విస్తరేణ విష్ణు మార్కండేయ సంవాద కథనము
భగవంతుడట్లు మార్కండేయునిచే వినుతింపబడి మధుర గంభీరముగ నిట్లనియె. నీ మనసునందు గల కోర్కెయేమి? తెలుపుము. అవి ఎల్ల ఇచ్చెదను అన ముని ఆ దేవుని ఎడ మనసు నిలిపి ఇట్లనియె.
స్వామి ! తామెవ్వరో నీ మాయయెట్టిదో నీ దయచే నెఱుంగ గోరెదను. నా జ్ఞాపకశక్తి పోలేదు. నీ ఉదరమందు ఏమేమి వింతలు గంటినో అవి నా మనసులో మెదలుచున్నవి. ఇచట చిన్ని శిశువువై ఆడుకొనుచున్నావు. ఈ జగత్తెల్ల నీ గర్భమందెందులకున్నది. ఎంతకాల మిటనుందువు. దేవేశ ! విస్తరముగ తెలుపుము. తెలియగోరెదను.
నేనుచూచినది ఊహకందునది గాదు. అన దేవదేవుండు ఓదార్చుచునిట్లనియె.
” వేల్పులు కూడా న్నుచ్చముగ తెలయలేరు. నీకు ప్రీతి కూర్చుటకు తెల్పెదను. నీవు పితృభక్తుడవు. నన్ను శరణందితివి. నీ బ్రహ్మచర్య దీక్ష చూచియున్నాను. ”నారములు” అనగా నీరు ‘ఆయనము’ అనగా స్థానముగా గలవాడను గాన నారాయణుడను. నేనె జగత్కారణము. నాకు నాశము లేదు. భూత విధాతను భూత సంహర్తను నేనే. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు- శివుడు- కుబేరుడు- యముడు – సోముడు – కశ్యప ప్రజాపతి – యజ్ఞము నేనె.
నాకగ్ని ముఖము. భూమి పాదము. సూర్య చంద్రులు నేత్రములు”
ఇట్లు వానికి వేయి యుగములు ముగియగనే స్వామి ”మఱియేమి కోరెదవన” నా పురాణ ముని ఇట్లనియె.
నీ దయచే లోక హితముగోరి భేదభావము నశించుటకు శివవైష్ణవవాద భేదము లంతరింప జేయుటకు ఇక్కడ శివాలయము నిర్మించెదను. అందు ఈ క్షేత్రమున శంకర ప్రతిష్ఠ జేసేదను. హరిహరు లొక్కటే అని లోక మెఱుంగు గాక.” అని జగన్నాధుడు భువనేశ్వర రూపమయిన లింగము జగత్కారణము. నా ఆనగొని వెంటనే ఇట ఈశ్వరుని ప్రతిష్ఠింపుము. మా యిర్వురకు అంతరములేదు. లోకమెఱుంగక వాదులాడును. నా ఆలయమిది నీ పేర నిర్మించుము. దాని కుత్తరముగ మార్కండేయ ‘హ్రదము’ అను పేర నొక తీర్థము కూడ నేర్పడును. అది సర్వపాపహరగును. అని సర్వవ్యాపియైన జనార్దనుడు పల్కి తిరోహితుడయ్యెను.
ఇతి శ్రీ బ్రహ్మపురాణ విస్తరేణ విష్ణుమార్కండేయ సంవాదకథనమను ఏబది ఆఱవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹