Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశపురాణం 🌹🌹🌹 – పదమూడవ అధ్యాయము

ఉపాసనాఖండము మొదటి భాగము

గజానన దర్శనం రెండవ భాగము

మహత్తరమైన విజ్ఞాలన్నింటిని మీరు దాటగలరు మీకు ఘనమైన కీర్తి కలిగేందుకు మీకు వేరువేరు బాధ్యతలను అప్పగిస్తాను అంటూ వారికి ఇలా వరాలను అనుగ్రహించి రజోగుణ సముద్భవుడైన బ్రహ్మకు సృష్టి బాధ్యతను సత్వగుణాశ్రయుడైన విష్ణువును పాలకుడుగాను తమోగుణంలో ఉత్పన్నుడైన రుద్రుడిని సర్వసంహారకుడిగాను నియమించాడు!

ఓ వ్యాసమునీంద్ర నాకు సకల లోకాలను సృష్టి చేయగల శక్తి సామర్థ్యాలను వేద శాస్త్ర పురాణాది సకల విద్యలను ఆధరంతో ఆ గణేశుడే నేర్పాడు. అలాగే విష్ణువుకు యోగం వలన స్వేచ్ఛ రూపములను దాల్చగలగడం రుద్రునికి ఏకాక్షర షడక్షర గణపతి మంత్రాలను సర్వాగమాలను సంహార శక్తిని ప్రసాదించాడు..

అప్పుడు నేను దీన మనస్కుడనై త్రిలోకాధిపతి జగత్తుకే గురుత్వం వహించినవాడు వరప్రదాతాయైన ఆ గజాననుని ఎదుటే దోసిలియోగి నాకు సృష్టి చేయగల శక్తితో పాటు సామర్థ్యాన్ని ఏ ఏ రూపాలను ఎక్కడెక్కడ ఎలా సృష్టించాలో నిర్ణయించుకోగల వివేకాన్ని విచక్షణను ప్రసాదించమని అర్థించాను..

అప్పుడు వ్యాకుల చిత్తంతో మదన పడుతున్న నాకు దివ్యదృష్టిని అనుగ్రహించి గజాననుడు నన్ను తన ఉచ్ఛ్వాస ద్వారా ఉదరం లోకి లాక్కున్నాడు అక్కడ సీతాఫలంలోని గింజల లాగా ఉన్న అనేక కోట్ల బ్రహ్మాండ గోలాలను దర్శించాను ఒక గోళాన్ని బేధించగా అందులోనూ త్రిమూర్తి త్రయం బ్రహ్మా విష్ణు మహేశ్వరులు విడిగా కనిపించారు..

అలాగే సూర్యచంద్రాదులు పంచభూతాలు సముద్రాలు కిన్నెర కింపురుష గణాలు ఋషులు పుణ్యజనులు చతుర్విధ జీవరాసులు పృద్వి మొదలుగా గల ఏడుపాతాలాలను ఇలా మరో బ్రహ్మాండాన్ని కళ్ళు తిరిగేలా చూశాను..

వాటి ఆది అంతము తెలుసుకోవడం నాకు వీలు కాలేదు దిక్కు తెలియని స్థితిలో వరదుడైన గజాననున్ని దారి చూపమని ప్రార్థించాను. ఓ దేవా నీ కుక్షిలో బ్రహ్మాండ కోట్లు ఎన్నింటినో కనుగొన్నాను ఆకాశంలోని నక్షత్రాలను సముద్రంలోని గల చేపలను ఇసుకలోని రేణువులను లెక్కించడం ఎలాగైతే ఎవరి తరము కాదో అలానే వీటి ఆధి అంతాలను కనుగొనటం అన్నది నా శక్తికి మించిన పని!

ఇక్కడ ఉండటానికి గాని బయటకు రావటానికి గాని నాకు ఇక శక్తిం కావడం లేదు కనుక దిక్కుతోచని స్థితిలో నీ దివ్య చరణారవిందాలపై శరణాగతుడనై శిరము నాంచుతున్నాను. నాపై దయ తలచు అంటూ ప్రార్ధించిన నా ప్రార్థన విని దయతో నన్ను తన ముక్కు యొక్క రంద్రములోంచి బయటికి విసిరి వేశాడు..

అలాగే శివవిష్ణువులను కూడా తన కర్ణ రంద్రముల గుండా బయటకు విసిరి వేశాడు. ఆ హరిహరులిద్దరూ బయటికి విలువడి అలా సుఖంగా గణేషుడి శరీరం పైనే నిద్రించినారు అంటూ బ్రహ్మ వ్యాసమునీంద్రుడికి గణేశుని దివ్యవిజృంభనను వివరించాడు…

ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసన ఖండములోని బ్రహ్మ స్తుతి వర్ణనం అనే 13వ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment