Skip to content Skip to footer

శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – తొంబై మూడవ భాగము

రుక్మిణీకల్యాణము శంబరాసురవధ

వ్యాసులిట్లనియె.

భీష్మకుడు విదర్భ దేశాధిపతి కుండిననగరము రాజధానిగా రాజ్యపరిపాలన చేసెను. అతని కుమార్తె రుక్మిణి. కుమారుడు రుక్మియనువాడు. రుక్మిణిని కృష్ణుడును కృష్ణుని రుక్మిణియు నొండరులు వరించుకొనిరి. కాని రుక్మిద్వేషముగొని చక్రాయుధునకు అతడీయడయ్యెను. జరాసంధుని ప్రేరణచే శిశుపాలునకు వాగ్ధానము చేసెను. భీష్మకుడును రుక్మితో నట్లేయనెను. అవ్వల జరాసంధాదులు కళ్యాణార్ధము భీష్మనగరమునకు వచ్చిరి. శిశుపాలుడును వచ్చెను. కృష్ణుడు బలభద్రుడు మొదలగు యాదవులుతోగూడి ఆ వివాహము చూచుటకని వచ్చెను. రేపు వివాహము కానున్న సమయమున హరి ఆ కన్యను గొనిపోయెను. దానికి బలరామాది బంధువులయెడ శతృత్వముగొని శ్రీమంతుడగు పౌండ్రకుడు దంతవక్తృడు విదూరథుడు శిశుపాలుడు జరాసంధుడు శాల్వాదిరాజులు కోపించి హరిని జంపుటకు తీవ్రమైన యత్నముచేసిరి . అట్లెత్తివచ్చిన ఆ బలగము రామాదులచే ఓడిపోయిరి. రుక్మి రణమున కేశవుంగూల్పక పురమునం బ్రవేశింపనని ప్రతిజ్ఞచేసి కృష్ణుని చంపదూకెను. చక్రాయుధుడు వాని చతురంగ సైన్యమును లీలగకూల్చి రుక్మిని బడగొట్టెను. వాడోడి పోయెను. అట్లు రుక్మిని గెలిచి శ్రీకృష్ణుడు శ్రీరుక్మిణీదేవిని రాక్షస వివాహ విధానమున పరిణయమాడెను. కృష్ణునకు ఆమెయందు మన్మథాంశమున ప్రద్యుమ్నుడు జన్మించెను. శంబరుడాతనిని దొంగిలించుకొని పోయెను. అతడా శంబరుని సంహరించెను.

ఇది శ్రీబ్రహ్మపురాణమున రుక్మిణీకళ్యాణ వర్ణనము శంబరాసురవధ అను తొంబై మూడవ అధ్యాయము

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment