శ్రీ గోపాలదేవుని పూజ – శ్రీధర పూజ త్రైలోక్యమోహన మంత్రం
ఋషులారా! నేనిపుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములు గోపాల, శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొఱకొక మండలాన్నేర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగాయమునలనూ, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత, విధాతలనూ పూజించాలి.
తరువాత లక్ష్మి, శంఖం, పద్మనిధి, శారంగధనువు, శరభాలను పూజించాలి. ఆ తరువాత తూర్పు దెసలో భద్ర, సుభద్రలకూ, దక్షిణ దిశలో చండ ప్రచండులకూ, పడమటి దిక్కున బల, ప్రబలులకూ, ఉత్తరం వైపున జయ విజయులకూ పూజలు చేయాలి. పిమ్మట నాలుగు ద్వారాలలో క్రమంగా లక్ష్మి, గణపతి, దుర్గ, సరస్వతమ్మలను పూజించాలి.
మండలం ఆగ్నేయాది కోణాల్లో పరమ భాగవతోత్తముడైన నారదునీ, సిద్ధులనూ, గురుగ్రహాన్నీ, నలకూబరునీ స్థాపించి పూజించాలి. తూర్పు వైపు విష్ణువునీ విష్ణుశక్తినీ అర్చించాలి. మండలంలో విష్ణు పరివారాన్ని స్థాపించి పూజించాలి.
మండలమధ్యంలో శక్తి కూర్మ, అనంత, పృథ్వి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య మూర్తులకు ఆగ్నేయాది కోణాల్లో పూజలు చేయాలి. వాయవ్య కోణంలోనూ ఉత్తర దిశలోనూ ప్రకాశ, ఐశ్వర్యాలను పూజించాలి.
‘గోపీజన వల్లభాయ స్వాహా’ ఇది గోపాల మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ మండలంలో తూర్పుతో మొదలెట్టి క్రమంగా ఎనిమిది వైపులా కృష్ణపత్నులైన సుశీల, జాంబతి, రుక్మిణి, సత్యభామ, సునంద, నాగ్నజితి, లక్షణ, మిత్రవిందలను స్థాపించి ఆ తరువాత వారిని పూజించాలి. వెంటనే శ్రీ గోపాలదేవుని శంఖ, చక్ర, గద, పద్మ, ముసల, ఖడ్గ, పాశ, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, ముకుట, వనమాలాది చిహ్నాలను పూజించాలి. పిమ్మట ఇంద్రాది ధ్వజపాలక దిక్పాలకునూ, విష్వక్సేనుని, లక్ష్మీసహిత శ్రీకృష్ణ భగవానునీ అర్చించాలి.
గోపీ జన వల్లభమంత్రాన్ని జపించి, ధ్యానించి, సాంగోపాంగంగా ఆయన పూజను పై విధంగా చేసేవారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.
త్రైలోక్యమోహన శ్రీధరీయ మంత్రం :-
ఓం శ్రీం (లేదా శ్రీః) శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః I
క్లీం పురుషోత్తమాయ త్రైలోక్య మోహనాయ నమః |
ఓం విష్ణవే త్రైలోక్య మోహనాయ నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం త్రైలోక్యమోహనాయ విష్ణవే నమః |
ఈ మంత్రం సమస్త ప్రయోజనాలనూ సంపూర్ణంగా కలిగిస్తుంది.
మహర్షులారా! ఇపుడు శ్రీధరభగవానుని అనగా విష్ణుదేవుని మంగళమయమైన పూజా విధానాన్ని వర్ణిస్తాను. సాధకుడు ముందుగా ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసమును చేయాలి.
ఓం శ్రాం హృదయాయ నమః,
ఓం శ్రీం శిరసే స్వాహా,
ఓం శ్రూం శిఖాయై వషట్,
ఓం క్రైం కవచాయ హుం,
ఓం క్రౌం, నేత్రత్రయాయ వౌషట్,
ఓం శ్రః అస్త్రాయ ఫట్.
అనంతరం శంఖ, చక్ర, గదాది స్వరూపిణీ ముద్రలను ప్రదర్శించి వాటిని ధరించి యున్న ఆత్మస్వరూపుడైన శ్రీధర భగవానుని ఇందాకటి మంత్రంతో ధ్యానించాలి. స్వస్తిక లేదా సర్వతో భద్రమండలాన్ని సిద్ధం చేసి శ్రీ భగవానుని ఆసనాన్ని పూజించి ఆ స్వామిని ఓం శ్రీధరాసన దేవతా ఆగచ్ఛత అని ఆవాహనం చేయాలి.
ఈ క్రింది మంత్రాలతో ఆసన పూజ చేయాలి.
ఓం సమస్త పరివారాయాచ్యుతా సనాయ నమః-
ఆపై
ఓం ధాత్రే నమః,
ఓం విధాత్రే నమః
లతో మొదలెట్టి ధాతా విధాతా గంగాది దేవతలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి.
ఓం గంగాయై నమః,
ఓం యమునాయై నమః,
ఓం ఆధార శక్యై నమః,
ఓం కూర్మాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం పృథివ్యై నమః,
ఓం ధర్మాయ నమః,
ఓం జ్ఞానాయ నమః,
ఓం వైరాగ్యాయ నమః,
ఓం ఐశ్వర్యాయ నమః,
ఓం ధర్మాయ నమః
ఓం అజ్ఞానాయ నమః,
ఓం అవైరాగ్యాయ నమః,
ఓం అనైశ్వర్యాయ నమః,
ఓం కందాయ నమః,
ఓం నాలాయ నమః,
ఓం పద్మాయ నమః,
ఓం విమలాయై నమః,
ఓం ఉత్కర్షిణ్యై నమః,
ఓం జ్ఞానాయై నమః,
ఓం క్రియాయై నమః,
ఓం యోగాయై నమః,
ఓం ప్రహ్వ్యై నమః,
ఓం సత్యాయై నమః,
ఓం ఈశానాయై నమః,
ఓం అనుగ్రహాయై నమః,
మరల శ్రీధర దేవుని ఇలా అంటూ ఆవాహన చేసి పూజ చేయాలి.
ఓం హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః ఆగచ్ఛ |
ఈ పూజానంతరము లక్ష్మీదేవిని ఓం శ్రియై నమః అంటూ పూజించాలి. ఆ తరువాత ఈ క్రింది మంత్రాలతో షడంగ న్యాసం చేయాలి.
ఓం శ్రాం హృదయాయ నమః,
ఓం శ్రీం శిరసే నమః,
ఓం శ్రూం శిఖాయై నమః,
ఓం క్రైం కవచాయ నమః,
ఓం క్రౌం నేత్రత్రయాయ నమః,
ఓం త్రః అస్త్రాయ నమః’
అనంతరము స్వామివారి ఆయుధాలనూ ఆభరణాలనూ అవరోధ వ్రాతము (పరివారము) నూ ఈ మంత్రాలతో అర్చించాలి.
ఓం శంఖాయ నమః,
ఓం పద్మాయ నమః,
ఓం చక్రాయ నమః,
ఓం గదాయై నమః,
ఓం శ్రీవత్సాయ నమః,
ఓం కౌస్తుభాయ నమః,
ఓం వనమాలాయై నమః,
ఓం పీతాంబరాయ నమః,
ఓం బ్రహ్మణే నమః,
ఓం నారదాయ నమః,
ఓం గురుభ్యో నమః,
ఓం ఇంద్రాయ నమః,
ఓం అగ్నయే నమః,
ఓం యమాయ నమః,
ఓం నిరృతయే నమః,
ఓం వరుణాయ నమః,
ఓం వాయవే నమః,
ఓం సోమాయ నమః,
ఓం ఈశానాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం బ్రహ్మణే నమః,
ఓం సత్త్వాయ నమః,
ఓం రజసే నమః,
ఓం తమనే నమః,
ఓం విష్వక్సేనాయ నమః
ఈ దేవస్వరూపాలను షడంగన్యాస, అస్త్రపూజలతో తృప్తిపఱచిన పిమ్మట విష్ణుభగవానుని మూర్తిని అభిషేకించి వస్త్ర యజ్ఞోపవీతాలతో సింగారించి గంధ పుష్ప ధూప దీపాలను నివేదించి ప్రదక్షిణ చేయాలి. నైవేద్యం పెట్టి,మూలమంత్రాన్ని నూట యెనిమిదిమార్లు జపించి దాని ఫలాన్ని కూడా శ్రీధరభగవానునికి సమర్పించి వేయాలి.
ఒక ముహూర్తం పాటు కనులు మూసుకొని సాధకుడు తన హృదయ దేశంలో పరిశుద్ధ స్ఫటిక మణి సమాన కాంతులతో విరాజిల్లువాడు, కోట్ల సూర్యుల ప్రభలతో వెలుగొందువాడు, ప్రసన్నముఖుడు, సౌమ్యముద్రలోనుండువాడు, ధవళ మకర కుండలాలతో శోభిల్లువాడు, ముకుటధారి, శుభలక్షణ సంపన్నములైన అంగములు గలవాడు, వన మాలాలంకృతుడునగు శ్రీధర దేవుని పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించాలి. తరువాత ఈ క్రింది స్తోత్రాన్ని చదవాలి.
శ్రీనివాసాయ దేవాయ నమః
శ్రీపతయే నమః ||
శ్రీధరాయ సశారంగాయ
శ్రీప్రదాయ నమో నమః ||
శ్రీవల్లభాయ శాంతాయ
శ్రీమతే చనమో నమః ||
శ్రీ పర్వత నివాసాయ నమః
శ్రేయస్కరాయ చ ||
శ్రేయసాం పతయే చైవ
హ్యాశ్రయాయ నమో నమః ||
శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః
స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం విసర్జయేత్ ॥
విష్ణువు శివునికి ఈ విధంగా ఉపదేశించాక శివుడు అత్యంత దుస్తరమైన భవసాగరాన్ని సులువుగా దాటించే పూజావిధానమేదైనా వినిపించుమని అభ్యర్థించాడు. దానికి విష్ణువు. ఇలా చెప్పాడు (అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు).
మరొక విష్ణు పూజ వుంది. ఇది భోగమోక్షాలను అలవోకగా అందిస్తుంది. ఈ పూజా విధానంలో సాధకుడు ముందుగా స్నానం చేసి సంధ్య వార్చుకొని యజ్ఞ మండపంలో ప్రవేశించాలి. కాళ్ళూ చేతులూ కడుక్కొని శాస్త్రోక్తంగా ఆచమనం చేసి న్యాస విధిననుసరిస్తూ రెండు చేతుల ద్వారా వ్యాపకరూపంలో మూల మంత్రము యొక్క కరన్యాసం చేయాలి. హే రుద్రదేవా! విష్ణు దేవుని మూలమంత్రం ఇది :-
‘ఓం శ్రీ హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః’
ఇది దేవాధిదేవుడు, పరమేశ్వరుడునగు విష్ణువాచకం. ఇది సర్వరోగహర్త, సమస్త గ్రహశమకర్త, సర్వపాప వినాశకం, భక్తి, భుక్తి, ముక్తి ప్రదాయకం. తరువాత ‘ఓం హాం హృదయాయ నమః’తో మొదలెట్టి ‘అస్త్రాయ ఫట్’ దాకా గల మంత్రాలతో అంగన్యాసం చేసుకోవాలి.
తరువాత సంయమియై ఆత్మముద్రను ప్రదర్శించాలి. హృదయగుహలో అతులిత కాంతులతో విరాజిల్లుతున్న శంఖ చక్రధారి, కుందపుష్ప, చంద్రకాంతి శోభితుడు, శ్రీవత్స కౌస్తుభ సమన్వితుడు, వనమాల, రత్నహారాలంకృతుడునగు విష్ణుభగవానుని కనులు మూసుకొని, మనసులో మనసుతో చూసి మనసారా ధ్యానించాలి.
తరువాత ”విష్ణుమండల స్థితులైన దేవగణులారా, పార్షదులారా, శక్తులారా! మీ అందరినీ ఆదరంతో ఆవాహన చేస్తున్నాను. ఇక్కడికి దయచేయండి”అని ఈ మంత్రాల ద్వారా ఆవాహన చేయాలి.
ఓం సమస్త పరివారాయాచ్యుతాయ నమః,
ఓం ధాత్రే నమః,
ఓం విధాత్రే నమః,
ఓం గంగాయై నమః,
ఓం యమునాయై నమః,
ఓం శంఖ నిధయే నమః
ఓం పద్మనిధయే నమః,
ఓం చండాయ నమః,
ఓం ప్రచండాయ నమః,
ఓం ద్వారాశ్రయై నమః,
ఓం ఆధార శక్యై నమః,
ఓం కూర్మాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం శ్రియై నమః,
ఓం ధర్మాయ నమః,
ఓం జ్ఞానాయ నమః,
ఓం వైరాగ్యాయ నమః,
ఓం ఐశ్వర్యాయ నమః,
ఓం అధర్మాయ నమః,
ఓం అజ్ఞానాయ నమః,
ఓం అవైరాగ్యాయ నమః,
ఓం అనైశ్వర్యాయ నమః,
ఓం సం సత్వాయ నమః,
ఓం రం రజసే నమః,
ఓం తం తమనే నమః,
ఓం కం కందాయ నమః,
ఓం నం నాలాయ నమః,
ఓం లాం పద్మాయ నమః,
ఓం అం అర్క మండలాయ నమః,
ఓం సోం సోమమండలాయ నమః,
ఓం వం వహ్నిమండలాయ నమః,
ఓం విమలాయై నమః,
ఓం ఉత్కర్షిణ్యై నమః,
ఓం జ్ఞానాయై నమః,
ఓం క్రియాయై నమః,
ఓం యోగాయై నమః,
ఓం పద్మ్యై నమః,
ఓం సత్యాయై నమః,
ఓం ఈశానాయై నమః,
ఓం అనుగ్రహాయై నమః
ఈ నామ మంత్రాలతో, గంధ పుష్పాది ఉపచారాల ద్వారా పైన చెప్పబడినదేవతలందరినీ నమస్కారపూర్వకంగా పూజించాలి.
తదనంతరం పాప వినాశకుడైన, పరమేశ్వరుడైన విష్ణుభగవానుని మండలంలోకి ఆవాహన చేసి ఈ విధంగా పూజించాలి. ముందు మన శరీరంతో న్యాసం చేసినట్లుగానే ఇప్పుడు ప్రతిమతో చేయాలి. ముద్రాప్రదర్శన, అర్ఘ్య పాద్యాది ఉపచారాలతో పూజ చేసి, ప్రతిమకు, స్నాన, వస్త్ర, ఆచమన, గంధ, పుష్ప, ధూప, దీపాదులను సమర్పించి నైవేద్యంగా ‘చరు’ని పెట్టాలి.
ఆ మహాదేవునికి భక్తిగా ప్రదక్షిణ చేయాలి. తరువాత ఆయన మూల మంత్రాన్ని నూటయెనిమిది మార్లు జపించి ఆ జపాన్ని కూడా ఆయనకు అర్పించాలి. మరల ఆయన హృదయాదులను (ఓం హాం హృదయాయ నమః నుండి హః అస్త్రాయ నమః దాకా) అలంకార, ఆయుధాదులను (శంఖం నుండి శారంగం దాకా)
ఓం శంఖాయ నమః,
ఓం పద్మాయ నమః,
ఓం చక్రాయ నమః
ఓం గదాయై నమః,
ఓం శ్రీవత్సాయ నమః,
ఓం కౌస్తుభాయ నమః,
ఓం వనమాలాయై నమః,
ఓం పీతాంబరాయ నమః,
ఓం బ్రహ్మణే నమః,
ఓం నారదాయ నమః,
ఓం గురుభ్యో నమః,
ఓం ఇంద్రాయ నమః,
ఓం అగ్నయే నమః
ఓం యమాయ నమః,
ఓం నిరృతయే నమః,
ఓం వరుణాయ నమః,
ఓం వాయవే నమః,
ఓం సోమాయ నమః,
ఓం ఈశానాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం బ్రహ్మణే నమః,
ఓం సత్వాయ నమః,
ఓం రజనే నమః,
ఓం తమనే నమః,
ఓం విష్వక్సేనాయ నమః
పూజించి ఇతర దేవతలను కూడా ఇలా పూజించాలి.
ఓం శరాయ నమః,
ఓం బ్రహ్మణే నమః,
ఓం నారదాయ నమః,
ఓం పూర్వసిద్ధేభ్యో నమః,
ఓం భగవతేభ్యో నమః,
ఓం గురుభ్యో నమః,
ఓం పరమ గురుభ్యో నమః
అనంతరం దిక్పాలకులనూ, అనంతునీ, బ్రహ్మనీ సపరివారంగా ఆహ్వానించి ఈ మంత్రాలతో అర్చించాలి.
ఓం ఇంద్రాయ సురాధిపతే సవాహన పరివారాయ నమః,
ఓం అగ్నయే తేజో…ధిపతయే సవాహన పరివారాయ నమః,
ఓం యమాయ ప్రేతాధిపతయే సవాహన పరివారాయ నమః,
ఓం నిరృతయే రక్షా పతయే సవాహన పరివారాయ నమః,
ఓం వరుణాయ జలాధిపతయే సవాహన పరివారాయ నమః,
ఓం వాయవే ప్రాణాధిపతయే సవాహన పరివారాయ నమః,
ఓం సోమాయ నక్షత్రాధిపతయే సవాహన పరివారాయ నమః,
ఓం ఈశానాయ విద్యాధిపతయే సవాహన పరివారాయ నమః,
ఓం అనంతాయ నాగాధిపతయే సవాహన పరివారాయ నమః,
ఓం బ్రహ్మణే లోకాధిపతయే సవాహన పరివారాయ నమః,
ఓం వజ్రాయ హుం ఫట్ నమః,
ఓం శక్యై హుం ఫట్ నమః,
ఓం దండాయ హుం ఫట్ నమః,
ఓం ఖడ్గాయ హుం ఫట్ నమః,
ఓం పాశాయ హుం ఫట్ నమః,
ఓం ధ్వజాయ హుం ఫట్ నమః,
ఓం గదాయై హుం ఫట్ నమః,
ఓం త్రిశూలాయ హుం ఫట్ నమః,
ఓం చక్రాయ హుం ఫట్ నమః,
ఓం పద్మాయ హుం ఫట్ నమః, మరియు
ఓం వౌం విష్వక్సేనాయ నమః,
ఓం మహాదేవా! ఈ విధంగా అందరినీ మంత్రాల ద్వారా పూజల ద్వారా సంతోష పెట్టిన తరువాత మరలఅందరిలోనూ వ్యాపించియున్న వాసుదేవుడైన విష్ణుదేవుని ఇలా స్తుతించాలి.
విష్ణవే దేవ దేవాయ నమో వైప్రభవిష్ణవే ॥
విష్ణవే వాసుదేవాయ నమః స్థితి కరాయచ ||
గ్రసిష్ణవే నమశ్చైవ నమః ప్రళయశాయినే ||
దేవానాం ప్రభవే చైవ యజ్ఞానాం ప్రభవే నమః ||
మునీనాం ప్రభవే నిత్యం యక్షాణాం ప్రభవిష్ణవే ॥
జిష్ణవే సర్వ దేవానాం సర్వగాయ మహాత్మనే ||
బ్రహ్మేంద్ర రుద్రం వంద్యాయ సర్వేశాయ నమోనమః ॥
సర్వలోక హితార్థాయ లోకాధ్యక్షాయవై నమః ||
సర్వగోప్రే సర్వకర్తే సర్వదుష్ట వినాశినే ||
వరప్రదాయ శాంతాయ వరేణ్యాయ నమోనమః ||
శరణ్యాయ సురూపాయ ధర్మకామార్థదాయినే ||
శంకరదేవా! ఏ విధంగా బ్రహ్మ స్వరూపుడు, అవ్యయుడు, పరాత్పరుడునైన విష్ణుభగవానుని స్తుతించి సాధకుడు తన హృదయంలో ఆయనను చూడగలిగి ధ్యానించాలి. తరువాత మూలమంత్ర జపాన్ని చేస్తూ ధ్యానించాలి. ఈ రకంగా చేయగలిగిన వానికి విష్ణువు వశుడౌతాడు. హే రుద్రదేవా! ఈ విధంగా ఒక రహస్య పూర్ణ పరమగుహ్య, భుక్తి ముక్తి ప్రద, విష్ణు ఉత్తమ పూజా విధానాన్ని మీరు నాచే పలికించారు.
విద్వాంసుడైన పురుషుడీ పూజను పఠించగానే విష్ణుభక్తశ్రేష్ఠుడై వెలుగొందుతాడు. దీనిని విన్నవారు, చెప్పినవారు విష్ణులోక ప్రాప్తి నొందుతారు.
పందొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹