పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యము
మునులిట్లనిరి
స్వామీ ! అద్భుతమయిన క్షేత్ర ప్రశంస తమ వలన వింటిమి. చాలా ఆశ్చర్యమైనది. తాము చెప్పినది ముమ్మాటికిని సత్యము. సర్వేశ్వరుడయిన విష్ణువు సర్వదేవోత్తముడైనట్లే పురుషోత్తమ దేవుని పుణ్యతీర్థము సర్వతీర్థ రాజము. వసువులలో అగ్ని మొదలుకొని సిద్ధులలో కపిలునివరకు మూలమున చెప్పబడిన ఆయా పుణ్య పదార్థము లందు పరమోత్తమమైన పదార్థము సంసార తారకమైన ధర్మముదాక నీ అధ్యాయమందు తెలుపబడిన విశేషము లెల్ల పారాయణార్హములు సుబోధకములు అని తెలియజేసిరి.
ఇది బ్రహ్మ పురాణమునందు పురుషోత్తమక్షేత్రమాహాత్మ్యమను అఱవది తొమ్మిదవ అధ్యాయము.
గమనిక
శ్రీ బ్రహ్మపురాణమందు అఱువదితొమ్మిది అధ్యాయములు ముగించెను.
70 అధ్యాయము నుండి 175 అధ్యాయమువఱకు 106 అధ్యాయములు.
శ్రీ గౌతమీ మాహాత్మ్యము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹