Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – ఏడవ అధ్యాయం

దేవపూజా విధానం – వజ్రనాభ మండలం విష్ణు దీక్ష, లక్ష్మీ పూజ

రుద్రదేవా! ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. వృషభధ్వజా! గ్రహదేవతల మంత్రాలివి

ఓం నమః సూర్యమూర్తయే

ఓం హ్రాం హ్రీం సః సూర్యాయనమః

ఓం సోమాయ నమః

ఓం మంగలాయ నమః

ఓం బుధాయ నమః

ఓం బృహస్పతయే నమః

ఓం శుక్రాయ నమః

ఓం శనైశ్చరాయ నమః

ఓం రాహవే నమః

ఓం కేతవే నమః

ఓం తేజశ్చండాయ నమః

ఈ మంత్రాలను చదువుతూ ఆసన, ఆవాహన, పాద్య, అర్ఘ్య. ఆచమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప ధూప, దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి.

శివపూజను ఇలా చేయాలి

ఓం హ్రాం శివాయనమః

అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి.

ఓం హ్రాం శివమూర్తయే శివాయ నమః

మంత్రంతో నమస్కారం చేసి ఓం హ్రాం హృదయాయ నమః ఓం హ్రీం శిరయే స్వాహా

ఓం హ్రూం శిఖాయై వషట్

ఓం హ్రీం కవచాయ హుం

ఓం హొం నేత్రత్రయాయ వౌషట్ ఓం హ్రః అస్త్రాయ నమః

అనే మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. తరువాత

ఓం హ్రాం సద్యోజాతాయ నమః

ఓం హ్రీం వామదేవాయ నమః

ఓం హ్రూం అఘోరాయ నమః

ఓం ప్రైం తత్పురుషాయ నమః

ఓం హొం ఈశానాయ నమః

అనే మంత్రాలతో ఆయన పంచముఖాలనూ పూజించాలి..

ఇలాగే విష్ణుదేవుని పూజించునపుడు

ఓం వాసుదేవాసనాయ నమః మంత్రంతో విష్ణుని ఆసనాన్ని పూజించాలి. ఆ తరువాత

ఓం వాసుదేవమూర్తయే నమః

ఓం అం ఓం నమోభగవతే వాసుదేవాయ నమః

ఓం ఆం ఓం నమోభగవతే సంకర్షణాయ నమః

ఓం అం ఓం నమోభగవతే ప్రద్యుమ్నాయ నమః

ఓం అః ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమః

అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం

ఓం నారాయణాయ నమః

ఓం తత్సద్ బ్రహ్మణే నమః

ఓం హ్రూం విష్ణవే నమః

ఓం క్రౌం నమోభగవతే నృసింహాయనమః

ఓం భూః ఓం నమోభగవతే వరాహాయ నమః

ఓం కంటం వంశం వైన తేయాయ నమః

ఓం సుదర్శనాయ నమః

ఓం ఖంఠంఫంషం గదాయై నమః

ఓం వం లం మం క్షం పాంచజన్యాయ నమః

ఓం ఘం ఢం భం హం శ్రియై నమః

ఓం గండం వంసం పుష్యై నమః

ఓం ధం షం వంసం వనమాలాయై నమః

ఓం సం దం లం శ్రీ వత్సాయ నమః

ఓం కౌస్తుభాయ నమః

ఓం గురుభ్యో నమః

ఓం ఇంద్రాది భ్యోనమః

ఓం విష్వక్సేనాయ నమః

అనే మంత్రాలతో భగవంతుడైన శ్రీహరి అవతారాలనూ, ఆయుధాలనూ, వాహనాదులనూ నమస్కారం చేస్తూ పూజించి శివపూజలో వలెనే ఆసనాది ఉపచారాలను సమర్పించాలి.

శంకర దేవా! విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీ దేవి ప్రముఖమైనది. ఆమెనూ మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యై నమః అనే మంత్రం ద్వారా నమస్కారంచేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చేయాలి.

ఓం హ్రాం హృదయాయ నమః

ఓం హ్రీం శిరసే నమః

ఓం హ్రూం శిఖాయై నమః

ఓం హ్రీం కవచాయ నమః

ఓం హౌం నేత్రత్రయాయనమః

ఓం హ్రః అస్త్రాయ నమః

సరస్వతీ దేవి యొక్క ఎనిమిది శక్తులైన శ్రద్ధాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి.

ఓం హ్రీం శ్రద్ధాయై నమః

ఓం హ్రీం బుద్ద్యై నమః

ఓం హ్రీం కలాయై నమః

ఓం హ్రీం మేధాయై నమః

ఓం హ్రీం తుష్యై నమః

ఓం హ్రీం పుష్యై నమః

ఓం హ్రీం ప్రభాయై నమః

ఓం హ్రీం మత్యై నమః

తరువాత క్షేత్రపాలునికీ, గురువుకీ, పరమ గురునికీ ఈ మంత్రాలతో పూజలు చేయాలి.

ఓం క్షేత్రపాలాయ నమః

ఓం గురుభ్యో నమః

ఓం పరమ గురుభ్యో నమః

తరువాత సరస్వతీ దేవికి కమలవాసినీ రూపంలో ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయించాలి.

సదాశివాదులారా! విష్ణుభగవానుని విశేషపూజకై అయిదు ప్రకారాలు రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభమండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో పదహారు కోష్ఠకాలతో నిర్మించాలి.

వజ్రనాభ మండలం తయారు కాగానే న్యాసం చేసుకొని శ్రీహరిని పూజించాలి.

హృదయ మధ్యంలో విష్ణుభగవానుని, కంఠంలో సంకర్షణుని, శిరంపై ప్రద్యుమ్నుని, శిఖాభాగంలో అనిరుద్ధుని, సంపూర్ణ శరీరంలో బ్రహ్మనీ, రెండు చేతులలో శ్రీధరునీ భావించుకొని న్యాసం చేసుకోవాలి. తరువాత అహం విష్ణుః అని ధ్యానం చేస్తూ పద్మంలో (మండలంలో నిర్మింపబడిన పద్మంలో) కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణునీ, దక్షిణంలో ప్రద్యుమ్నునీ, పశ్చిమంలో అనిరుద్ధునీ, ఉత్తరంలో బ్రహ్మదేవునీ స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువ నిచ్చిన దిక్కులలో నిలపాలి.

ఓం ఇంద్రాయ నమః ఇంద్రుని – తూర్పులో

ఓం అగ్నయే నమః అగ్ని – ఆగ్నేయంలో

ఓం యమాయనమః యముని – దక్షిణంలో

ఓం నిరృతయే నమః నిరృతిని – నైఋతిలో

ఓం వరుణాయ నమః వరుణుని – పశ్చిమంలో

ఓం వాయవే నమః వాయువుని – వాయవ్యంలో

ఓం కుబేరాయ నమః కుబేరుని – ఉత్తరంలో

ఓం ఈశానాయ నమః ఈశ్వరుని – ఈశాన్యంలో

స్థాపించిన తరువాత అందరు దేవతలనూ గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీని వలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది.

దేవగణములారా! దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన రెండు కన్నులనూ మూసుకొని దేవతల మూలమంత్రాలను పఠిస్తూ నూట ఎనిమిది ఆహుతులను అగ్నిలోనివ్వాలి. పుత్ర లాభమును కోరుకొనేవారు దానికి ద్విగుణంగా అంటే రెండు వందల పదహారు ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనాసిద్ధికైతే మూడు రెట్లు (మూడు వందల ఇరవై నాలుగు) మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే నాలుగు రెట్లు అనగా నాలుగు వందల ముప్పది రెండు ఆహుతులు అవసరం. (దేశికుడనగా ఉపదేశమిచ్చే ఆచార్యుడు)

విద్వాంసుడైన దేశికుడు అన్నిటికన్న ముందు భగవంతుని ధ్యానించాలి. తరువాత వాయవ్యం వైపు తిరిగి ”యం” అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి ”రం” అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను. తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారుణీ దిశగా తిరిగి ”వం” అనే బీజ మంత్రం ద్వారా హృదయస్థితినీ ధర్మాభిరుచినీ విచారించుకోవాలి. తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానమనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అపుడు ఓంకారాన్ని జపిస్తూ వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్త్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తరువాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడవుతాడు.

మండలాదికములను నిర్మించుకోవడం సాధ్యం కానపుడు సాధకుడు తన మానస మండలాన్ని తానే కల్పించుకొని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చును. శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలుంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానసమండలానికి కూడ నాలుగు ద్వారాలుంటాయి. చేతిని పద్మంగానూ వ్రేళ్ళను పద్మపత్రాలుగానూ, హస్తమధ్యాన్ని కర్ణిక గానూ, గోళ్లను కేసరాలుగానూ భావించుకొనే సాధకుడు తన హస్తరూపియైన కమలంలోనే సూర్య, చంద్ర, ఇంద్ర, అగ్ని, యమాది పరివేష్టితుడైన శ్రీహరిని కల్పించుకొని పూజించుకోవచ్చును.

ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణువుంటాడు కాబట్టి ఆ హస్త స్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలూ, అజ్ఞానమూ కూడా పటాపంచలై పోతాయి. అపుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో బాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో గొనిపోవాలి.

శక్తిస్వరూపులైన ఓ శివాదిదేవతలారా! ఇక శ్రీలక్ష్మీ సిద్ధిప్రాప్తి విధివిధానాలు చూద్దాం. దీనిని స్టండిలాదులపై చేస్తారు. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మింపబడి చదును చేయబడి పవిత్రీకరింపడిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలమంటారు. ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమః అని జపించి శ్రాం శ్రీం శ్రూం శైల శ్రౌం శ్రః

అనే బీజాక్షరాలను మంత్రానికి జోడిస్తూ క్రమంగా హృదయ, శిర, శిఖ, కవచ, నేత్ర, అస్త్రాలలో ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకోవాలి.

ఓం శ్రాం హృదయాయ నమః

ఓం శ్రీం శిరసే స్వాహా

ఓం శ్రూం శిఖాయై వషట్

ఓం క్రైం కవచాయ హుం

ఓం క్రౌం నేత్రత్రయాయ వౌషట్

ఓం శ్రః అస్త్రాయ ఫట్

సాధనారతుడైన భక్తుడు అంగన్యాసం తరువాత శ్రీమహాలక్ష్మిని పూజించాలి.

సమస్త శరీరాన్నీ రక్షిస్తూ, ప్రతి భక్తుని చుట్టూ ఒక ఆవరక శక్తి వుంటుంది. దాన్ని ”అస్త్ర” అంటారు. వ్యాసం చేసినపుడు ఈ శక్తిని రెండు చేతులలో కల్పన చేసుకోవాలి. తరువాత ఒక మండలాన్ని నిర్మించి నాలుగు రంగులు అద్ది గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి. దానికి అరవై నాలుగు రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒక వైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలనూ విష్ణుపూజలో వలెనే స్థాపించాలి. హవనమూ చేయాలి. తరువాత

ఓం ఘం టం డం హం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి..

అటు పిమ్మట సాధకుడు

ఓం సౌం సరస్వత్యై నమః

ఓంహ్రీం సౌం సరస్వత్యై నమః

ఓం హ్రీం వద్ద వద వాగ్వాదిని స్వాహాః

ఓం హ్రీం సరస్వత్యై నమః.

అను మంత్రములను ఉచ్చరించి సరస్వతీ దేవికి నమస్కరించాలి.

ఏడవ అధ్యాయం సంపూర్ణం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment