Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – ఇరవై ఏడవ భాగము

భారత వర్ష వర్ణనము

బ్రహ్మయిట్లనియె:- భుక్తి ముక్తి ప్రదమై వేదసమ్మితమైన పురాణ మెరిగించెద. వినుండు. భారతవర్షము కర్మభూమి యనంబడు. కర్మఫలభూములు స్వర్గము నరకమును. బ్రాహ్మాణాదులీ భారత వర్షమందే స్వకీయ కర్మముల నాచరించి సిద్ధి పొందిరి. ఇందు సందియము లేదు. ధర్మాది పురుషార్థప్రదము ఈ భూమి. ఇంద్రాదులు ఇచట శుభకర్మము ఆచరించి ఇంద్రాది పదవులందిరి. ఈ వర్షమందలి బుధులు శాంతులు వీతరాగులు విమత్సరులు నైన మరికొందరు మోక్షము నందిరి. విమానయానమున స్వర్గమున నిర్భయముగనుండు సురలుకూడ నీవర్షమునందు శుభకర్మములను ఆచరించియే స్వర్గమున కేగినారు. సురాసురులు కూడ నీ భారతభూమియందు వసింప వేడుక పడుదురు. ఎన్నడా పుణ్యభారతము దర్శింతుమా అని ఉవ్విళ్లు ఊరుచుందురు.

నీచే చెప్పబడిన కర్మ భారతవర్షమున తప్ప ఇతర లోకమున ఫలప్రదము కాదు. కావున భారతభూమియే ఉత్తమము స్వర్గాదులు మధ్యమములనుచు ఆనలిచ్చితిరి. అట్లయిన ఆ పవిత్ర భూమి వృత్తాంతము సమగ్రముగా ఆనతిమ్మన పద్మజుండుట్లనియె.


భారతవర్షమున భాగములు తొమ్మిది. ఇంద్రద్వీపము – కశేరువు తామ్రపర్ణము -గభస్తిమంతము – నాగద్వీపము -సౌమ్యము -గాంధర్వము -వారుణము. అను తొమ్మిది భాగములు గలవు. ఈ భారతఖండము సముద్ర పరివృతము. ఇచటినదులు ఉపనదులు ఈ పురాణమునందు పందొమ్మిదవ అధ్యాయమున పేర్కొనబడినవి.

మహాత్ముడైన భార్గవుని పురము గోవర్థన మతిరమ్యము. ఇందుత్తర దేశములు వాహేక – వాటథాన – సుతీర – కాలతోయద ఆవరాన్త – శూద్ర వర్షాకాలమందు మాత్రమే ప్రవహించునని. ఎల్లప్పుడు ప్రవహించునవియునగు నదులు గలవు.మత్స్యములు మకుట కుల్యములు కుంతలములు కాశి కోశములు. ఆంధ్రకములు కలింగములు సమకములు వృకములు ననుదేశములు మధ్య ప్రదేశమందలిదేశములు. నహ్యపర్వతమునకు ఉత్తరము గోదావరి పుట్టి ప్రవహించిన ప్రదేశము. మొత్తము భూమండలమున కెల్ల నిది మనోహరమైనది. వాహ్లీక వాటధాన సుతీర కాలతోయద అపరాంత శూద్ర బాహ్లిక కేరళ గాంధార యవన సింధు సౌవీర మద్రక శతద్రుహ కళింగ పారద హారభూషిక మాఠర కనక కైకేయ దంభమాలిక అనునవి క్షత్రియ వైశ్య శూద్రజాతి నివాసములైనదేశములుకాంభోజ బర్బర లౌకిక వీర తుషార ప్రహ్లావ ఆధాయత నర ఆత్రేయ భరద్వాజ పుష్కలదశేరక లంపక శునశ్శోకకులిక జాంగల ఔషథి చలచంద్రములు కిరాతజాతులు గల దేశములు. తోమర హంస మార్గ కాశ్మీర కరుణ శూలిక కుహకమాగధములు అనునవి భారతోత్తరదిశనున్న దేశములు. ఇక తూర్పుదేశములం దెల్పెద తెలిసికొనుడు.

ఆంధ వామజ్కరాక బల్లక మఖాంతక అంగ-వంగ-మలద-మాలవ-ఋత్తిక-భద్రతుంగ- ప్రతిజయ – భార్యాంగ (దర్భాంగ) అపమర్దక ప్రాగ్జ్యోతిష – మద్ర – విదేహ – తామ్రలిప్తక మల్ల మగధకనందములు. దక్షిణావథ దేశములు. పూర్ణకేవల – గోలాంగూల –

ఋషిక-ముషిక- కుమార-రామఠ. శకమహారాష్ట్ర మూహిషక -కలింగ-ఆభీర-వైళిక్య-అటప్య-సరప-పులింద-మౌలేయు వైదర్భ దండక పౌలిద-మౌలిక- అళ్మక-భోజ వర్థన-కాలిక-కుంతల-దంభక నీలకాలకములు. ఇవి దాక్షిణాత్య దేశములు.

తా|| శూపరిక-కాలిధనలోక తాంకటములు-అపరాంతదేశములనంబరగును. మలజ-కర్కశ-మేలక-జోశక. ఉత్తమర్ణ దశార్ణ-భోజ-కిష్కింధ-తోషల-కోశల-త్రైపుర- వైదిశ-తుంబుర-చర-యవన-పవన-అభయ-రుండికేర-బర్బర-హోత్ర ఋతువులు. వింధ్యపర్వతప్రాంతములు. ఇక పర్వతాశ్రయములైన దేశములు. నీహార-తుషమార్గ కురు, తుంగణ స్వస కర్ణ ప్రావరణ ఊర్ణ దర్ఘ కుంతక చిత్రమార్గ-మాలవా కిరాత తోమరములు. ఇక్కడ చతుర్యుగధర్మము నడచును. ఈ భారత వర్షమునకు పూర్వదక్షిణములుగా ”మహోదధి” యను పేరు సముద్రమున్నది. ఉత్తరమున హిమవంతము వింటినారి యట్టున్నది. ఈ భారత వర్షము సర్వబీజము. సర్వజీవులు కర్మాచరణము చేసి తత్తత్ఫలభాజనులగుట కిదియే స్థానము. దేవతలు కూడ యిందు మానవ జన్మమెత్తి సుకృత మొనరించి తత్ఫల మవ్వలి లోకముల ననుభవింప గోరుదురు. ఇది తపఃఫలమిచ్చు భూమి. తీర్థ క్షేత్ర యాత్రా దాన దేవతారాధన స్వాభ్యాయాది సకల సత్కర్మఫలప్రద పుణ్యభూమి యిది. బ్రహ్మచర్యాద్యాశ్రమములు శాస్త్రములు ప్రతములు ఇష్టాపూర్తములు మఱియేకల్యాణాచరణమేని యిచట సఫలము కాక తప్పదు. ఈ భారతవర్ష ప్రశంస సర్వపాపహారము పుణ్యము ధన్యము జ్ఞాన వర్థనము. ఇది చదివిన విన్నవారు సర్వపాప విముక్తులై విష్ణులోకమందును.

ఇది శ్రీ బ్రహ్మపురాణమున భారతవర్షవర్ణనమును ఇరువదియేడవయధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment