె
కాంతి కలవారిలో సూర్యుని వలె
ఆయుధములలో చక్రమువలె
ధాతువులలో సువర్ణమువలె
విష్ణుభక్తులలో రుద్రునివలె
రత్నములలో కౌస్తుభమువలె
ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ , తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును , పూజను చేసినను , పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున , కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక , స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖ స్నానము నది , ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను , కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.
అంబరీష మహారాజా ! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశమున నున్న జలము నదియైనను , తటాకమైనను , సెలయేరైనను , అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను , జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును , యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు.
సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.
వైశాఖ పురాణం మొదటి అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹 వైశాఖమాస స్నాన సంకల్పము 🌹🌹
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||
సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం |
నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||
వైశాఖః సఫలోమాసః మధుసూదన దైవతః |
తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధికః ||
వైశాఖః సఫలం కుర్యాత్ స్నానపూజాదికం |
మాధవానుగ్రహేణైవ సాఫల్యంభవతాత్ సదా ||
మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరరౌ |
ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ||
ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/గంగా/గోదావర్యోః మధ్యదేశే అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ …….(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ఉత్తరాయనే, వసంతఋతౌ, వైశాఖమాసే, ….పక్షే , ….తిధౌ, ……వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ …..(పేరు చెప్పాలి), గోత్రః ………(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం, ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు, జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వే షాంపాపానాం అపనోద నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం, కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం, సర్వపాపక్షయార్ధం, ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మేషంగతేరవౌ మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే.
సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము
గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||
పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి
మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||
అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజంఫలం
స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||
విశ్వేశం మాధవండుంఢిం దండపాణీం చ భైరవం
వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||
అతితీక్షమహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||
త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||
యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః
సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||
నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||
భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే
స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||
సమస్త జగదాధార శంఖచక్ర గదాధర
దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||
నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే
నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||
మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ
ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నంకురు మాధవ ||
స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ, ప్రవాహానికి యెదురుగా, వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి, తరువాత మడి/పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన/గృహమున దైవమును అర్చించాలి. స్నానము చేయుచు క్రింది శ్లోకములను చదువుచు శ్రీహరికి – యమునికి అర్ఘ్యమునీయవలెను.
వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః |
అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణమధుసూదన ||
గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |
ప్రగృహ్ణీత మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ||
ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |
గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||
దానమంత్రం
ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం …..గోత్ర, …..నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్షయార్థం, శుభఫలావాప్త్యర్థం అముక ……గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.
దాన పరిగ్రహణ మంత్రం
ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ……గోత్ర, ….నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిగృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.
పురాణ ప్రారంభమున వైష్ణవులు చదువదగిన ప్రార్థనా శ్లోకములు
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||
యత్ర యోగీశ్వరః కృష్ణః యత్రపార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయోభూతిః ధ్రువానీతిః మతిర్మమ ||
లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||
అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ
ఆ కర్ణపూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్ష్మణౌ ||
సన్నద్ధః కవచీఖడ్గీ చాపబాణధరోయువా
గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతుసలక్ష్మణః ||
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యమ్
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||
ఉల్లాస పల్లవితపాలిత స్పతలోకీం నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం
శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ||
పురాణము ముగించునప్పుడు చదువదగిన ప్రార్థనా శ్లోకములు
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||
వందేలక్ష్మీం పరశివమయీం శుద్దజాంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం ||
బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానాం
ఆద్యాంశక్తీం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ||
కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయచ
విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః ||
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||
కాలేవర్షతు పర్జన్యః పృధివీసస్యశాలినీ
దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||
స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః
సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మికః ||
సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||
అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||
పురాణ ప్రారంభమున శివ సాంప్రదాయము వారు చదవవలసిన ప్రార్థనా శ్లోకములు
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||
వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిం ||
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ||
తప్త స్వర్ణవిభా శశాంకమకుటా రత్నప్రభాభాసురా
నానావస్త్ర విరాజితా త్రిణయనాభూమీరమాభ్యాం యుతా ||
దర్వీహాటక భాజనం చదధతీరమ్యోచ్చపీనస్తనీ
నృత్యంతం శివ మాకలయ్య ముదితాధ్యేయాన్నపూర్ణేశ్వరీ ||
భవానీ శంకరౌవందే శ్రద్దా విశ్వాసరూపిణో
యాభ్యాంవినాన పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం ||
ఉక్షం విష్ణుమయం విషాణకులిశంక రుద్ర స్వరూపంముఖం
ఋగ్వేదాది చతుష్టయంపద యుతం సూర్యేందు నేత్ర ద్వయం ||
నానాభూషణ భూషితం సురనుతం వేదాంత వేద్యంపురం
అండం తీర్థమయం సుధర్మ హృదయం శ్రీనందికేశంభజే ||
పురాణం ముగించునపుడు చదవదగిన ప్రార్థనా శ్లోకములు
సాంబోనః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం
సాంబం స్తౌమిసురాసురోగగణాః సాంబేన సంతారితాః ||
సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే
సాంబస్యామ చరోస్మ్యహం మమరతిః సాంబే పరబ్రహ్మణి ||
ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం
ఆగమవిపిన మయూరీం ఆర్యామంతర్వి భావయే గౌరీం ||
యశ్శివోనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయ మంగళం ||
నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే ప్రభో ||
వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగంమహోన్నతం
ఘంటాంగళే ధారయంతాం స్వర్ణరత్న విభూషితం
సాక్షాద్ధర్మ తనుందేవం శివవాహం వృషంభజే ||
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంమహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||
కాలేవర్షతు పర్జన్యః పృధివీ సస్యశాలినీ
దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||
స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః
సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మిక ||
సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||
అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹