కాళీయదమనము
వ్యాసుడిట్లనియె :-
కృష్ణుడు గోపకులతో అడవి పూలమాలలు దాల్చి బలరాముడు రాకుండా ఒకతరి బృందావనమునకు వెళ్ళెను. అచట తరగలులేచి నురుగులోడ్డులం దొరయ నవ్వుచున్నదా అన్నట్లున్న కాళిందీ నదికి జని అందొక భయంకరమైన విషాగ్నిని జిమ్ము కాళీయ సర్పమునకు నివానమైన మడుగును జూచెను. విషాగ్ని వ్యాపించి మాడిపోయి ఆ తీర మందలి తరువులతో గాలితాకిడికి లేచిన విషజల స్పర్శచే మాడిపోయిన పక్షులతో మరొక మృత్యుముఖమోయన్నట్లు మహారౌద్రమైయున్న ఆ మడుగుజూచి మధుసూదనుడు ఈ మడుగులో విషాయుధుడు. కాళీయుడు అను దుష్ట సర్పరాజున్నాడు. ఇంతమున్ను వీనిని సముంద్రమందు నిర్జించి వదలిపెట్టితిని. వానిచేత సాగరమున గలియు యమునానది విషదూషితయైనది. దాన నరులు గోవులు దప్పికగొనియు దీనిదరి జేరురు. కావున వీనివశ్యము నిగ్రహింపవలెను. వ్రేపల్లెలోని జనము నిత్యము వీనికి జడియుచుందురు. వారెల్లరు నిక నిట సుఖముగ సంచరింతురుగాక. ఇందుకొఱకే నీలోకమునందవతరించినని, ఇది సత్పురుషులకి రాకపోకలంకనువైన చోటు. దురాత్ములకు శాస్తి చేయవలెను. కావున అనతి దూరములోనున్న కదంబ వృక్షమును (కడిమిచెట్టును) ఎక్కి జీవనాశకమైన ఈ విషవుమడుగులో దూకెదను. అని తలచి నడుమున వలువ బిగించికొని ఆ కాళీయుని మడుగునందు కృష్ణుడు దూకిపడెను.
అట్లు దూకినహరిచే ఆ మడుగు కలగబడి దూరదూరముననున్న వృక్షములను గూడ దనజలములచే దడపెను. విషజ్వాలలచే గ్రాగిన నాయుడుకు నీటిచే దడుపబడిన చెట్లంటుకొని నలుదెసలజ్వాలలు గ్రమ్ముకొనియె. కృష్ణుడు అ ముడుగును బాహువులచే గలకుండుపరచెను. అ శబ్దమువిని నాగరాజు కోపముచే నిండనెరుపెక్కిన కనులతో విషజ్వాలా కులమైన బుడగలతో మఱిపెక్కు ఎఱ్ఱని మహావిషసర్పములతో జుట్టుకొనబడియుండెను. అ నాగుని భార్యలు మనోహరహారముల దాల్చి మేనులుకంపింప కుండలముల జలించి మణికాంతులు మిరుమిట్లు గొలుప నూరునకుమించి యందందగ్రమ్ముకొనిరి. అఫణిరాజు ఫణాగ్రమందు జొచ్చి కృష్ణుడు పడగల బంధమందు జిక్కుకొనియె. కాళియుని పరివారమగు పాములు విషజ్వాలలు జిమ్ముముఖమలం గరచెను. అమ్మడుగునబడి నాగని భోగమునందు నిరుకుగొనియున్న హరిని గాంచి గోపకులు వ్రేపల్లెకుజని శోకవివశులై గోలపెట్టిరి. ఇడిగోకృష్ణుడు కాళీయుని మడుగున విషముచే మూర్ఛవోయినాడు. సర్పరాజు వీనిని తినివేయగలడు. రండు, త్వరగారండని కేకలు పెట్టిరి.
ఆదివిని గోపకులు గోపికలు పిడుగుపడినట్లై యశోద మున్నుగా నందరు మడువు దరికేగిరి. ”కృష్ణడెక్కడ” అనుచు వ్రేపల్లెలో యశోదతో అదరిబెదరి తడబడుచు నటకు వచ్చిరి. నందుడు గోపకులు బలరాముడు మొదలగు అద్భుత పరాక్రమసంపన్నులు కూడ హడలెత్తి కృష్ణునిజూడ యమునకేగిరి. సర్పరాజు వశమునుండి అన్ని పడగలచే జుట్టబడి ఏమిజేయక మిన్నకున్న కృష్ణుని జూచిరి. నందగోవుడు నిశ్చేష్టుడై కొడుకు నెమ్మోము చూచుచు నిలువబడెను. యశోదయు నిశ్చేష్టురాలయ్యెను. మఱియుంగల గోపికలు ఏడ్చుచు కేశవుని గూర్చి శోకాక్రాంతులై భయభ్రాంతలై యశోదతో గూడ నీపెనుమడుగున జొత్తుము చత్తుముగాక తిరిగి పల్లెకులబొరాదు.సూర్యుడు లేని పగలేమి,చంద్రుడు లేని రాత్రియేమి, పాలులేని ఆవులు ఏమి,ఆవులు కృష్ణుడు లేని వ్రేపల్లె యేమి,ఈ కృష్ణుడులేకుండ గోకులమునకు పోనేపోము. అను నీ గోపకల మాటివిని రోహిణికొడుకు బలరాముడు కృష్ణదూరులైన గోపకులను జూచి చూపు నిలిపి బిడ్డముఖమున జూవు వెట్టి దిగులు పడియున్న నందుని మూర్చాకులయైన యశోదను నుద్దేశించి కృష్ణుప్రభావ మెఱిగి యిట్లనియె.
”దేవదేవ! నీ మానుష భావము వెల్లడించు చుంటివా? ఆత్మ స్వరూపమును నీ వెరుగవా? వేరొకరూపే చూపనేల? నీవేజగత్తునకు నాభిభూతుడవు. దేవతల కాశ్రయుడవు. త్రైలోక్యమునకు కర్తవు. భర్తవు హర్తవును. వేదత్రయీరూపుడవు. ఇట నవతరించిన మనకిద్దరకు కృష్ణాగొల్లలే చుట్టాలుకదా! గోపికలునంతేకదా! ఇట్లుపరితపించు నీ బంధువులనుచూచి ఎందువలన నుపేక్షించుచున్నావు. మానుష భావము చూపితివి. బాలచేష్టలు ప్రదర్శించితివి. కోరలాయుధముగ గొనిన ఈ దురాత్ముని దమింపుము.” అని హలిచే జ్ఞప్తిచేయబడి కృష్ణుడు చిరునవ్వున నధరిబింబము దెరచుకొన భూజాస్పాదన ముజేసి పాము పడగల బంధములనుండి తన మేనిని వదలంచు కొనెను.
రెండు చేతుల నా పాము మధ్యమ ఫణమును వంచి వ్రాలిన వాని తలపై నెక్కి అవక్ర విక్రమమున నర్తనము జేసెను. హరి పాదకుట్టనములచే (రాపిడిచే) వాని పడగలు పుళ్ళుపడెను. త్రోక్కిన తల వొంగిపోయెను కాళీయుడు కృష్ణపాద ఘట్టమున మూర్చనొంచెను. దండపాతమట్లు పడిపోయి నెత్తురు గ్రక్కెను. శిథలములైన శిరస్సుల ముఖముల నుండి రక్తము స్రవించ జూచి వాని భార్యలు మధుసూదడమని శరణోందిరి.
దేవదేవ! సర్వేశ్వర! పురుషోత్తమ ! నీవు పరంజ్యోతి స్వరూపుడవు. అత్మయొక్క భాగమేనీవు. నిన్నుస్తుతింప దేవతలును జాలరు. అట్టి నీ స్వరూప వర్ణన తుది యెట్లు చేయడలదు. పృథివ్యప్తేజో వాయ్వాకాశములను జాలవు. అట్టి నీస్వరూప వర్ణన మడుది యెట్లుచేయకలదు. పృథివ్వప్తేజో వాయ్వాకాశ రూపమయిన బ్రహ్మండమనీలో యల్పాల్పమైన యంశము. అట్టి నిన్నేమి స్తుతింపగలను. కావున ఓ జగత్ప్రభో! ఈ నాగని యెడ దయ జూపుము. అణగి మణగి ప్రాణములు వదలు చున్నాడు. భర్తృభిక్ష పెట్టుము. అని నాగపత్నులు పలుక కాళీయుడు వొడలెల్ల నలుగుడువడి కూడ దేవదేవ! యనుగ్రహింపుమని మరిమరి ఇట్లుపలికెను.
నీ ఐశ్వర్యము ఎనిమిది విధములు. అది స్వభావసిద్ధము. దానిని యతిశయించునది మఱి లేదు. అట్టియణిమాది విభూతిసంపన్నుడగు నిన్నేమి స్తుతింపగలడు. నీవు పరుడవు పరునకును మూలము నీవు. నీకంటె పరమైనతత్వము నీవె. పరతత్వమునకు వరమునీవు. అట్టినిన్నేమి స్తుతింపగలను. జాతిచే రూపముచే దామిట్లునన్ను సృజించితిరి. దానికణుగుణ మైన స్వభావముకూడినవాడను. తదనుగుణమైన చేష్టను చేసితిని. సర్పస్వభావమైప కాటు వేయుటను గరచుటను మాని వేఱొకతీరున ప్రవర్తింతునేని స్వామి! నన్ను దండించుట న్యాయము. అట్లయ్యు ఓ జగత్ప్రభు నాపై దండనము వైచితివి. ఈ దండనము నీవు విధించినది కావున యిది వరముగనేను స్మరింపవలసినదే. ఇంతకంటె నీవలన మఱొకవరమువలదు. అచ్యుత! వీర్యము హతమైనది, విషము హతమైనది. నీచే నేను దమితుడనైతిని. బ్రాణ మొక్కటి మాత్రమిమ్ము. మఱియేమి నేనుసేయవలేనో ఆజ్ఞాపింపుము అనవిని శ్రీభగవానుడు ఓ కాళీయా ! ఈ యమున జలమున నిక్కడ నీవెపుడు నుండవలదు. భృత్యపరివారముతో నీవు సముద్రజలములం జనుము నీతలపై నాపాదములను జూచి సముద్రమున పన్నగారియైన గరుడుడు నిన్ను జంపడు అని హరి సర్పరాజును వదలెను. వాడును కృష్ణునకు మ్రొక్కి సముద్రమునకేగెను. సర్వభూతములు చూచుచుండ భృత్యులతో సంతతితో బంధువులతో భార్యలందరితో నమ్మడుగు విడిచి సర్పము పోయినంత గోపకులు చనిపోయి మఱివచ్చిన వానినట్లు గోవిందుని కౌగిలించుకొని భాష్పములచే నాతని శిరస్సుదడిపిరి. ఎల్లరు మనసులచ్చరువుబడ నానందభరితులై ఆ నది మధురమంగళ రసపూరితముగాజూచి స్వామిని స్తుతించిరి. గోపికలచే గీర్తింపబడి గోవకులతో గృష్ణుడు వ్రేపల్లెకరుదెంచెను.
ఇది బ్రహ్మపురాణమున కాళీయదమనమను డెబ్భై తొమ్మిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹