మహాజ్యైష్ఠీ ప్రశంస
బ్రహ్మ ఇట్లనియె
మహాజ్యేష్ఠి పర్వమునందు పురుషోత్తమ క్షేత్రము సేవింపదగినది. శ్రీకృష్ణుని బలరాముని సుభద్రను ఆనాడు దర్శించుటవలన ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రములను సేవించిన పుణ్యము ద్వాదశ క్షేత్ర యాత్రా ఫలము లభించును.
గోదావరి మొదలైన పుణ్యనదులు సేవించిన ఫలము కూడ సిద్ధించును. భూమియందు గల సర్వ దేవాలయములను, నదీ సాగర పర్వత తీర్థములను సేవించి స్నాన దానాదులు చేసిన పుణ్యము కృష్ణదర్శనము చేత లభించును.
అంతేగాక విష్ణులోకము కూడా లభించి అచ్చట పుణ్యానుభవమయిన తరువాత కర్మభూమియందు జనించి చతుర్వేదాధ్యనము జేసి వేదోక్తాచార ధర్మ నిరతుడై కృష్ణభక్తుడై విష్ణుభక్తి యోగమునంది మానవుడు మోక్షము పొందును.
ఇది బ్రహ్మపురాణమందు మహాజ్యైష్ఠీ ప్రశంస అను అరవై నాల్గవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹