Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – అరవై ఒకటవ భాగము

పూజావిధి కథనము

బ్రహ్మ ఇట్లనియె.

అచమనము కావించి మౌనము బట్టి జీవర్షి పితృతర్పణములను గావించి శ్రీమన్నారాయణ పూజ ఇట్లు చేయవలెను. మూరెడు చతురము గల మండలము లిఖింపవలెను. అందు నాలుగు కోణములు నాలుగు ద్వారములు గుర్తింపవలెను. సముద్ర తీరమున అష్టదళ పద్మాకారమున లిఖించిన ఆ మండలమందు నడుమ తామర పూవు దుద్దు గుర్తుగా. పసుపు కుంకుమలతో చిత్రింపవలెను. నారాయణాష్టాక్షరీ మంత్ర పూర్వకముగ ఇందు నారాయణుని పూజింపవలెను.

అష్టాక్షరీమంత్ర సంపుటితో అంగన్యాస కరన్యాసాదులు ధ్యాన ఆవహనాది షోడశ ఉపచారాది పూజలు కల్పము ననుసరించి యాచరింపవలెను. కావున దానికి వివరణము వ్రాయబడలేదు.

ఇది బ్రహ్మ పురాణమున పూజాది కథనమను నఱువది యొకటవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment