ఉమామహేశ్వర కల్యాణ బ్రహ్మాదికృత శివస్తుతిః
ఉమా మహేశుల వివాహమిట్లు జరుగగా ఇంద్రాదులగు అమరులెల్లరు ఆనందభరితులయి మహేశ్వరునికి ప్రణమిల్లి తొలిపలుకులను ఇట్లు వినుతింపదొడగిరి.
ఇట్లు జగత్పతి. భగవంతుడు అయిన ఉమాపతి ఎల్లసురులచే వినుతుడై ఓ నిర్జరులారా ! మీకు నేను జూడ సౌమ్యుడనైతిని. వేగము వరము కోరుడు బసంగెద. సందియము లేదనగా ”ఆవరము నీ చెంతనే యుండుగాక ! కర్మావసరమందు దానినిత్తువు గాక ! అని దేవతలనగా ఆయనయు వల్లెయని ప్రమథగణములతో స్వభవనమునకు ఏగెను. అద్భుతమైన ఈ శివకల్యాణ మహోత్సవము దేవభూదేవుల సమక్షమున గానము చేయునతడు గణశ భావమునంది సుఖించును.
ఈ శివ స్తుతిని చదివిన విన్నవాడు సర్వపుణ్య లోకములవసించి దేవేంద్రుడట్లు దేవతలచే బూజింప బడును.
ఇది బ్రహ్మమహాపురాణమున ఉమా మహేశ్వర కల్యాణమున బ్రహ్మదిఋత శివస్తుతియను ముప్పదియేడవ యధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹