భగవ ద్విభూతి స్థానాలు
శ్రీవామన దేవుడిలా చెప్రుకుంటూ పోయాడు. ఓ బ్రహ్మర్షీ! నా వ్యక్త రూపాల్లో మొదటిదీ మహోన్నతమైనదీ మత్స్యరూపం. మానస సరోవరంలో ఉన్నది. కీర్తన స్పర్శనాదుల చేతనే అది సర్వ పాపాలనూ నశింప జేస్తుంది పాప నాశకమై కూర్మరూపం కౌశిక నదిలో సన్నిహితమై యున్నది. కృష్ణాంశ తీర్థంలో హయ శీర్షం హస్తినాపురంలో గోవింద రూపాలున్నాయి.
త్రివిక్రమ రూపం యమునలో, భవ రూపం లింగభేదంలో, కేదారంలో మాధవ శౌరి రూపాలు, కుబ్జామ్రంలో హృష్టమూర్ధజహృష్టీకేశ రూపాలున్నాయి. బదరికా వనంలోని నారాయణుడు, గరుడాసన క్షేత్రంలోని వరాహమూర్తి, భద్రకర్ణంలోని జయేశ్వరుడు, విపాశా నదిలోని బ్రాహ్మణ ప్రియుడు నా రూపాలే. ఇరావతి లోని రూపధరుడు, కురుక్షేత్రం లోని కురుధ్వజుడు, కృతశాచం లోని నృసింహుడు, గోకర్ణంలోని విశ్వకర్మ, ప్రాచీనంలో కామపాలుడు, మహాంభసంలోని పుండరీకుడు, విశాకయూపంలో అజితుడు హంసపది లోని హంసుడు, వయోష్ణిలోని అఖండుడు, వితస్తలోని కుమారిలుడు, మణిపర్వతాన గల శివుడు, బ్రహ్మణ క్షేత్రం లోని ప్రజాపతి, వీరందరు నా రూపాలే. మధు నది లోని చక్ర ధరుడు, హిమాలయాన శూలపాణి, ఓషధిప్రష్థాన గల విష్ణువు, భృగు తుంగంలోని సువర్ణాక్షుడు, నైమిషంలోని పీతాంబరుడు, గయా క్షేత్రం లోని గదాధర గోపతీశ్వరులు, గోప్రతారల లోని త్రైలోక్య నాధ, వరద, కుశేశయరూపాలు, దక్షిణాన పవిత్రమైన మహేంద్ర గిరి మీది అర్థనారీశ్వరుడు, ఉత్తర మహేంద్రంలో గోపాల, సోమ పీధి, మూర్తులు సహ్యగిరిపై వెలసిన వైకుంఠుడు, పారియాత్ర చలాన అపరాజితుడు, కవేరు దేశం లోని దేవేశ్వర, విశ్వరూప, తపోధన, రూపాలు మలయ పర్వతాన గల సుగంధి (పరిమళం), వింధ్య పాదాన గల సదాశివ రూపం, నా విభూతులే నని తెలుసుకో భరద్వాజా! అవంతి దేశాన విష్ణువు, నిషధలోని అమరేశ్వరుడు, పాంచాల భూమి యందలి పాంచాలిక దేవుడు, మహోదయం లోని హయగ్రీవుడు, ప్రయాగ లోని యోగ శాయి, మధువనంలోని స్వయంభూదేవుడు, సుష్కరకేశవుడు, లోలుడు , నా అంశలే!-
పద్మక్షేత్రంలో పద్మ కిరణ రూపంలో సముద్రంలో బడవా ముఖంగా, కుమార ధారలో బాహ్లీశ కార్తికేయ, బర్హిణులుగా, అజేశంలో శంభు, అనఘ రూపాల్లో, కురు జాంగలంలో స్థాణువుగా, కిష్కింధవాసుల చే వనమాలియని పిలువ బడుతూ ఉన్నవి, నా అంశలే, నర్మదలో నన్ను వీరుడనీ, కువ లయా రూఢుడనీ, శంఖచక్ర గదాధరుడనీ, శ్రీవత్సాంకుడనీ, ఉదారాంగు శ్రీయఃపతి అనీ, పిలుస్తారు. మాహిష్మతిలో త్రినయనుడనీ, హుతాశను డనీ, అర్బుదక్షేత్రాన త్రిసౌపర్ణుడనీ, సూకరాచలంలో క్ష్మాధరుడనీ నాకు పేర్లు. ఓ బ్రహ్మర్షీ! ప్రభాస క్షేత్రాన త్రిణాచికేత, కపర్ది, సోమ శేఖర, రూపాల్లో నేనుంటాను. ఉదయ తీర్దాన శశి, సూర్య, ధ్రువులుగా హేమ కూటంలో హిరణ్యాక్షుడుగా, శరవణంలో స్కందుడుగా ఉన్నాను. మహాలయంలో రుద్రుడుగా, ఉత్తరుకురు దేశానసర్వ సౌఖ్యదాయాకుడగు పద్మనాభుడుగా నాకు ప్రసిద్ది! సప్త గోదావరి క్షేత్రాన హాటకేశ్వరుడుగా, మహాహంసగా, వటేశ్వరుడుగా, ప్రయాగలో నాకు పేర్లు. శోణలో రుక్మకవచుడను, కుండినలో ఘ్రాణ తర్పణుడగను, ఖిల్లీ వనంలో మహాయోగిని, మద్ర దేశంలోని పురుషోత్తముడను నేనే. స్లక్షావతరణంలో విశ్వుడుగా, శ్రీనివాసుడుగా, శూర్పారకాన చతుర్భుజుడుగా, మగదలో సుధాపతిగా నన్ను పేర్కొంటారు. గిరివ్రజంలో పశుపతిగా, యమునా తీరాన శ్రీకంఠుడుగా, దండకారణ్య వాసులచే వనస్పతిగా తెలియబడుచున్నాను. కాలింజరంలో నీల కంఠుడను. సరయూ తీర్థాన శంభుడను, మహాకోశిలో హంస యుక్తుడను. దక్షిణ గోకర్ణంలో శర్వుడను. ప్రజా ముఖ తీర్థంలో వాసుదేవుడను. వింధ్య శిఖరాన మహాశౌరిని, కంధలో మధుసూదనుడను గా ఉన్నాను. ఓ బ్రాహ్మణా! త్రికూట శిఖరాన చక్రపాణి ఈశ్వరులుగా, లౌహదండలో హృషికేశుడుగా, కోసలలో మనోహరుడుగా సురాష్ట్రంలో మహా భుజుడుగా, నవరాష్ట్రంలో యశోధరుడుగా, దేవికా నదిలో భూదరుడుగా, మహోదలో కుశ ప్రియుడుగా నన్ను పేర్కొంటారు. గోమతిలో ఛాదిత గదుడుగా, శంఖోద్ధారంలో శంఖిగా, సైంధవారణ్యంలో సునేత్రుడుగా, శూరపురంలో శూరుడు గా నేనే ఉన్నాను. హిరణ్యధతిలో నేను రుద్రుడను. త్రివిష్టపంలో వీరభద్రుడను. భీమా తారాన శంకు కర్ణుడను. శాలవనంలో భీముడను.
అక్కడనే నా విశ్వామిత్ర రూపం. ఉన్నది కైలాసాన వృషభ ధ్వజుడను, మహాళాగిరి మీద మహేశుడను, కామ రూపాన శశి ప్రభుడను, వలభిలో గోమి త్రుడను, కటాహక్షేత్రాన పంకజ ప్రియుడను, సింహళ ద్వీపంలో ఉపేంద్రుడను, శక్ర తీర్థాన కుంద మాలా ధరుడను, రసాతలంలో సహస్ర శీర్షు (ఆదిశేషువు) డుగా విఖ్యాతుడను అక్కడనే కాలాగ్ని రుద్రకృత్తి వాసుల రూపాన గూడ ఉన్నాను. సుతలాన కూర్మ, అచల, రూపాలలో, వితలాన పంకజాసనుడుగా పున్నది నా అంశలే. ఓ గురూ | మహా తలాన ఛాగలేశ, దేవేశులుగా తల లోకాన సహస్ర చరణుడుగా, సహస్రభుజుడుగా, ఈశ్వరుడుగా, సహస్రాక్షుడుగా, ముసలాకృష్ట దానవుడుగా పిలువ బడుతున్నాను. పాతాళంలో యోగీశ, హరి, శంకర, రూపాల్లోను, ధరా తలాన కోక నదుడు గాను, మేదిని యందు చక్ర పాణి గాను ప్రసిద్దుడనైనాను. భువర్లోకాన నేను గరుడుడను. స్వర్లోకాన అవ్యయుడ నగు విష్ణువును. మహార్లోకంలో అగస్త్యుడను, జనో లోకాన కపిలదేవుడను. తపో లోకంలో అఖిల వాజ్మయ సత్య సంయుతరూపాలు. ఏడవది యగు లోకాన బ్రహ్మ రూపాన నేను ప్రతిష్ఠ నందు చున్నాను. శైవ వాతావరణంలో సనాతనుడను. వైష్ణవ సముదాయాన పరబ్రహ్మను. నిరాలంబస్థితిలో అప్రతర్క్యుడను. నిరాకాశంలో తపోమయుడను. జంబూద్వీపంలో చతుర్భుజుడను. కుశద్వీపంలో కుశేశయుడను. ఓ మునిశ్రేష్ఠా! ప్లక్ష ద్వీపంలో గరుడవాహనుడుగా ఖ్యాతి వహించాను. నన్నుక్రౌంచ ద్వీపంలో పద్మనాభుడనీ, శాల్మలంలో వృషభ ద్వజుడనీ, శాక దీపాన సహస్రాంశుడనీ, పుష్కర ద్వీపాన ధర్మరాట్ అనీ పిలుస్తారు. అలాగే ఓ బ్రహ్మర్షీ! ఈ పృథ్వి మీద శాల గ్రామాలలో నా ఉనికి. జల స్థలాలలో గల స్థావర జంగమ జీవులన్నింటిలో నేను నివసిస్తాను. సనాతనాలు, పురాతనాలు, పవిత్రాలునైన యివన్నియునేనుండు స్థానాలు. ఇవి ధర్మప్రదాలు. తేజో మయాలు. పాపనాశకాలు. సదా కీర్తింప దగినవి. ఈ దేవతల దర్మన స్పర్శన కీర్తన స్మరణాదులాచరించిన చో దేవ మానవ సాధ్యులు నాలుగు విధాల పురుషార్థాలూ సాధిస్తారు. ఇది నిశ్చయము. బ్రాహ్మణా! లెమ్మునా తపోమయాలయిన విభూతి స్థానాలు తెలుసుకున్నావు. ఇక మనమా దేవతలకు కల్యాణం చేకూర్చుటకు అసురేశ్వరుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్దాము పద. ఇలా భగవానుడు వామనుడు చెప్పి ఆ భరద్వాజ ఋషి తో ఆ పర్వతా న్నుంచి లీలా విలాసాలు వెలార్చుతూ కురు జాంగలానికి వెళ్లాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹