శ్రాద్ద విధివర్ణనము రెండవ భాగము
మునులు శ్రాద్ధకల్పము ఎవరెవరికి ఎప్పుడానతిచ్చిరో సవిస్తరముగ తెల్పుడన వ్యాసభగవానుడిట్లనియె. బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యకులముల వారు తమతమకు చెప్పబడిన విధానమున మంత్రపూర్వకముగా శ్రాద్దము సమష్టింప వలెను. స్త్రీలు మరి శూద్రాదులు బ్రాహ్మణులు చెప్పినట్లు అగ్నిహోత్రము లేకుండా అమంత్రకము శ్రాద్దము పెట్టవలెను. పితృదేవతల నుద్దేశించి శ్రాద్దము పెట్టవలసిను ప్రదేశములు పుష్కరాది తీర్థములు పుణ్యక్షేత్రములు పర్యత శిఖరములు పవిత్రనదులు నదములు సరస్సులు నదీసంగమములు సముద్ర తీరములు ఇవి ముఖ్యములు. గోమయముతో అలికిన స్వగృహమునందు దివ్యవృక్షమూలములందు యజ్ఞార్హములైన మడుగులయందు శ్రాద్దము పెట్టుట ప్రశస్తము. కిరాతదేశములందు కళింగము కొంకణము కృమి దశార్ణివము కుమార్య దేశములందు తంగణమునుదేశమునందు క్రథమనుదేశమనుందు సముద్రము యొక్క ఉత్తరతీరమునందు (సింధునది ఉత్తరతీరమునందు) నర్మదానీదీ దక్షిణతీరములందు కరతోయ అనునదికి తూర్పు ప్రదేశమునందును శ్రాద్దము పెట్టరాదు. ఇదే విధముగా నిత్యశ్రాద్ధవిధానము కూడా చెప్పబడినది. ప్రతి సంవత్సరము నైమిత్తికము కామ్యము అనుశ్రాద్దములు నిత్య శ్రాద్దముతో పాటు నిర్వర్తింపవలెను. జాతకర్మాదులయందు వృద్ధి శ్రాద్దము పెట్టవలెను. మంత్రపూర్వకముగా శ్రాద్దము పెట్టవలసినవారు ద్విజులు మాత్రమే( బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలు మాత్రమే)
సూర్యుడు కన్యారాశిలో నున్నపుడు పదునైదురోజులు శ్రాద్ధము పెట్టుటకు ఉత్తమములని చెప్పబడినది.
శ్రాద్ధము పాఢ్యమినాడు పెట్టిన ధనలభము. విదియ పశుసంపదనిచ్చును. తదియ పుత్రప్రదము. చదుర్ది శత్రునాశనకము. పంచమి ఐశ్వర్యప్రదము, షష్టిలోక పూజ్యునింజేయును. సప్తమి గణాధిపత్యమును కూర్చును. అష్టమి జ్ఞానప్రదము, నవమి స్త్రీలాభము కలిగించును. దశమి సర్వాభిష్టములను జేకూర్చును. ఏకాదశి సర్వేవేద సంపన్నుని చేయును. ద్వాదశి జయకరము. త్రయోదశి సంతానాభివృద్ధి పశుసంపద మేధ స్వాతంత్ర్యము నుంచి పుష్టని దీర్ఘయార్థయమునైశ్వరముమను జేకూర్చును. ఇందు సందేహములేదు. చతుర్ధశినాడు లభించినంత అన్నముతో శ్రద్దతో శ్రాద్దము పెట్టనయెడల ఆయుధముల దెబ్బతిని చనిపోయినవారు యువకులుగా చనిపోయినవారు సంతృప్తి నొందుదురు. అమావాస్యనాడు శ్రాద్దము పెట్టిన ఇతడు సర్వకామములను బడసి స్వర్గము బడయును.
గయాశ్రాద్ధము అనంఫలదము, బెల్లముతో కలిపి నువ్వులను శ్రాద్ధమందుయోగించిన విశేషఫలమొసగును. తేనెకాని తేనెతో కూడిన పదార్ధముగాని పితృదేవతలకు నొసంగిన అక్షయఫల మొసంగును. మాకులమందు పుట్టినవాడు మాకు జలాంజలు లొసగి (పితృతర్పణములుచేసి) వర్షఋతువునందు మాఘఫాల్గుణములందు తేనెతోకూడిన పాయసమును మాకు నివేదించునాయని పితృదేవతలు ఉవ్విళ్ళూరుచుందురు. బహు పుత్రసంతానము మాకు కావలయునని కోరుట అందరిలో నేయొక్కడేని గయకు వెళ్ళునేమోయని? గౌరీ (కన్యావివాహముచేయునా? దశ వర్ష) నీలవృషభోత్సర్జనము చేయునా? అని పితృదేవతలు ఉబలాడుపడుదరు. కృత్తికానక్షత్రమందు శ్రాద్ధముపెట్టిన స్వర్గమునందును. రోహిణీ నక్షత్రమందు పితృశ్రాద్ధము సంతానప్రదము, సౌమ్యదేవతా (మృగశిర) నక్షత్రమందు పెట్టిన శ్రాద్ధము మంచి తేజశ్శాలింజేయును. ఆర్ధ్రానక్షత్ర శ్రాద్ధము శౌర్యవంతుని చేయును. పునర్వసు నక్షత్రము క్షేత్రసందర్శన భాగ్యము నొసంగును. పుష్యమి అక్షయదన మొసగును. ఆశ్లేషపూర్ణాయుర్దాయ మిచ్చును. మఘనంతానమును పుష్టిని గూర్చును. పూర్వఫల్గుణీ నక్షత్రములు సౌభాగ్యప్రదములు, ఉత్తరఫల్గునియందు పెట్టినశ్రాద్ధము ఉత్తమ సంతానమొసగును. హస్తానక్షత్రమందు శ్రాద్ధము పెట్టి నతడు శాస్త్రసారంతుడగును. చిత్రానక్షత్రము తేజస్సేను సంతానమును నొసంగును. స్వాతి వ్యాపారమందు లాభము గూర్చును. విశాఖ పుత్ర ప్రదము. అనూరాధనక్షత్రమందు పితృశ్రాద్ధమొనరించిన చక్రవర్తిత్వము నొసంగును. జ్యేష్ఠ ఆధిపత్యమొసంగును. మూలానక్షత్రమారోగ్యప్రదము, పూర్వాషాడయశస్కరము., ఉత్తరాషాఢ శోక ముహరించును. శ్రవణము శుభలోకప్రదము ధనిష్ఠ ధనసమృద్ధిదము. అభిజిత్తు వేదవేత్తను గావిచును. వారుణము (శతభిషము) వైద్దయసిద్ధినిచ్చను. పూర్వాభాద్ర అజావికమును ఉత్తరాభాద్ర గోసంపద నొసంగును. రేవతి రజత సమృద్ధిదము. అశ్విని అశ్వసంపత్తిగూర్చును, భరణీనక్షత్ర శ్రాద్ధము దీర్ఘాయుర్భాగ్యమిచ్చును. కావున కామ్యములయిన శ్రాద్ధముల చేగూడ పితృదేవతాసంప్రీతి గావింపవలయును.
కన్యారవి (మహాలయ) ప్రశంస
సూర్యడు కన్యారాశి యందు ఉన్నపుడు శ్రాద్ధముపెట్టిన ఏయేకోరికలు కోరునో అవన్నియు నెరవేరును. వరాహపురాణము నందు చెప్పబడినట్లు పౌరమాసియందు పితృశ్రాద్ధము పెట్టిన యెడల దివ్యభౌమ అంతరిక్షములకు స్థావర జంగమములకును సంబంధించిన సర్వకామములను బొందుదురు. సూర్యుడు కన్యారాశియందున్నపుడు పితృదేవతలు పిండము గోరుదురు. రవి కన్యారాశి యందున్న పదునాఱు రోజులందు పితరులకు పిండ ప్రదానము సేయుట సర్వక్రతువులు సేయుటయేయని నారాయణుడు పలికెను. రాజసూయ అశ్వమేధముల ఫలమును సూర్యుడు కన్యారాశిగతుడైనప్పుడు నీళ్ళు ఆకుకూరలు దుంపల మాత్రముతో పెట్టిన శ్రాధ్దము వలన పొందు ఫలమునందును. ఉత్తర-హస్తనక్షత్రములందు సూర్యుడు కన్యారాశిగతుడైనప్పుడు భక్తితో పితృదేవతార్చనము సేసిన స్వర్గము సిద్ధించును. రవిహస్తయందు ప్రవేశించి వృశ్చకారాశి ప్రవేశము చేయుదాక పితృపురి శూన్యమయియుండును. వృశ్చికమును గూడ రవిదాటిపోయిన తఱి పితృదేవతలు దేవతలతో గూడ నిట్టూర్పుపుచ్చి తనకులమువారికి శాపమిచ్చి తిరిగిపోవుదురు. అష్టకలందు మన్వంతరములందు గ్రహణమందు వ్యతీపాతమందు రవి చంద్రసమాగమమందు (అమావాస్యనాడు) జన్మనక్షత్రమందు గ్రహబాధలు గల్గినపుడు పెట్టుశ్రాద్ధము పార్వణశ్రాద్ధ మనబడును. రెండు ఆయనములందు రెండు విషవత్తుఅందు సంక్రాంతులందును యథావిధిగ శ్రాద్ధముపెట్టవలెను. వీనిలో పిండ ప్రదాన నిర్వాపణములు అవసరముగావు. వైశాఖ శుక్లతదియ యందు కార్తిక నవమియందును సంక్రాంతి శ్రాద్ధవిధానమున పితరులనర్చింపవలెను. భాద్రపదశుక్లత్రయోదశియందు మఘయందు చంద్రక్షయ పర్వమందు పాయసముతో శ్రాద్ధము పెట్టవలెను.. ఆది దక్షిణాయన శ్రాద్ధతుల్యము, వెదవేత్త శ్రోత్రియుడు నిత్యాగ్నిహోత్రియులైన బ్రాహ్హణు డింటిక రుచెంచెనేని ఆ ఒక్కనితోనే యథావిధిగ శ్రాద్ధము పెట్టవచ్చును. శాస్త్రీయమైన శ్రాద్ధీయ ద్రవ్య సంపద సమకూరినపుడు పార్వణ విధానమున పితృశ్రాద్ధమును సేయవలెను. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులకు సంతానములేని పినతండ్రులకు పెద్దఅన్నకు ప్రతిసంవత్సరము విశ్వేదేవతలో కూడ పితృదేవతలకు తద్దినము పెట్టవలెను. విశ్వేదేవులు లేకుండా ఏకోదిష్టశ్రాద్ధము నందు దేవ పితృస్థానములందిద్దరు బ్రాహ్మణులను అర్చింపవలెను. ఇట్లే మతా మహాదులకును జరుపవలెను. ప్రేతీభూతడైన జీవునకు భూమిపై పిండమును జలమును తిలలతో కుశలతో జల సమీపమందు పెట్టవలెను. బ్రాహ్మణులు పదునొకండవ దినమునను క్షత్రియులు పదుమూడవ దినమునను వైశ్యులు పరునారవదినమునను శూద్రుడు ముప్పది ఒకటవ దినమునను శుద్దులగుదురు. అనగా ఆశౌచమును విడుచును. నూతకము తుదను గృహమందు పండ్రెండవ దినమందును మాసమందును త్రైపక్ష మందును ఏకోద్ధిష్ట శ్రాద్ధము పెట్టవలెను. సంవత్సరము తుదదాక ప్రతినెల మాసికము పెట్టవలెను. ఆపైన సపిండీకరణము పార్వణ విధానమున జరుపవలెను. అప్పటినుండి చనిపోయిన జీవుడు ప్రేతత్వమును విడిచి పితృదేవతాత్వమును పొందును. పితృదేవతలు ఆమూర్తులు మూర్తిమంతులు నని రెండువిధములుగా నుందురు. నాందీముఖులు అమూర్తులు, పార్వణులు మూర్తిమంతులు.
మునులు సపిండీకరణ విధానము నానతిమ్మని యడుగ వ్యాసుండింట్లనియె.
సపిండీకరణము నందు విశ్వేదేవతలు ఆహ్వానింపబడరు. అందొకటే అర్ఘ్యమీయవలెను. అగ్నౌకరణముండదు. ఆవాహనముకూడ నుండదు. బ్రాహ్మణులు బేసి సంఖ్యలో నర్చింపబడుదురు. అ సపిండీకరణ విధనమున మరోక విశేషము తెలిపెదను. తిలగంధొదకములచే కూడిన నాల్గు పాత్రలు ఉపయోగింపబడును. వానిలో పితరులకు మూడు ప్రేతకు నొకటి. ప్రేత పాత్రమందలి అర్ఘ్యముచేత మిగిలిన మూడు పాత్రములను ”యేనమానాః” అను మంత్రము జపించుచు ఉదకము చల్లవలెను. స్త్రీలకు గూడ ఈ ఏకోదిష్ట విధానమున జరుపవలెను. సంతానము లేని స్త్రీలకు సపిండీకరణము పెట్టనవసరము లేదు. స్త్రీలకు సంతానము లేనివారికి ఏకోద్దిష్ట విధానమున ప్రతిసంవత్సరము నిది విహితము. కొడుకులు లేని స్త్రీలకు జ్ఞాతులు కూడ లేనపుడు. సోదరులు శ్రాద్ధము పెట్టవలెను. మాతామహులకు దౌహిత్రుడు (కూతురి కొడుకు ద్వ్యాముష్యాయణులను పేర పిలువబడు మనుష్యులు మాతామహ వర్గమును యథావిధిగా పూజింపవలెను. వారికి నిత్య శ్రాద్ధమేకాక నైమిత్తిక శ్రాద్ధములు కూడా దౌహిత్రుడు పెట్టవలెను. సర్వాభావమందు అనగా తద్దినము పెట్టువాడు లేనపుడు స్త్రీలు స్వయముగా మంత్రరహితముగా శ్రాద్దము పెట్టవలెను. ఏ దిక్కును లేని జీవులకు రాజు ఆయాజాతి పురుషులచే శవవాహనము దగ్గర నుండి జరిపింపవలెను. సర్వ వర్ణములకు రాజు బంధువు.
నిత్యనైమిత్తిక శ్రాద్ధవిధానము చెప్పద వినుడు. నిత్యశ్రాద్ధము సపిండీకరణానంతరము జరుపనవలెను. అందు తండ్రికి పెట్టిన పిండమునుండి లేపము ప్రపతితామహుడు పొందును. వానకి పైన నాల్గవవాడును లేపభుజుండగును. అతడును తండ్రి తాత ముత్తాత అను నీ ముగ్గురు పురుషులు పిండభక్కులు. మిగిలన పై మూడు తరములవా పిండ లేప సంబంధులు. ఇట్లు పితృ పితామహ ప్రపితామహులు వారికి వెనుకటి మూడుతరముల వాడారు యజమానుడు కలసి మొత్తము వీరేడుగురు. వీరి అన్యోన్య సంబంధము సావ్తపౌరుషము. యజమానికి పైవారిలో అనులేప భుక్కుల వానికంటె ముందు ఆ కుటుంబమున బుట్టిన వారును నరకమున కేగినవారు పశుపక్ష్యాది జన్మలెత్తినవారు భూతాదులందు వ్యాపించి యున్నవారు ఇందరను యజమాని శ్రాద్ధము పెట్టి సంతృప్తిపరచును. ఆ సంతృప్తి పరుచుటలో అన్న ప్రకిరణము అన్నపు మెతుకులను చిమ్ముట అనుక్రియ చేయబడును దానివలన పిశాచాది జన్మలందినవారు తృప్తి పొందుదురు. స్నానము చేసి వస్త్రమును పిడిచిన నీటిచే వృక్షజన్మ పొందినవారు తృప్తి బడయుదురు. భూమి మీద పడిన గంధోదక బిందువులచేత ఆ కులములో దేవత్వము పొందినవారికి ఆప్యాయనము కలుగును. పిండము లుద్దరించిన తరువాత చల్లిన నీటిచినుకులచే పశుపక్ష్యాది జన్మలెత్తిన వారకి తృప్తికలుగును. దంతములు కూడ రాని బారురకర్మ బహిష్కృతులైనవారు అనధికారులుగ మరణించినవారు పితృస్థానమందు సమ్మార్జనము చేసిన ఉదకము చేతను బ్రాహ్మణ పాదప్రక్షాళనముచేసి ఉదకముబొందియు తృప్తినొందుదురు. ఈ విధముగ యజమాని నిర్వర్తించిన శ్రాద్ధము నందు చిందిన నీరు చిమ్మిన అన్న విక్షపము అది శుచియైనను కాకున్నను దానిని పొంది ఆ కులమువారు ప్రస్తుతము అన్య యోనులందు బుట్టినవారు ఆప్యాయనము బడయుదురు.
విధానముననుసరించి శ్రాద్ధము చేసినవారి పితరులు ఆప్యాయనమును తృప్తిని పొందుదురు.
అన్యాయార్జిత విత్తములచే పెట్టిన శ్రాద్దము చండాల పుల్కసాది జాతులందు పుట్టిన వారికి తృప్తికూర్చును. కనుక మానవుడు తుదకు ఆకుకూరతో నైన భక్తితో శ్రాద్దము పెట్టిన యెడల వాని కులమందొక్కడును దుఃఖపడడు. ఆచారవంతులను నిత్యాగ్నిహోత్రులను జ్ఞానులను నిత్యశుచులను విశేసించి శ్రోత్రియులను భోక్తలను నిమంత్రించి శ్రాద్ధము పెట్టుట ప్రశస్తమైన విషయము. త్రిణాచికేతుడు-త్రిమధువు-త్రిసువర్ణుడు (నాచికేతాగ్ని విద్యను త్రిమధువిద్యను త్రిసుపర్ణవిద్యను ఈ మూటిని అధ్యయనము చేసి వాని అర్థముకు ఎరిగి ఆ అగ్నిచయనమును అనుష్ఠించినవారు) వేదాంగముల నారింటిని అధ్యయనము చేసినవారు మాతృపితృ భక్తులు మేనల్లుడు సామవేదము నెరిగిన వారు యజ్ఞమున జరుగు అన్ని క్రియాకలాపములలోను యజ్ఞమును జరుపు జరిపించు అందరలోను మంచి చెడ్డలను పరిశీలించి చెప్పగల మహాపండితుడు ఇట్టి వారిని భోక్తగా తీసికొనవలెను. మేనమామ తనభార్యకు తండ్రి తన భార్యకు సోదరుడు వియ్యంకుడు – ద్రోణపాఠకుడు – నాలుగు వందల గ్రామముల మొత్తములో ముఖ్యవేద పండితుడు – మండల బ్రాహ్మణుడు-ఒక మండల ప్రదేశము మొత్తములో ప్రధాన వేదపండితుడు – పురాణములలోని తత్త్వ విషయముల నెరిగినవాడు కూడని దానము గ్రహించనివాడు అకల్పుడు – దుస్సంకల్పములు లేనివాడు-కల్సంతుష్టుడు-తనసత్సంకల్పము నెరవేరగనే సంతృప్తి నొందువాడు – ఇట్టి వారిని శ్రాద్ధమునందు భోక్తలుగ పెట్టవలెను. పంక్తిపావనులైన తాము ఏ పంక్తిలో కూర్చుండి భుజించెదరో ఆ పంక్తిలో భుజించిన వారందరను తమ శక్తిచే పవిత్రులను చేయగలవారు – అట్టి బ్రాహ్మణులను గూడ శ్రాద్ధమున భోజనమునకు పిలువవలెను. శ్రాద్ధమునకు ముందటి నాడే వీనిని పిలిచికొని వచ్చి విశ్వేదేవ పితృస్థానములందు కూర్చండ బెట్టి ఆర్చింపవలెను. శ్రాద్దము చేయు యజమానుడు కూడ వారితో పాటు మౌనాదినియములను బూన వలయును.
శ్రాద్ధభోజనము చేసినవాడు మైథునము సలిపిన యెడల వాని పితరులు ఆరేతస్సునందొక్కనెల పడి యుందురు. స్త్రీనిపొంది శ్రాద్ధమునందు బ్రాహ్మణుడుగా కూర్చండి భోజనము చేసిన వాని పితృదేవతలు రేతోమాత్రము లాహారముగొని నెలరోజులు కుములుదదురు. కావున చక్కగ తెలిసి ఉత్తముడైన బ్రాహ్మణులను నిమంత్రణము సేయవలయును. ఇది ప్రథమ కర్తవ్యము, తద్ధినమునాడు స్త్రీమైథునము చేసినవారిని ఏ మాత్రము నిమంత్రిపరాదు. ఉత్తమ బ్రాహ్మణుడు లభింపనపుడు భిక్ష కొరకు వచ్చిన వారిని సరిగా ఆ సమయమున నింటికి వచ్చిన యతులను యోగులను సాష్టాంగముగ మ్రొక్కి బ్రతిమాలి శ్రాద్ధమందు భోజనము పెట్టవలెను. పితృదేవతలు యోగముమీద నాధారపడిన వారడు కావున వారి ప్రీతికి పూజింపవలసిన వారు యోగుల వేయిమంది బ్రాహ్మణులలలో నొక్క యోగిసమానుడు, ఆతడు వీటిలో నౌక యట్లు యజమానిని భోక్తలను (పితృదేవలను) తరింపచేయగలడు. ఈవిషయములో బ్రహ్మవాదులు గానముసేసిన పితృగాథల తాత్పర్యము ఇది.
పితృగాథలు
ఐలుడను రాజు నుద్దేశించి పితృదేవతలిట్లు గానము సేసిరి. మాసంతతిలో పరమశ్రేష్ఠుడు ఒక్క కుమారుడు కల్గునా? యోగుల భుక్తశేషాన్నము భూమిపై మాకు పిండములు పెట్టునా ? లేదా గయయందు పిండదానము చేయునా? హవిస్సు – పులుపుకారము చురుకు వస్తువులు లేని సాత్వికమైన ఆహారము – బలుసు కూర తిలలు ఆజ్యము కృనరము (పులగము) మాకు పెట్టునా? త్రయోదశినాడు ముఖా నక్షత్రమందు తేనెనెయ్యితో కలిపిన పాయసముతో దక్షిణాయనము నందు మాకు నివేదించునా? అని ఉబలాట పడుచుందురు. కావున భక్తితో పితృ దేవతలనర్చించి సర్వాభీష్టములను బడయవలయును ఆ పితృప్రీతి వలన వుసుపులు రుద్రులు ఆదిత్యులు నక్షత్ర దేవతలు గ్రహములు తారాగ్రహములు పితృశ్రాద్ధము వలన తృప్తులై ఆయువును సంతానమును ధనమును విద్యను స్వర్గమును మోక్షమును పితృదేవతలోసంగుదురు. అపరాహ్ణకాలము నుండి పితృకాలము. అపుడు స్వాగతము చెప్పి పవిత్రపాణియై ఆచమించి అభ్యాగతుడైన ద్విజులను ఆసములందు ఉపవిష్టులను జేయవలెను. శ్రాద్ధము పూర్తిచేసి ఉత్తమ ద్విజులకు భోజనము పెట్టి ప్రియసంభాషణముల చేత ప్రణమిల్లి భక్తితో ద్వారము దాక అనుగమించి విసర్జించి వారి అనుమోదము పొందివచ్చి నిత్యక్రియా కలాపము పూర్తిచేసికొని అతిథులకు భోజనము పెట్టవలెను. పితృదేవతలకు సంబంధించిన తర్పణాది నిత్యక్రియలు అపుడే చేయవలయునని కొందరందురు. కాదని కొందరందురు. అవి వేరుగా చేయవలెను. కొందరు ముందే చేయవలెనని చెప్పుదురు. అటుపై యాజమానుడు శ్రాద్ధాన్నమును తమవారితో పరివారముతో భుజింప వలెను. ఇట్లు ధర్మజ్ఞుడైన బ్రాహ్మణుడు బ్రాహ్మణులందురు సంతోషించునట్లు శ్రద్ధతో శ్రాద్ధము నిర్వహింపవలెను.
శ్రాద్దవర్జ్యములు
శ్రాద్దమునందు భోక్తులుగా పెట్టతగని అదమ బ్రాహ్మణులను పేర్కొందును వినుడు. మిత్రద్రోహి పుప్పి గోళ్ళవాడు నపుంసకుడు క్షయవ్యాధి బొల్లికలవారు వాణిజ్యము చేయువాడు గార పండ్లవాడు బట్టతలవాడు మెల్లకంటివాడు గ్రుడ్డివాడు చెవిటివాడు మందబుద్ధి మూగవాడు కుంటివాడు పీలచేయిగాని వంకరచేయిగాని కలవాడు పౌరుషశక్తి లేనివాడు చర్మవ్యాధి కలవాడు అవయవములు తొలగింపబడినవాడు ఓరవంకర చూపుగలవాడు కుష్ఠ వ్యాధితుడు ఎఱ్ఱని కండ్లవాడు మరుగుజ్జు పొట్టివాడు వికటమైన ఆకారము గలవాడు చురుకుదనములేనివాడు మిత్రుని శత్రునిగా భావించువాడు. నీచవంశమున బుట్టినవాడు పశుపాలనచే జీవించువాడు. వెలివేయబడినవాడు పరివిత్తి (తమ్మునికి వివాహమైన తర్వాత తాను పెండ్లి చేసికొన్నవాడు) పరివేత్త (అన్నకంటె ముందుతాను పెండ్లాడిన తమ్ముడు) పరివేదిని కాసుతుడు(అన్న కంటె ముందు పెండ్లాడిన వాని భార్యకడుపున పుట్టిన కొడుకు) శూద్ర స్త్రీని పెండ్లాడిన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని పెండ్లాడిన పుట్టిన కొడుకు ఇట్టి వారిని శ్రాద్థమున భోక్తలుగా తీసికొన కూడదు. ఇట్టి శూద్ర స్త్రీకి ఉపనయనాది సంస్కారములు జరిపించిన బ్రాహ్మణుడు పెండ్లాడనివాడు దిధుషూవతి (భర్త మరణించిన తరువాత మరల పెండ్లాడిన స్త్రీ యొక్క భర్త) జీతము తీసికొని వేదాధ్యయనము చేయించువాడు జీతమిచ్చి వేదము నేర్చకొనువాడు సూతాకాన్నముచే జీవించువాడు వేటాడువాడు సోమరసమును సోమలతను అమ్మువాడు అభిశస్తుడు (వేదాధ్యయనము చేసిన క్షత్రియునిగాని వధచేసినపాపి) దొంగ భ్రష్టుడు వడ్డీ వ్యాపారముచే జీనించువాడు మోసము చేసి జీవించువాడు కొండెములు చెప్పువాడు వేదాధ్యయనము దానము అగ్నిహోత్రము చేయక విడిచి కాఠిన్యము వహించినవాడు రాజపురోహితుడు రాజసేవకుడు విద్యావిహీనుడు ఇతరులమేలు ఓర్చనివాడు పెద్దలను ద్వేషించువాడు భరింపరాని దుష్టుడు రుక్రూడు మూఢుడు గుడిపూజారి నక్షత్ర సూచకుడు (జాతక ఫలములు చెప్పి జీవించువాడు) పర్వకారుడు (రాతిపని చేయువాడు) లోకనింద పొందువాడు యాగము చేయింపకూడని వారిచే యాగము చేయించినవాడు ఇట్టి వారిని శ్రాద్ధమున భోక్తలుగ గ్రహింపకూడదు.
అపాత్రదానము పట్టువాడు సత్పరుషుల నవమానించువాడు. వారికి దైవము అప్పటికప్పుడు దారుణమైన దండనము విధించును. వీరు బహునిషిద్దులు. ఆగమవిహితుని విడిచి నీచునికి భోజనము పెట్టిన యజయాని ధర్మమూలమునకే దూరుడై నశించును. తనతో తననాశ్రయించి యుండు బ్రాహ్మణుని విడిచి యింకొకనిని గొనివచ్చి భోజనము పెట్టినచో ఆ ఆశ్రయించుకొనిన బ్రాహ్మణుని నిట్టూర్పు నిప్పుచే దగ్ధుడై దాన నశించును. వస్త్రములేని క్రియ లేనేలేదు. యజ్ఞములు లేవు. వేదములు లేవు. తపస్సులు లేవు. కావున శ్రాద్ధకాలమందు పితృదేవతలకు వస్త్రములు తప్పక ఇచ్చి తీరవలెను. పట్టుపంచె పొత్తుపంచె నూలువస్త్రము క్రొత్త దుకూలము శ్రాద్ధము నందిచ్చినవాడు పరమోత్తమాభిలాషలను బడయును.
ఆవులమందలో దూడ ఎట్లు తమ తల్లి పొదుగునకే చేరునో శ్రాద్దమునందు విప్రులకు పెట్టిన అన్నము ఆ జీవుని అట్టే పొందును. నామము గోత్రము మంత్రము అనునవి ఈ యన్నమును ఆయాస్థానముల కందించును. ఆ కులమునందలి అందరకును తృప్తి కలుగును.
దేవతలకు పితరులకు మహాయోగులకు నమస్కారము. స్వధాదేవికి స్వాహాదేవికి నమస్కారము. వీరందరు నిత్యము నాయందుందురు. అను నీ మంత్రమును శ్రాద్ధము ముందు అవసానము నందు ముమ్మారులు జపింపవలెను. పిండ నిర్వహణ సమయమందుకూడ నిట్లు జపింపవలెను. ఈ మంత్రమువలన పితృదేవతలు పరుగుపరుగున వత్తురు. రాక్షసులు పారిపోవుదురు. ముల్లోకములు తృప్తిచెందును. ఇది తరింపజేయును.
పిండములను అగ్నియందుంచిన భోగసమృద్ధి గలుగును. భార్యకు పెట్టిన సంతానము కలుగును. మధ్య పిండము మాత్రము ఇట్లు చేయవలెను. గోవులకు పెట్టినచో మంచి తేజస్సును బడయును. ఉదకములందు వేసిన ప్రజ్ఞ కీర్తి యశస్సు కలుగును. దీర్ఘాయుర్దాయము కోరువాడు కాకులకు పెట్టవలెను. కుమారశాలను కోరువాడు కోళ్లకు పెట్టవలెను. కొందఱు పండితులు ఆగ్రభాగమునుండి పిండములనెత్తవలెననిరి. బ్రాహ్మణానుజ్ఞ పొంది పిండోద్ధరణము చేయవలెను. ఇది యథావిధిగ ఋషులు చెప్పిన శ్రాద్ధవిధానము. ఇంకొకలాగు చేసిన దోషము కలుగుటయేగాక పితృదేవతలకు ముట్టదు. యవలు వ్రీహులు తిలలు గోధుమలు శనగలు పెసలు చామలు ఆవాలు నీవారములు హస్తిశ్యామాకములు ప్రియంగులు సతూలిక ప్రాసాతిక=అణువ్రీహి ఇవిశ్రాద్ధప్రశస్తములు. మామిడికాయ ఆమ్రాతకము భిల్వము దానిమ్మ బీజపూరము ప్రాచీనామలకము పాలు కొబ్బరి పరూషకము నారంగము (నారింజ) ఖర్జూరము ద్రాక్ష నల్లవెలగ పొట్ల ప్రియాలు= చారకర్కంధువు బదరము (రేగు) వితంకతము (కానరేగు)వత్సకము=కొడిసెచెట్టు కస్తాళువు వారకము వీని పండ్లను శ్రాద్ధమునందు పెట్టవలెను. ఆవుపాలు పెరుగు నెయ్యి నువ్వుల నూనె సైంధవ లవణము సముద్ర లవణము సారసము=సరోవరజలము వీనిని నివేదింపవలెను. చందనాగురుకుంకుమాది సుగంధములను కాలశాకము= కరివేము జాజి చంపకము లొద్దుగ మల్ల బాణ కుసుమము బర్బరి అశోకము వృంతాశోకము అటరూశము మామిడి తిలకము తామర గంధ సేఫాలిక కుబ్జకము తగరముఆరణ్య మృగమనునొక జాతిపువ్వుమొగలి యూధిక ఆలిముక్తము కమలము కుముదము పద్మము పుండరీకము ప్రయత్నపూర్వకముగ కొనివచ్చి పితరుల నర్చింపవలెను. నల్లగలువ ఎఱ్ఱగలువ కల్హావారము (ఎర్రతామర) కుష్టము మాంసి బాలకము కుక్కటి జాతివశ్రకము (జాపత్రి) నశిక ఉసీర ముస్తమలు గ్రంధివర్ణి మొదలైన పరిమళద్రవ్యములు పితృప్రీతికరములు. ఆగరుగుగ్గులు చందనము శ్రీవాసము మొదలగునవి పితృ యోగ్యములైన ధూపములు. ఋషి గుగ్గులము కూడ. రాజమాషములు (బొబ్బర్లు) శనగలు మసూరములు కోర దూషకములు విప్రషములు మర్కటములు కోద్రనములు అనునివి పితృతిధియందు నిషిద్ధములు. గేదెపాలు పెరుగు. తాటిపండు జంబీరము ఎర్రమారేడుపండు శాలఫలము నిషిద్దములు. పూతికము మృగనాభి గోరోచనం పద్మచందనము కాలేయకము ఉగ్రగంథము తురుష్కము పాలంకము వరుమచనుపత్రిక కుమారి కిరాతము పిండమూలికము గ్రుంజనము చుక్రికచుక్రము జీవశతపుష్ప నాలిక గంధశూకరము హలభృత్యము సర్షపము నీరుల్లి వెల్లుల్లి మానకందము విషకందము వజ్రకందము గదాస్థికము పురుషాల్వము పిండాలువు నిషిద్ధములు. ఆనప తిక్తపర్ణ గుమ్మడి(త్రికటుకము) కరకతిండి ఉసిరికను వార్తకము (వంకాయ) శివిజాతము. కాలీయము రక్తవాణ చిలికలకుచము విభీతకఫలము (తాండ్రము) ఆరనాలము. శుక్తము శీర్ణము పర్యుషితము ఉగ్రగంథము కోవిదారము (కాంచనవృక్షము) శిగ్రువు(ములగ)పనికిరావు.మిక్కిలిపులుపు పిచ్ఛిలము. సూక్ష్మము యాతయామము గతరనము మద్యగంధము ఇంగువచే నుగ్రగంధమైన పదార్థములుఫణిశము భూనింబము నింబము రాజికము కలింగదేశపుకుస్తుంబరువు(కొత్తిమిర)అవ్లుకేతనము(పుల్లప్రబ్బ)నిషిద్ధములు. దానిమ్మ మాగది నాగరము ఆర్ద్రక తిత్తిడి అమ్రాతకము జీవకము తుంబురువు అనునవి వినియోగింపవచ్చును. పాసము శాల్మలీముద్రములు (కజ్జికాయలు) మోచకాదులు పానకము తియ్యమామిడి పండ్లు ఆవుపాలు ప్రశస్తములు. రుచిగల్గి స్నిగ్ధములు కొలది పులుపు కొలది కారము గల పదార్థములు ప్రశస్తములు. కాఱువులుపు కాఱు ఉప్పు మిక్కిలి చేదు కారము గల ఆసుహారములను దరికి చేరనీయరాదు. స్వాదువులై దైవభోజ్యములయిన వానినే యేర్పరుపవలెను.
ఈ శ్రాద్ధకల్పము వారాహునిచేత తృష్టము దీతికి వారహశ్రాద్ధకల్పమను ప్రసిద్ధి కలదు. ఇందు నిషిద్ధపదార్ధములను శ్రాద్ధములందు బ్రాహ్మణులకు పెట్టరాదు. తినరాదు
ప్రాయశ్ఛిత్తములు
పళ్ళు దుంపలు పాలు పెరుగు మజ్జిగ గోమూత్రము గంజి ఏడురోజులు తీసుకొనినచో అభోజ్యాన్న భోజన దోషము పోవును. మరియొక విశేషము. విష్ణుభక్తుడు విధివిధానముగ నిట్లు శ్రాద్ధము పెట్టి ఆబ్రాహ్మస్తంబ పర్యంతమైన జగత్తును సంప్రీతి నందించును.
మునులు-తండ్రి బ్రతికియుండగ డండ్రియొక్క తలిదండ్రులు పోయినపుడు చేయవలసిన విధానమేమన తండ్రి బ్రతికియుండి ఎవనికి తద్దినము పెట్టునో కొడుకు దానిని స్వయముగ పెట్టవలెను. లౌకిక వైధిక ధర్మములు రెండును దీనివలన లోపింపవు. (తండ్రి తన తండ్రికి తద్దినము పెట్టుచుండ కొడుకు తాతకు తద్దినము పెట్టనక్కర లేదన్నమాట) తండ్రి పోయి పితామహుడు బ్రతికియున్నప్పుడు కొడుకు తండ్రికి పిండమువేసి పితామహునిచే భుజింపజేయవలెను. ప్రపితామహునినుద్ధేశించి పిండిమును వేయవలెను. ఇది శాస్త్రనిర్ణయము. పోయినవారికి పిండము పెట్టవలెను. ఉన్నవారికి అన్నము పెట్టవలెను. సపిండీకరణము పార్వణశ్రాద్ధము వీనియందు లేవు. పితృమేధ కల్పమనుసరించి ఆచారము పాటించినవాడు ధనధాన్య ఆయురారోగ్య పుత్రపౌత్రాదులతో వర్థిల్లును. ఈ పితృమేధాధ్యాయమును శ్రాద్ధకాలమందు పఠించినయెడల ఆ యజమాని ఇడిన అన్నమును పితృదేవతలు మూడుయుగము లనుభవింతురు. ఈపితృమేథకల్పము పాపహరము. పుణ్యవివర్థనము శ్రాద్ధములందు దీనిని కీర్తింపవలెను. శ్రద్ధతో వినవలెను.
ఇది బ్రహ్మపురాణమందు శ్రాద్ధకల్పనిరూపణమందు నూట పద్నాల్గవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹