Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – అరవై ఆరవ భాగము

గుడివాయాత్రా మాహాత్మ్యము

బ్రహ్మయిట్లనియె.

సుభద్రా కృష్ణ బలరాములు గుడివా మండపమునకు రధయాత్ర చేయుదురు, ఆ ఉత్సవము దర్శించిన వారు విష్ణులోక మందుదురు.

అన మునులడిగిరి. ”దక్షిణ దిక్కునందు ఆ యాత్రా విధానము నేర్పరిచిన వారెవరు? ఆ యాత్రా సందర్శన ఫలమేమి? ఇంద్రద్యుమ్నరాజ నిర్మితమగు నా సరస్సు యొక్క తీరమందు గల ఆ మండపమున తమ దేవాలయమును వదలి ఆ ముగ్గురును ఏడు రాత్రులు నిర్జనమయిన ఆ పవిత్ర ప్రదేశమున ఎందులకు వసింతురో తెల్పుడు” అన బ్రహ్మయిట్లనియె.

ఇంద్రద్యుమ్నుడు ప్రార్ధింప శ్రీహరి గుడివా యాత్రజేసి ఏడు రోజులచట నివసింతునని ఇట్లు పరమునిచ్చెను. ఈ యాత్ర దర్శనము సర్వకామ ఫలప్రదము. బ్రాహ్మణాది వర్ణముల వారు యథావిధిగ షోడశోపచార పూజలు గావించి గీతనృత్యాదులచే పరమాత్మను సేవించిన యడల వారికి సర్వాభీష్టములు సిద్ధించును. ఈ విషయము స్వయముగా తెల్పి అంతర్ధానమయ్యెను. ఆ రాజ శ్రేష్టుడా యాత్రను నిర్వహించి భగవద్ధర్శనము చేసి కృతార్ధుడయ్యెను.

ఇది బ్రహ్మపురాణమునందు గుడివాయాత్రా మాహాత్మ్యమను అరువది ఆరవ అధ్యాయము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment