Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – ఇరువది యైదవ అధ్యాయము

సర్వతీర్థ మాహాత్మ్యము

సూతుడిట్లనియె:- ఎవని చేతులు పాదములు మనస్సు స్వాధీనములు చేయబడునో, జ్ఞానము తపస్సు కీర్తియునెవ్వనికి గల్గునో ఆతడు సర్వతీర్థముల సేవించిన ఫలమందును. ఎవని మనస్సు మాట, ఇంద్రియములు పరిశుద్ధములో అవి వాని శరీర మందున్న తీర్థములే, అవి స్వర్గమార్గమును జూపగలవు. అంతఃకరణము దుష్టమైనయెడల తీర్థములందెన్నింట మునిగినను ఆశుచియైన కల్లుకుండ నూరుమారులు నీటగడగినను శుచిగానట్లు పరిశుద్ధము గానేరదు. తీర్థములు దానములు వ్రతములు ఆశ్రమములు దుస్స్వభావుని దాంభికుని విశృంఖల నంచారములయిన యింద్రియములు గలవానిని పవిత్రుని జేయలేవు. ఇంద్రియముల నొదిగించికొని మనుజుడు ఎందెందున్నను అదియది వానికి కురుక్షేత్రము ప్రయాగ పుష్కరమును. కావున భూమింగల తీర్థ క్షేత్రములను గురించి క్లుప్తముగ దెల్పెదను వినుడు.

బ్రాహ్మణులారా !

మొదటిది పుష్కరతీర్థము. నైమిశారణ్యము ప్రయాగ ధర్మారణ్యము ధేనుకము చంపకారణ్యము సైంధవారణ్యము పవిత్రమైన మగధారణ్యము దండకారణ్యము గయ ప్రభాసతీర్థము శ్రీతీర్ధము దివ్యమైన కనఖలము భృగుతుంగము హిరణ్యాక్షము భీమారణ్యము కుశస్థలి లోహాకులము కేదారము మందరారణ్యము మహాబలము కోటితీర్థము సర్వపాపహర తీర్థము రూపతీర్థము శూకరవతీర్థము మహాఫలదాయక చక్రతీర్థము యోగతీర్ధము సోమతీర్థము సాహోటకతీర్థము కోకాముఖతీర్ధము పవిత్రమైన బదరీపర్వతము సోమతీర్థము తుంగకూటము స్కందాశ్రమము కోటితీర్ధము అగ్ని పదతీర్థము పందశిఖము ధర్మోద్భవము కోటితీర్థము బాధ ప్రమోచనతీర్ధము గంగాద్వారము పంచకూటము మధ్యకేసరము చక్రప్రభ మతంగతీరము కుశదండతీర్థము దంష్ట్రాకుండము విష్ణుతీర్ధము సార్వకామికతీర్ధము మత్స్యతిలతీర్ధము బదరీసుప్రభ బ్రహ్మకుండము వహ్నికుండము సత్యపద తీర్ధము చతుస్స్రోతస్తీర్ధము చతుశ్శృంగము ద్వాదశధారకశైలము మానసము స్థూలశృంగము స్థూలదండము ఊర్వశీతీర్ధము లోకపాలము మనువరము సోమశైలము సదాప్రభమేరుకుండము సోమాభిషేచనతీర్ధము మహాస్రోత స్తీర్ధము కోటరకము పంచధార త్రిధారక సప్తధార ఏకధార అమరకంటక తీర్థము శాలగ్రామతీర్ధము చక్రతీర్ధము కోటిద్రుమతీర్ధము బిల్వప్రభము దేవహ్రదము విష్ణుహ్రదము శంఖప్రభ పున్నాగతీర్ధము దేపప్రభ విద్యాధరము గాంధర్వముళ్రీతీర్ధము బ్రహ్మహ్రదము సాతీర్ధము లోకపాలతీర్ధము మణిపూరగిరి పంచహ్రదము పుణ్యమైన పిండారకతీర్ధము మాలవ్యతీర్థము గోప్రభావగోవరతీర్థము వటమూలకతీర్ధము స్నానదండము ప్రయాగ గుహ్య విష్ణుపద కన్యాశ్రమ వాయుకుండ జంబూమార్గ గభస్తితీర్ధ యయాతిపతన కోటితీర్థ భద్రపట తీర్థప్రజ అర్బుద మహాకాలవన నర్మదాతీర్థ పింగుతీర్థ వాశిష్ఠ వృధుసంగమ దౌర్వాసిక పిఞ్జరక ఋషితీర్థ బ్రహ్మ తుంగ వనుతీర్ధ కుమారిక శత్రుతీర్ధ పఞ్చనద రేణుకాతీర్ధ పైతామహవిమలరుద్ర పాదమణిమ త్తకామతీర్ధ కృష్ణతీర్ధకుశావిల యజన యాజన బ్రహ్మవాలుక పుష్పన్యాన పుండరీక మణిపూర దీర్ఘసత్ర హయపద అనశన గంగోద్భేద శివోద్భేద నర్మదోద్భేద వస్త్రాపద దారుబల ఛాయారోహణ సిద్ధేశ్వర మిత్రబల కాలికాశ్రమ వటాపట భద్రవట కౌశాంబి దివాకర సారస్వత ద్వీవ విజయ కామద రుద్రకోట సుమనస నద్రావనామిత స్యమంతపంచక బ్రహ్మతీర్థ సుదర్శన సతత పృధివీసర్వ పారిప్లవ పృధూదక దశాశ్వమేధిక సర్పిజ విషయాంతిక కోటితీర్థ – పంచనద – వారాహ – యక్షిణీహ్రదతీర్ధ వుండరీక సోమతీర్థముఞ్ఞవాట బదరీవన ఆసీన రత్నమూలక లోకద్వార పఞ్చతీర్థ కపిలాతీర్థ సూర్య శంఖినీ గోభవన యక్షరాజ బ్రహ్మావర్త సుతీర్థ కామేశ్వర మాతృతీర్థళీతవన స్నానలోమాపహ మాననంసరక దశాశ్వమేధ కేదార బ్రహ్మోదుంబర నప్తర్షికుండ దేవీతీర్థ సుజమ్బుక ఈహాస్పద కోటికూట కిందాన కింజప కారండవ అవేద్యన త్రివిష్టప పాణిఖాత మిశ్రక మధూవట మనోజవ కేశికీ దేవలోక ఋణమోచన దివ్య నృగధూమ విష్ణువద అమరహ్రద కోటితీర శ్రీకుంజ శాలితీర్థనైమిశేయ బ్రహ్మస్థాన సోమకన్యాలోక బ్రహ్మతీర్థ మనస్తీర్థ కారుపావన సౌగంధికవనమణి సరస్వతి ఈశాన వ్రవర పావన పాఞ్చయజ్ఞిక త్రిశూలధర మాహేంద్ర దేవస్థాన కృతాలయ శాకంభరి దేవతీర్ధ సువర్ణాక్ష కలిహ్రద క్షీరస్రవ విరూపాక్ష భృగు కుశోద్భవ బ్రహ్మతీర్థ బ్రహ్మయోని నీలపర్వత కుబ్జాంబ భద్రవట వశిష్ఠపద స్వర్గద్వార ప్రజాద్వార కాళికాశ్రమ రుద్రావర్త సుగంధాశ్వ కపిలావన భద్రకర్ణహ్రద శంకుకర్ణహ్రద సప్తసారస్వత ఔశనన కపాలమోచనఅవకీర్ణ కామ్యక చతుస్సాముద్రిక శతిక సహస్రికరేణుక పంచవటక విమోచన ఔజసస్థాణు కురుతీర్ధ స్వర్గద్వార కుశధ్వజ విశ్వేశ్వర మాణవక కూప నారాయణాశ్రను గంగాహ్రదవట బదరీపాటన ఇంద్రమార్గ ఏక రాత్ర క్షీరకావాస సోమ దధీచ శ్రుత కోటితీర్ధన్థలీ భద్రకాళీ అరుంధతీ వనబ్రహ్మావ ర్త అశ్వవేదికుబ్జావన యమునా ప్రభవ వీరప్రమోక్ష సింధూత్థ ఋషి కుల్యా సకృత్తిక ఉర్వీసంక్రమణ మాయావిద్యోద్భవ మహాశ్రమ వైతసికారూప సుందరికాశ్రమ బాహుతీర్థ చారుసదీ విమలాశోక పంచనద మార్కండేయ సోమ సితోద మత్స్యోదరి సూర్యప్రభ సూర్యతీర్ధ అశోకవన అరుణాస్పద కామద సవాలుక శుక్ర పిశాచమోచన సుభద్రాహ్రద విమల దండకుండ చండీశ్వర జ్యేష్ఠస్థానహ్రద బ్రహ్మసర జై గీషవ్యగుహా హరికేశవన అజాముఖనర ఘంటాకర్ణహ్రద పుండరీకహ్రద కర్కోటకవాపీ సుపర్ణోదపాన శ్వేతతీర్ధహ్రద ఘర్ఘరికాకుండ శ్యామాకూప చంద్రికా శ్మశానస్తంభకూప వినాయకహ్రద, సింధూద్బవమాప బ్రహ్మనర రుద్రావాన నాగతీర్థ పులోమక భక్తహ్రద క్షీరసర ప్రేతాధార కుమారక బ్రహ్మావర్త కుశావర్త దధికర్ణోధపాసశృంగమహాతీర్ధ మహానదీ బ్రహ్మసరగయాశీర్ష అక్షయవట దక్షిణగోమయ ఉత్తరగోమయ రూపశీతిక కపిలాహ్రద గృధ్రవట సావిత్రీహ్రద ప్రభాసన సీతవన యోనిద్వారధేనుక ధన్యక కోకిలా మతజ్గహ్రద పితృకూప రుద్రతీర్థ శక్రతీర్థ సుమాలిబ్రహ్మస్థానస ప్తకుండమణిరత్నహ్రదకౌశిక్యభరత జ్యేష్ఠాలికా విశ్వేశ్వర కల్పనర కన్యానంవేద్య నిశ్చీవాప్రభవ వశిష్ఠాశ్రమ దేపకూటకూప వసిష్టాశ్రమ వీరాశ్రమ బ్రహ్మసర బ్రహ్మవీర అవకాపిలి కుమారధార శ్రీధారా గౌరీశిఖర శునఃకుండ నందితీర్థ కుమారవాసశ్రీవాసజౌర్వసీతీర్థకుంభకర్ణ హ్రదతీర్థ కౌశికిహ్రద ధర్మకామతీర్థ ఉద్ధాలక సంధ్యా కారతోయ కపిల లోహితార్ణవ శోణోద్భవ వంశగుల్మ ఋషభ కలతీర్థ పుణ్యావతీహ్రద బదరీకాశ్రమ రామతీర్థ పితృవస విరజా మార్కండేయవన కృష్ణతీర్థ వటతీర్థ రోహిణీ వ్రవర తీర్థ ఇంద్రద్యుమ్న నరతీర్థ సానుగర్త మహేంద్రతీర్థ శ్రీనద ఇషుతీర్థ వార్షభ కావేరీహ్రద కన్యా గోకర్ణ గాయత్రీస్థాన బదరీహ్రద మధ్యస్థాన వికర్ణక జాతీహ్రద దేవకూప కుశప్రవణ సర్వదేవవ్రత కన్యాశ్రమహ్రద వాలఖిల్యమహర్షి అఖండిత హ్రదనామక తీర్థము లివి.

వీనిని శ్రద్ధతో సేవించి స్నానాది విధులు చేసి ఉపవసించి జితేంద్రియుడై దేవర్షి పితృతర్పణములు గావించి దేవతార్చనముచేసి మూడు రాత్రులిందుపవసిఆంచినవారికి వేరువేరు ఫలములనంతములు కల్గును, దాన నశ్వమేధ యాగ ఫలము గల్గును. నంశయము లేదు. ఈ తీర్థ మహాత్మ్యము నిత్యము విన్నను పఠించినను సర్వపాప విముక్తి గల్గును.

ఇది బ్మహ్మపురాణమునందు సర్వతీర్థమాహాత్మ్యవర్ణనమను ఇరువది యైదవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment