Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మపురాణం 🌹🌹🌹 – ముప్పై ఆరవ భాగము

ఉమామహేశ్వరకల్యాణ వైభవము

బ్రహ్మ యిట్లనియె :-

విశాలమైన హిమవత్పర్వతము మీద విమానముల సమ్మర్ధ మధికమయ్యెను. పార్వతి స్వయంవర సన్నాహమునందు గిరిరాజు తన కుమార్తె అభిప్రాయము హరునిపై నుండుట నెఱింగియును, వంశాచారము పాలించుటకు స్వయంవర వార్తనెల్ల లోకములందును చాటింపు వేయించెను. దేవదానవసిద్ధ గంధర్వాదులందఱి సమక్షమున నా కూమారి బ్రహ్మవరకుగల దేవతలందు పరమేశ్వరుని వరించునేని అదినా పుణ్యము సంస్తవనీయము. నా అభ్యుదయములకది అనుకూలము. అని మదినెంచి తన నగరము రత్నతోరణాలంకృతము లొనర్చి స్వయముగా చేసెను.

పార్వతీ స్వయంవర వైభవము

హిమవంతుడు చాటించిన స్వయంవర వార్తవిని అఖిలభువనవాసులయిన యువకులరుదెంచిరి. నేనును అక్కడ గిరిరాజు ప్రార్థనచే నెల్ల యోగులు సిద్ధులు సేవింప దేవతలతో నేగి పద్మాసనమందుపవిష్టుడనై యుంటిని. దివ్యాంబరాంగరాగ హారాది భూషణములం దాల్చి సురరాజు వేయి కన్నులతో ఆ ఉత్సవముందిలకింప మదధారలం గురియు మహిత గజరాజ మైరావతమునెక్కి వచ్చెను. తేజః ప్రభావమువలన నెల్లదిశల వెలిగించుచు చలత్పతాకమగు (జెండా నెగురుచున్న) బంగారువిమానమెక్కి భాస్కరుం డరుదెంచెను. తేజమ్మున బలమ్మున శాసనమున నసదృశుడై మణిమయోజ్వల కుండలములు ధరించి యాదిత్యమండలంబునుండి భగుడును నమరమూర్తి సూర్యుడట్లగ్నియట్లు వెలుగు విమానమున నేతెంచెను. యముడును దండంబు గొని భయంకర మహిషవాహన మెక్కి జవంబున పెద్దపర్వత మట్లొడ్డునుంబొడవుంగల్గి మంగళమూర్తియై మణిమయ స్వర్ణభూషణ మంజుల వేషియై యచ్చటకు విచ్చేసెను. సర్వజగత్ప్రాణుడైన సమీరణుడు విమాన మెక్కి సురాసురులకు వెఱగుగూర్చు తేజంబున నరుదెంచెను. వహ్నియు దివ్య విమానమెక్కి వరవేషధారియై వచ్చి సురేంద్రుల నడుమ వెలుంగుండెను. సర్వధనాధ్యక్షుడగు కుబేరుడు కాంతిచే వేషముచే నెల్ల సురాసురుల నాప్యాయన మొందజేయుచు పుష్పకవిమానమెక్కి అరుదెంచెను. నవరత్న విచిత్ర విమానమెక్కి చామనచాయ మేనివాడు సువిచిత్రవేషుడు పరిమళ పుష్పమాలను ధరించి సుధాంశుడరుదెంచెను. పర్వతములవలెనున్న విష్ణువు గదం దాల్చి గరుడు నెక్కి యేగుదెంచెను. పరమసుందరులు దేవలోకభిషగ్వరులు అశ్వినీదేవత లిరువురు నొక్కటేవిమానమెక్కి ముచ్చటగొల్పు వేషములతో నటకు వచ్చిరి. అగ్నివర్ణమైన విమానమెక్కి జ్వలనార్కప్రభతో నాగపరివారముతో సహస్రఫణామణిమండలుడగు నాగేంద్రు డప్పు డేతెంచెను.

పెండ్లికుమారుల ట్లలంకరించుకొని బృందారక బృందమేతెంచెను. గంధర్వరాజు తన సంఘముతో నప్సరసలతో నింద్రాజ్ఞంగొని యమ్ముచ్చటం గనుగొన వచ్చెను. మఱి కిన్నరకింపురుషనాగగణంబులు వచ్చిరి. అందరిలో నమరేంద్రుడు శచీపతి చూడముచ్చటైనసొంపున వెలింగెను. సురాసురజనని శంభుపత్ని యని పురాణములందు గీర్తింపబడినది పరాప్రకృతిమున్ను దక్షకోపమునకు గురియై హిమవంతునింటికికార్యావసరముగొని వచ్చినది. దివ్యవిమాన మందు దేవకాంతలు వింజామరలు వీవ సర్వఋతువులందలి పువ్వులతో సంతరింపబడిన మాలంగొని సత్వరముగ నామె స్వయంవరమునకు బయలుదేరెను.

అట్లరుదెంచు గిరిరాజ కన్యంగని యామెను బరీక్షింపనెంచి శంభుడు పంచశిఖల ముచ్చట గొల్పు శిశువై యాదేవి యొడిలో నల్లన నిదురించెను. ఆదేవి చూచి ప్రీతినంది యారహస్యంబు గ్రహించి దానభిలషించినపతిగా నెఱింగి యాపాపనిం దన హృదయమందునిలిపి స్వయంవరమండపమునుండి వెనుదిరిగి వెళ్ళిపోయెను. ఎవడీ శిశువు? ఇచటి కెట్లు వచ్చినాడు! అని మిక్కిలి మోహపడి సురలు కేకలిడిరి. ఇంద్రుడు వజ్రంబూని నిలువబడి యాశిశువుచే నపుడ స్తంభితుండయ్యె. భగుడెత్తిన చేయి యెత్తినట్లయుండె. విష్ణువు శిరః కంపనమును జేయుచు శంకరుని వంక జూచెను. అపుడు నేను(బ్రహ్మా) కలతబడి ధ్యానమున నిలిచియాక్షణమ యాదేవి యొడిలోని బాలుడు బాలేందుధరుడని గ్రహించితిని. తెలిసినంతలేచి నిలువబడి యాదేవదేవు చరణములకు మ్రొక్కి పురాణములచే సామ సంగీతములచే గుహ్యములయిన పుణ్యనామావళిచే పెక్కురీతులం బొగిడితిని.

బ్రహ్మకృత శివస్తుతి

ఇట్లు పరమేశ్వరుని నుతించి స్తంభించిన దేవతలం గని మీరీ పాపని శంకరుడని యెఱుంగలేరైరి. పొండు! శరణమందుడు. నేను మీతో శరణాగతుండ నయ్యెద నన నాత్రిదశులు భావశుద్ధితో నా శర్వుని కానతులైరి. శీఘ్రప్రసన్నుడు కాన స్వామి. వారియెడ జాలివడి యందరిని మున్నట్లు స్వస్థులం జేసెను ఇది యైయిన వెనుక నీశ్వరుడు త్రిలోచనములతో కూడిన అద్భుతమైన శరీరము దాల్చెను. ఆ తేజమునకు వారు కనులు మిరుమిట్లుగొన జూడలేక కనులు మూసికొనిరి. ఆయన వారికి తన మూర్తి జూడ ననువైనచూపుననుగ్రహించెను వారుం దాన నాయీశ్వరుం జూచి యాయన నిటలాక్షుండని యెఱింగిరి. వారందరు కనుగొనుచుండ నప్పుడ యద్దేవి యాదేవదెవు పాదమ్ముల స్వయంవరమాల నలంకరించెను. ”బాగు బాగు” అని యెల్లవేల్పులు నుతించిరి. ఆ దేవితో గూడ తలలు వాల్చి నమస్కరించిరి. అపుడు నేను హిమవంతునితో నిట్లంటిని. ”పూజనీయుడవైవు వందనము సేయ దగుదువు. ఈశ్వరుని తోడి సంబంధమిది నీ భాగ్యమ్ము కానిమ్ము. కల్యాణ మహోత్సవమున కెందులకు విలంబము” అన హిమవంతుడు మ్రొక్కి నాకిట్లనియె.

దేవా! నా అభ్యుదయమునకెల్ల నీవె కారణము. అనుకొనని యనుగ్రహమిది. నా కొదవినది పితామహ! వివాహమెట్లు ఎపుడు సేయనగునో యదెల్ల నీవ నడుప వలయును. అన విని బ్రహ్మ యిట్లనియె.

హిమవంతుని మాటవిని శివునితో ”వివాహమగు గాక” అని నేననగా నాలోకేశుడగు శంకరుడ ట్లేయగుగాక! అనగా మేమందరము నందమైన కల్యాణపురము నిర్మించితిమి. నవరత్నములు మూర్తిని ధరించి కల్యాణ వేదికను స్వయముగ నలంకరించినవి. అందలికుడ్యములు స్ఫాటికములు భూమి మరకతమాణిక్యమయము. స్తంభములు స్వర్ణమయములు. ద్వారములందు ముక్తాహారములు తమంత వ్రేలినవి. అమ్మణుల జిగ జిగ మెఱయించుచు నమ్ముందు సోమసూర్యులు స్వప్రభల వెలయించిరి. శివభక్తిని ప్రకటించుచు వాయువు మనోహరపరిమళముల వెదజల్లుచు నందందు వాహ్యాళి వెడలెను. చతుస్సముద్రములు శక్రాది సురలు దేవ నదులు మహానదులు సిద్ధులు మునులు గంధర్వాప్సరో యక్ష రాక్షస నాగ కిన్నర చారణలు జల చరులు ఖేచరులు తుంబు నారదులు హా హా హూ హూ ప్రముఖ దేవగాయదులు రమ్య మంగళ వాద్యములుగొని యమ్మండపమునకు వచ్చిరి. ఋషులు వేద గీతములు మేళవించిరి. జగన్మాతలు దేవకన్యలు పాటలు పాడిరి. అప్సరసలాటలాడిరి. ఆఱుఋతువులు నానా సువాసనల సుఖావహములై మూర్తిమంతులై హిమవంతుని యింటికేతెంచి యీశ్వరు నుపచరించినవి. వర్షర్తునమాగమము మంత్ర ధ్వని గర్జములతో నీలజీమూతప్రభలతో కేకారవ మనోహర మయూర నృత్యములతో విలోలపింగళరుచివిలాసి విద్యుల్లతాదకచకద్యుతులతో కుముదకుసుమాపీడ శుక్లములగు బలాక మాలికలతో నపుడ పొడమిన శిలీంధ్ర కందళీ లతా ద్రుమ హృద్యతర పల్లవ మంజరులతో చల్లని వానధారల కలరి మేల్కొని సేయు కప్ప యరుపులతో, మానవతు ప్రియు యెడ పొలియలు వాసి తమంత ప్రియుల కౌగిలికిం దార్చు ముచ్చటలతో నునుమబ్బుల చాటున నల్లనల్లన తొంగి చూచు శశిరేఖ సొగసుతో మేఘము చాయ చాయగులుకు నింద్రచాపము చూపు సొంపుతో చిత్ర విచిత్ర సుమ పరిమళములచే భావితంబయి మధురవాసనల చింత చల్లని జలసంపర్కమునంది వీచు మనోహర మందమందానిలములచే నల్లనల్లనం గదలు సురాంగనల లలితాలక టనములతో గర్జించు మేఘములు గ్రమ్మిన యిందు బిం మ్ము డంబరముతో తొలకరివానచిను లు ముత్యాల మురు గొని పచ్చలు దాపిన్ల మెఱయు గరికదుబ్బులు నబ్బురము గొల్పు పచ్చని కాంతులతో హంసనూపురంబులతో సమున్నతపయోధరశాలినియై వర్షఋతు సుందరి సందరపు కల్యాణ మండపము నలంకరించెను. నీలమేఘ గర్జనలకు హంసలు బెదరినవి. స్వచ్ఛములైన సలిలధారలకు కలువలు వినమ్రములైనవి. పరిమళకుసుమ కింజల్క పరాగ పరిభూషితాంగియై వర్షఋతువు పార్వతీ వివాహమునకు తనను ముస్తాబు చేసికొనెను.

శరద్దృతువు

ఆ పైన శరద్దృతులక్ష్మి మేఘకంచుకము దొలగించుకొని పద్మకోశకుచశోభయై హంస నూపుర మనోహరయై దిశలు తెలివిగొన విస్తీర్ణములైన సైకతములు పిరుదులుగా మధురకూజితహంసమేఖలయై వికసించిన నల్లకలువలనెడి నయనములసొంపుతో పండిన దొండపండనెడి యధరశోభతో మొల్ల మొగ్గలనెడి దంతకాంతితో వినూత్న శ్యామలతికా వినీలరోమరాజితో చంద్రాంశుగౌరహారవితానముతో సర్వబృందారకబృందహృదయారవిందములనుల్లాస పరచుచు శరద్దృతు లక్ష్మి మనోహర మత్తభ్రమరకుల కలగీత స్వరభాషిణియై చలత్కుముద చారుకుండల మండితయై రక్తాశోక శాఖానిర్గత లలిత సుకుమార పల్లవాంగుళియై పలువన్నెలపూలచీర దాల్చి రక్తోత్పలాగ్రచరణయై జాతీ పుష్పసఖనవ్యనఖ రుచియై రంభాస్తంభరమణీయోరురుచియై చంద్రవదనయై సర్వాలంకారభూషితయై సర్వలక్షణ లక్షితయై నిర్ముక్తనీలమేఘ కంచు కాంచిత వ సనయై పూర్ణేందుబింబప్రతిబింబవదనయై సానురాగయగు నాయిక వోలె నీలాంభోజ లలిత నయనయై రవికరవిక చకమల సుస్తనియై నానాకుసుమ రజః పరిమళ పవన ప్రహ్లాదినియై కల హంస నూపుర రవభవ్యయై గిరిసుత కల్యాణమునకు శరద్దృతులక్ష్మి తన్ను సింగారించుకొని వచ్చెను.

హేమంత శిశిరములు

అవ్వల మిక్కిలి చలువల వెదజల్లు జలముల మించుచు మేమంత శశిర ఋతుదేవతలు ఆ వివాహమునకు వచ్చిరి. హిమవంతుడు ఆ ఋతు విలాసినులు ప్రాలేయ చూర్ణముల వర్షించుచుండ రజతహర్తపగిది రాణించెను.

అమ్మంచు సోనలచే ఘనీభావమునంది హిమవంతుడు చూపరులకు క్షీరసాగరమట్లు మవోహరుడాయెను. ఒకానొక దుర్జనుడు సాధుపరిచర్యఁజేసి కృతార్థుడైనట్లు ఆధరాధరసార్వభౌముడు హేమంతశిశిరపర్యాయశోభచే నింపుకొల్పెను. మంచు గవిసిన మహిత శృంగములచే శ్వేత ఛత్ర ఛాయలోనున్న చక్రవర్తియట్లు వెలుగొందెను.

వసంత సమాగమము

వసంతుడును గిరికన్య కల్యాణమునకు వచ్చెను. సురలకుసురాంగనలకు మదనోద్రేకకరములైన మందమంద మలయానిలములును స్వచ్ఛాఁబు పూరముల నించుచు సరస్సులును సరసిజోత్పలసంభారముల బూని విమల రసపూర్ణములై ముత్తైదువులపగిది ముస్తాబుచేసికొని పార్వతిపెండ్లిపేరంటమునకు వచ్చెను. ఇంచించుక స్ఫుటమగుచున్న పయోధరాగ్రములచే (మేఘములచే) దర్శనీయలగు కుమారికలట్లు మిక్కిలి శోభించెను. నాత్యుష్ణ శీతములైనవై, కుసుమ కింజల్క చూర్ణ కపిశీకృతములై చక్రవాకములజంటలకలకలాఠావములచే ప్రతిధ్వను లీనుచు సరస్సులు ముచ్చుట గొల్పెను.

ఐరావతాది దిగ్గజములు లలితగమనముతో ఆనందోత్కటములయి యద్రికన్యఉద్వాహమునకు నడచెను. ప్రియంగు వృక్షము లామ్రవృక్షములను అన్యోన్యము బెదరించు కొనుచున్నవా యన్నట్లు కుసుమమంజరులతో హృదయరంజకములయ్యెను. తెల్లని హిమశృంగములందు కుసుమితములైన తిలకవృక్షములు శుభకార్యమని యెంచి వచ్చిన వృధ్ధ జనమో యనునట్లు భాసించెను. పుల్లాశోకలతికలుసాలతరువుల గౌగిలించుకొని కాముకుల కంఠమను గౌగలించుకొను కామినీ జనమట్లు చూడ ముచ్చట గొలిపెను. ఆ వసంతవేళ కదంబనీప తాళతమాల సరళ కపిత్థ అశోక, సజ్జ అర్జున కోవిదార పున్నాగ నాగేశ్వర కర్ణికార లపంగ కాలాగురు సప్తపర్ణ న్యగ్రోధ శోభాంజన నారికేళ ప్రముఖ సకల వృక్ష కదంబము పూలతో పండ్లతో మనోహరకుసుమాంగరాగములతో హృదయంగమము లయ్యెను. చిత్ర విచిత్ర వర్ణములయిన రెక్కలచే టిట్టిభక కలవింక బలాకాది జల విహంగములతో పద్మోత్పల మీనములతో గూడిన సరస్సులనుండి సుశీతలసుగంధవాయువులు కొమ్మల రెమ్మలం గదలించి రాల్చిన పూవులతో నగకుమారివివాహ మండపప్రాంతభూములు పరస్పర సమ్మేళనమందిన ఋతువుల చిహ్నములతో శోభావహములై రాజిల్లెను.

అట సమద షట్పద కులగీతములు మంగళగీతములయ్యెను. తుమ్మెదలు ముసరిన కలువలచె నల్లనివై, – తెల్లని మృణాల లతలచే తెల్లనివై రక్తారవిందములచే రక్తములై సరోవరనీరములు నయనమనోహరములయ్యెను. కొన్నికొలనులు బంగారుతామరపూవులనలముకొని మిక్కిలి సొంపునింపుచుండెను. కొన్నియెడల వైడూర్య మణినాళమయములై కమలవనములవిలసిల్లెను. హేమసోపా పంక్తులతో నానావిహంగ కలకూజితములతో కమలోత్పల వనములతోగూడిన దిగుడు బావులు భావమధురములయి రాణించెను. కుసుమితకర్ణికారములతో నీహారాద్రి సమున్నత శృంగములు హేమమయములట్లు రంజిల్లెను. ఇంచుకించుకగ విప్పారి అల్లనల్ల వీచుగాలులకు కదులుచు నెత్తావుల నించు పాటలకుసుమములచే దెసలు పాటలములయ్యెను. (ఎఱుపెక్కెను) నిండబూసిన కృష్ణతరువులు, అర్జునములు నీలాశోకములు నల్లనల్లన విరియు విరులతోడి యందమున స్పర్థగొని యెండొరుల మించి శోభిల్లినవి. గిరినితంబము లందెల్లెడ వీచుగాలులకూగుచు హోరుమని మ్రోతనించు కింశుకమువనములు అంతరాంతరముల నీలమేఘసంఘాతములు క్రమ్ముకొన్నవా యనిపించు తమాలతరుకుంజములచే నచ్చమైన హిమగిరి చూడముచ్చట యయ్యెను.

కొమ్మల రెమ్మలనిండ పూసి ఠాలిన పూవులతో చందనములతో చంపకములతో ప్రమత్త పుంస్కోకిలాలాపములతో గిరిరాజు ుక్కిలి రంజిల్లెను. కోకిలలకలకూజితము లాలించి నీలకంఠములు పురి­ప్పి కేకలిడుచు నాట్యము లారంభించిన­. వాని సడి­ని పుప్పబాణుండు పుష్టిగొని గీర్వాణాంగనల గురిచేసి ­రిబాణములు ­సరదొడగెను. ఎండ తీవ్రమై జలాశయములెండి తనువులకు సుఖమునిండ నత్తఱి గ్రిష్మర్తువు గిరికన్య పెండిలికి వచ్చి గిరిరాజు నుపచరించెను.

గ్రీష్మర్తు సమాగమ :

మఱియుతరువులనుండి ­రులరాల్చి ప్రాలేయ గిరిశృంగముల సింగారించెను. పాటల కుసుమ ­స్తీర్ణ కదంబార్జున సుమనోహర వాయువులు చల్లగచెను. దిగుడుబావులు ­కచకమల కేసరపుంజ రంజితములై యెఱుపెక్కదరుల కలహంస కదంబము లచ్చపు జిగి నెంతేని ముచ్చట గొలిపెను. పూలగోరింటలు పువ్వుల తెలినిగ్గుల నెఱనీటుగులుకు భ్రమరములకు వలపు గూర్చుచుండెను. హిమశైల­శాలనితంబములం బొగడలు నలువంకల తావులు జిమ్ము పూవులరాసులం గ్రుమ్మరించిన­. ఓముని ప్రవరులారా! ­ంటిరే ఇట్లారుఋతువులు గౌరీ­వాహ కౌతుకమునకు కుతూహలముగొని కుసుమ ­చిత్ర శృంగారతరులతా బృందముతో నందముగా నేతెంచిన­.

మంగళ వాద్యములుమ్రోయ నిట్లుసాగిన కల్యాణ వైభవమున బ్రాహ్మణ సముదాయములతో శైలపుత్రిని సకలాభరణభూషితంగా­ంచి వెంటగొని నేను స్వయముగా పురప్రవేశముం జేయించితిని. అవ్వల నీశ్వరునితో నేను బ్రహ్మస్థాస మందుండి నీ­వాహ ని­ుత్తముగ నగ్నియందాజ్యాది హ­స్సులను హోమము నిర్వహించెద నాజ్ఞయిమ్మని యడిగితిని.

అమ్మాట కానందబడి నేను కుశలంగొని యాద్దేవుని యొక్కయు దే­యొక్కయు హస్తములను యోగబంధమున జతసేసితిని. శ్రుతిగీతములయిన మహామంత్రములు మూర్తిమంతములయి సన్నిధిసేయ నగ్నియు హ­ర్భాగముల స్వయముగానందుకొన కృతాంజలి వుటుండయ్యె. యథా­ధిగ నమృతరూపమైన హ­స్సును హోమముచేసి సనాతనులయ్యు నూతనులయిన యా దంపతులు చేయి చేయియుంగొని నగ్నికి ప్రదక్షిణము నొనరించి యవ్వల వారి చేయి ­డిపింప సర్వదేవతలు నామానసపుత్రులు సిద్ధులు ప్రహృష్టాంతరంగులై నన్ననుగ­ుంప నందఱము వృషధ్వజున కాపెండ్లివేళ ప్రణామములు గా­ంచితి­ు. ఇట్లా సనాతన­ుధునమునకు యోగముచేతనే యీ వాహమహోత్సవము జరిగినది. ఈ యందము మున్నెన్నడు దేవతలేని గాంచి యెఱుంగరు. ఈ మహేశ్వర స్వయంవర కల్యాణ వృత్తాంతముుకెల్ల ­నిపించితిని.

ఇది సకల జగత్కల్యాణ కరము.

ఇది బ్రహ్మపురాణమందు ఉమామహేశ్వరకల్యాణ వర్ణనమను ముప్పది ఆఱవ యధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment