Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ గణేశ పురాణం 🌹🌹🌹 – నలబై ఆరవ అధ్యాయము

ఉపాసనా ఖండము మెదటి భాగము

నామసహస్రోపదేశం

“ఓ చతురాననా! భక్తవత్సలుడైన గణేశుడు తన సహస్రనామములను స్వయంగా లోకానుగ్రహకాంక్షియైన ఈశ్వరునికి ఉపదేశించాడా? ఆశ్చర్యంగావున్నదే? దయతో ఆ వివరం తెలుపవలసింది!” అంటూ ప్రార్ధించిన వ్యాసమునీంద్రునితో బ్రహ్మ యిలా చెప్పాడు.

“ఓ వ్యాసమునీంద్రా! శంకరుడు త్రిపురునితో యుద్ధానికి తలపడి పోరుకై వెళ్ళే సమయంలో గజాననుని స్మరించకపోవటంచేత గెలుపుకి అవరోధాలు విఘ్నములుగా కలిగాయి! అప్పుడు భక్తిభావంతో యధా విధిగా విఘ్నహరుడైన గణేశుని పూజించి, తన గెలుపుకి ఉపాయాన్ని అనుగ్రహించమని ప్రార్ధించగా అతని పూజకు సంతుష్టుడైన గణేశుడు. తానే స్వయంగా ఈశ్వరునికి సర్వవిఘ్న హరమైన, సకల శుభప్రదమైన ఈ గణేశ సహస్రనామాన్ని ఉపదేశించాడు. ఇది అత్యంత ప్రభావవంత మైనది.”

ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని ”నామసహస్రోపదేశం” అనే నలబై ఆరవ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment