Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నలబై ఎనిమిదవ భాగము

ప్రతిమా నిర్మాణ విధానపర్యాలోచనమ్‌

మునులిట్లనిరి.

దేవదేవా! ఆ ప్రతిమలు ఇంద్రద్యుమ్నునిచే నెట్లు నిర్మింపబడినవి, ఏ ప్రకారముగా మాధవుడు సంతుష్టుడయ్యె అదియెల్ల ఆనతిమ్ము వినవలెను. మా మనసులు ఉవ్విళ్ళూరుచున్నవి.

బ్రహ్మ ఇట్లనియె.

మునివరులారా! వినుండు. వేదతుల్యమైన పురాణమిది. యజ్ఞారంభము కాగా దేవ్రపాసాద నిర్మాణము జరుగగా నాతనికి విగ్రహ నిర్మాణమును గూర్చిన ఆలోచన రేయింబవళ్లు అతని మనసునం దిరవుకొనెను. సృష్టిస్థితి లయకర్తయైన ఆ సర్వేశ్వరుని నేనెఱుంగను. ఆస్వామిని నేనెట్లు కనుగొందునను ఊహతో రాత్రియును పవలును పండుకొనడు. ఆ ఆవేదనలో అతనికి అష్టైశ్వర్య సమృద్ధి మనస్తుష్టి నీయజాలదయ్యె రాళ్ళుమన్ను కట్టెలందేది విష్ణు ప్రతిమకు యోగ్యమగును?- ఎట్టి మూర్తిని ప్రతిష్టించిన విష్ణువు ప్రీతుడగునను ఆలోచనలో అతడు మునింగెను. అంతట ఆతడు పాంచరాత్ర విధానమున పురుషోత్తమ దేవుని పూజించి అదే ఆలోచనగొని స్వామిని స్తుతింప నారంభించెను.

ఇది ప్రతిమానిర్మాణ విధానపర్యాలోచనమను నలుబదియెనిమిదవ అధ్యాయము

భాగవతులకు ప్రశ్న :-

బ్రహ్మ పురాణం లో గత కొన్ని భాగాలుగా ఏ క్షేత్రం గురించి తెలియజేస్తున్నానో తెలియజేయ్యండి 😊

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment