నారదు డిలా ప్రశ్నించాడు:-
ఇదంతా విపులంగా చెప్పండి. అంతట పులస్త్య బ్రహ్మయిలా ప్రారంభించాడు – నారదా! అంతర్దాన మైన వెంటనే వామనుడు తన మరుగుజ్జు రూపం వదలి పెట్టి నిజ రూపంతో గరుడారూఢుడై దేవతల కావాసమైన బ్రహ్మ సదనానకి వెళ్లాడు. అవ్యయుడగు నా బ్రహ్మవాసుదేవాగమనం చూచి లేచి ప్రేమతో ఎదురేగి ఆలింగనం చేసికొని లోనికి గొని వచ్చి విధ్యుక్తంగా పూజించి బహుకాలం తర్వాత వచ్చిన కారణ మేమని అడిగాడు. అందుల కాజగత్పతి దేవతలకు వారల క్రతు భాగాలనిప్పించుటకై బలిని బంధించి మహత్కార్యం గావించా నని చెప్పగా. నా కమలాసనుడు సంతోషించి బలి బంధనమెలా గావించారో ఆ వివరాలు నాకు చూపి అనుగ్రహించండని ఆర్థించాడు. అంతట నా గరుడధ్వజుడు సర్వ దేవతా మయమైన ఆ విశ్వరూపాన్ని లఘు ప్రమాణంలో (చిన్నదిగా) బ్రహ్మకు చూపించాడు. పదివేల యోజనాల పొడవు, వెడల్పు, ఎత్తుతో వ్యాపించి నిలచిన ఆ పుండరీ కాక్షుని చూచి విధాత భక్తి నమ్రుడై ప్రణమిల్లాడు. చాల సేపు అలా సాగిల పడి ఆహా ఆహాహా !!! అంటూ లేచి ఆ పద్మజుడు చేతులు జోడించు కుని ఆ మహాదేవుని యిలా స్తోత్రం చేశాడు.
బ్రహ్మ కృత విశ్వరూప స్తోత్రమ్
ఓం నమస్తే దేవాధి దేవా! వాసుదేవ!! ఏకశృంగ! బహురూప! వృషాకపే! భూతభావన! సురాసురవృష! సురాసురమథన!
పీతవాసః ! శ్రీనివాస! అసురనిర్మితాంత! అమిత! నిర్మిత! కపిల! మహాకపిల! విష్ణ్యుక్సేన! నారాయణ!
ధ్రువధ్వజ ! సత్య! ధ్వజ! ఖడ్గధ్వజ! తాలధ్వజ! వైకుంఠ! పురుషోత్తమా! వరేణ్య! విష్ణో! అపరాజిత! జయ! జయంత! విజయ! కృతావర్త! మహదేవ! అనాదే! అనంత! ఆద్యంత మధ్య నిధన! పురంజయ! దనం జయ! శుచిశ్రవ! పృశ్నిగర్భ!
కమలగర్భ! కమలాయతాక్ష! శ్రీపతే! విష్ణుమూల! మూలాధివాస! ధర్మాధివాస! ధర్మవాస! ధర్మాధ్యక్ష! ప్రజాద్యక్ష!
గదాధర! శ్రీధర! శ్రుతిధర! వనమాలాధర! లక్ష్మీధర! ధరణీ ధర! పద్మనాభ!
విరించే! ఆర్ట్పి షేణ! మహాసేన! సేనాద్యక్ష! పురుష్టుత! బహుకల్ప! మహాకల్ప ! కల్పనా ముఖ! అనిరుద్ద! సర్వగ! సర్వాత్మణ్!
ద్వాదశా త్మక! సూర్యాత్మక! సోమా త్మక! కాలాత్మక! వోమ్యా త్మక భూతాత్మక!
రసాత్మక! పరమాత్మన్! సనాతన! మంజుకేశ! హరికేశ! గుడాకేశ! కేశవ! నీల! సూక్ష్మ స్థూల! పీత! రక్త! శ్వేత! శ్వేతాధివాస!
రక్తాం బర! ప్రియ! ప్రీతికర!ప్రీతివాస! హంస! నీలవాస! సీరధ్వజ! సర్వలోకాధివాస!
కుశేశయ! అధోక్షజ! గోవింద! జనార్దన! మధుసూదన! వామన! నమస్తే! సహస్రశీర్షోసి! సహస్రదృగసి! సహస్రపాదోసిత్వం!
కమలోసి! మహా పురుషోసి!
సహస్ర బాహు రసి సహస్ర
మూర్తి రసి త్వాం దేవాః ప్రాహుః
సహస్ర వదనం తే నమస్తే !
ఓం (ప్రణవశబ్దస్వరూపివగునో) దేవాధి దేవా! వాసుదేవా! ఏకశృంగ! బహురూపా! వృషాకపీ! సర్వస్రష్టా! సురాసుర శ్రేష్ఠా! సురాసుర నాశక! పీతాంబర ధరా శ్రీనివాసా! రాక్షసనిర్మాణ నాశకా! అమితనిర్మాణకర్తా! కపిలా! మహా కపిలా! విష్వక్సేనా! నారాయణా! ధ్రువధ్వజా! సత్యధ్వజా! ఖడ్గధ్వజా! తాళధ్వజా! వైకుంఠా! పురుషోత్తమా! వరేణ్యా! విష్ణూ! అపరాజితా! జయా! జయంతా! విజయా! కృతావర్తా! (పాలభాగాన రెండు సొట్టలు గలవాడు) మహాదేవా! ఆదిలేని వాడా! అంతరహితా! ఆదిమధ్యాంతరహితా! పురంజయా! ధనుంజయా! పవిత్రశ్రవణా! పృశ్నిగర్భా (పృశ్నికడుపునపుట్టిన వాడా) కమలగర్భా! కమలాయతనేత్రా! శ్రీపతి! విష్ణుమూలా! మూలాధివాసా! ధర్మాధివాసా! ధర్మవాసా! ధర్మాధ్యక్షా! గదాపాణ! లక్ష్మీధరా! వేదధరా! వనమాలా ధరా! ధరణీధరా! పద్మనాభా! విరించీ! ఆర్షిషేణా! మహాసేనా! సేనాధ్యక్షా! బహుస్తుతా! బహుకల్పా! మహాకల్పా (బాగా అలంకృతుడైన వాడా) కల్పనాముఖా! అనిరుద్దా! సర్వగ! సర్వాత్మా! ద్వాదశ! సూర్యాత్మకా! చంద్రరూపా! కాలరూపా! వ్యోమాత్మకా! జీవరూపా! రసాత్మకా! పరమాత్మా! సనాతనా! ముంజకేశా! హరికేశా! గుడాకేశా (నిద్రను జయించినవాడా) కేశవా (కేశములు గలవాడా) నీలా! సూక్ష్మా! స్థూలా! పీతా (పసుపు రంగు) రక్తా! శ్వేతద్వీపాధివాసా! రక్తాంబరప్రియా! ప్రీతికరా! ప్రీతివాసా! (ప్రీతియే నివాసమైనవాడా)! హంసా! నీలవాసా! (నీలవస్త్రధరా)! సీరధ్వజా (నాగలి పతాకగా కలవాడా) హంసా! నీలవాసా (నీలవస్త్రధరా)! సీరధ్వజా (నాగలి పతాకగా కలవాడా)! సర్వలోకాధివాసా! కుశేశయా! అధోక్షజా (దిగువ అంగాన్నుంచి పుట్టిన వాడా) గోవిందా (యింద్రియాలకు ఆనందం యిచ్చువడా) జనార్దనా! జనుల నుమర్దించువాడా! మధుసూదనా! వామనా నీకు నమస్సులు! నీవు వేయి తలలు గలవాడవు. వేయి కన్నుల స్వామివి. వేయి పాదాలు గల ప్రభువవు. తామర పుష్పానివి. మహా పురుషుడవు. వేయి చేతుల దేవుడవు. వేయి రూపాల స్వామివి! నిన్ను దేవతలు సహస్ర వదనుడ వని కీర్తిస్తారు. అట్టి నీకు ప్రణామాలు.
ఓం రూపా! నీకు నమస్కారము. విశ్వదేవేశా! విశ్వస్రష్టా! విశ్వాత్మకా! విశ్వరూపా! విశ్వసంభవా! నీనుంచియే ఈ విశ్వం ఆవిర్భవించింది. బ్రాహ్మణులు నీ ముఖాన్నుంచి పుట్టారు. బాహువుల నుచి క్షత్రియులు, ఉరువుల నుండి వైశ్యులు, చరణాల నుండి శూద్రులు ఉద్భవించారు. నీ నాభి నుండి అంతరిక్షం, నోటి నుండి యింద్రాగ్నులు, కన్నుల నుండి సూర్యుడు, మనస్సు నుంచి చంద్రుడు జన్మించారు. నీ ప్రసాదం వల్లనేను కలిగాను. నీకోపం నుంచి త్రినేత్రుడు, ప్రాణాల నుండి మాతరిశ్వుడు, శిరస్సు నుండి దివి పుట్టినవి. చెవుల నుండి దిక్కులు, చరణాల నుండి ఈ భూమి కలిగాయి. ఓ స్వయంభూ! చెవుల నుండి దిశలు, తేజస్సు నుండి నక్షత్ర గణం జనించాయి. సాకార నిరాకార వస్తు జాల మంతా నీ వల్ల ఉద్భవించినదే. కనుక నీవు విశ్వాత్మకుడవు. ఓం స్వరూపా! నీకు నమస్కారము. పుష్షాల హాసం నీవే. వికటాట్ట హసం నీవు. పరముడవు. ఓంకార రూపివి నీవు. వషట్కారం, స్వాహాకారం వౌషట్కారం, స్వధాకారం, నీవే. వేద మయుడవు నీవు. తీర్ద మయుడవు (యజ్ఞం చేయు). యజమానుడవు. నీవు యజ్ఞం. నీవే సర్వం నడపునది. నీవే మఖ భోజివి. శుక్రం నీవల్లనే కలుగును. భూమి, భువము, స్వర్గము, స్వర్ణము, గోవులు, అమృతము అన్నీయిచ్చునది నీవే. ప్రణవస్వరూపా! బ్రహ్మకు మూల కారణం నీవు. బ్రహ్మమయుడవు నీవు. నీవు యజ్ఞానివి. వేద కాముడవు. వేద్యుడవు. యజ్ఞ ధారకుడవు. మహా మత్స్య మూర్తివి. మహాసేనుడవు. మహా శిరుడవు. నరకేసరివి. హోతవు. హోమానికి లక్ష్యానివి హవ్యానివి. హూయమానుడవు. అశ్వమేధయజ్ఞానివి. పోత (పురోహితుడు)వు. పవిత్రం చేయువాడవు. పవిత్రుడవు. పూజ్యుడవు. దాతవు. చంపబడు వాడవు. హరింపబడువాడవు. హరించువాడవు నీవే. ప్రణవరూపా! నీవు నీతివి. నేతవు. ప్రధముడవు(అగ్ర్య) విశ్వ ధాముడవు. శుభాండుడవు. ధ్రువుడవు. అరణి వల్ల జనించిన (అగ్ని) వాడవు.
ఓ మహాత్మా ! నీవు ధ్యాన స్వరూపివి, ద్యేయుడవు, తెలిసికో దగిన వాడవు, తెలివిని యజ్ఞం చేయువాడవు, దానానివి, భూమావాచ్యుడవు (సుమృద్దివి), చూడ దగిన వాడవు, బ్రహ్మవు, హోతవు, ఉద్గాత (యజ్ఞంలో సామగానం చేయు వాడు) వు, కదలే వారిలోని కదలికవు, జ్ఞానులలోని జ్ఞానానివి, యోగి జనులలో యోగానివి, మోక్షగాములకు లభించే మోక్షానివి, శ్రీమంతులలోని సంపదవు, గ్రహింప బడు వాడవు, రక్షకుడవు, పరముడవు, నీకు నమస్సులు. దేవా! సోమ సూర్యులు నీవు. (యజ్ఞ) దీక్ష దక్షిణలు నీవు. నీవు నరుడవు, త్రినేత్రుడవు, మహానేత్రుడవు, ఆదిత్యులను స్వజించు వాడవు, దేవోత్తముడవు, పవిత్రుడవు, శుక్రుడవు, శ్రావణ భాద్రపద మాసములు నీవు. ఆశ్వయుజము, పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఛైత్రం, వైశాఖ, మాసముల, రూపాన విరాజిల్లే కాలానివి. సంక్రమణానివి. విక్రమం, పరాక్రమానివి. అశ్వగ్రీవుడవు, మహామేధం (యజ్ఞం) నీవే. నీవు మంగళ కరుడవు. హరీశ్వరుడవు, శంభుడవు, బ్రహ్మేశ్వరుడవు, సూర్యుడవు (మిత్రావరుణుడు), వసిస్ఠుడవు, ముందటి వంశ రూపివి, సకల భూత గణానికి ఆదివి, మహా భూతానివి, మహాత్కార్యాలు చేయు వాడవు. కర్తవు, సర్వ పాప విమోచకుడవగు త్రివిక్రమ దేవుడవు, ప్రణవరూపా నీకు నమస్సులు !!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹