విష్ణు పంజర స్తోత్రం:
శ్రీహరి ఇంకా ఇలా చెప్పసాగాడు “హే రుద్రదేవా! పరమకల్యాణకారియైన విష్ణు పంజర స్తోత్రాన్ని వచిస్తాను, వినండి.
ప్రవక్ష్యామ్యధునా హ్యేత ద్వైష్ణవం పంజరం శుభం ॥
నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం ॥
ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణాత్వామహం శరణం గతః
గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే ॥
యామ్యాం రక్షస్వమాం విష్ణోత్వా మహం శరణం గతః
హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ ॥
ప్రతీచ్యాం రక్షమాం విష్ణాత్వామహం శరణం గతః
ముసలం శాతనం గృహ్య పుండరీకాక్షరక్షమాం ॥
ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః ॥
ఖడ్గమాదాయ చర్మాథ అస్త్రశస్త్రాదికం హరే ॥
నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః |
పాంచజన్యం మహాశంఖమనుఘోష్యంచ పంకజం ||
ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞశూకర |
చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా ||
నైరృత్యాం మాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్ |
వైజయంతీం సంప్రగృహ్య శ్రీ వత్సంకంఠ భూషణం ||
వాయవ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తుతే |
వైనతేయం సమారూహ్య త్వంతరిక్షే జనార్ధన |
మాం రక్ష స్వాజిత సదా నమస్తే స్త్వ పరాజిత |
విశాలాక్ష సమారూహ్య రక్ష మాంత్వం రసాతలే !
అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే ||
కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహు పంజరం ||
”పంజరమనగా “రక్షించునది” అని అర్థము. విష్ణువను పేరు గల రక్షకుడు మనం ఈ స్తోత్రం చేస్తే మనను రక్షిస్తాడు.
కృత్వారక్ష స్వమాం విష్ణో నమస్తే పురుషోత్తమ ||
ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్!
పురారక్షార్థ మీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ |
నాశయామాస యేన చామరం మహిషాసురం ॥
దానవం రక్తబీజంచ అన్యాంశ్చ సురకంటకాన్!
ఏతజ్జపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా ॥
(ఈ స్తోత్రంలో యజ్ఞశూకర శబ్దం వాడబడింది. వామన పురాణం పదిహేడవ అధ్యాయంలో కూడ ఇదే పదం వరాహస్వామిపరంగా వాడబడింది. విశాలాక్షశబ్దం గరుడవంశ విశేషమని శబ్దకల్పద్రుమంలో కనిపిస్తోంది. అలాగే ఆకూపారమనగా మేదినీకోశం ప్రకారం కూర్మావతారం)
పరమశివా! ప్రాచీన కాలంలో సర్వ ప్రథమముగా నేనీ విష్ణు పంజర నామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయని దేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై అమరులనే ఒక ఆట ఆడించి గెలిచి నిలిచిన మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షస వీరులను నిర్మూలించగలిగింది. దీనిని అనగా ఈ విష్ణు పంజర నామక స్తుతిని మంత్రం వలె శ్రద్ధాభక్తులతో జపించు మానవులు జీవితంలో ప్రతి దశలోనూ విజయాన్నే పొందుతారు.
పదవ అధ్యాయం సంపూర్ణం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹