పంచతత్వార్చన – విధి
‘హే పరమాత్మా! తెలుసుకున్నంత మాత్రాననే సాధకునికి పరమపదాన్ని ప్రాప్తింప చేసే సారతత్త్వంలో భాగమైన పంచతత్వార్చన ఒకటున్నదని విన్నాను. మాపై దయ వుంచి దానిని ఉపదేశించండి’ అని కోరాడు శివుడు.
లోక కల్యాణం కోసం శంకరభగవానుని ఆరాటాన్ని అర్థం చేసుకున్న ఆదిదేవుడు ఆనందభరితుడై ఇలా చెప్పసాగాడు.
” వైష్ణవోత్తమ అని ఉండాలి.”సుప్రతుడవైన శంకరదేవా! మీకా పంచతత్త్వ పూజావిధిని తప్పక వినిపిస్తాను. ఎందుకంటే ఇది దివ్యం, మంగళస్వరూపం, కల్యాణకారి, రహస్యపూర్ణం, శ్రేష్ఠం, అభీష్ట సిద్ధిప్రదం, కలిదోష వినాశకం, పరమపవిత్రం.
హే సదాశివా! పరమాత్మయు, వాసుదేవుడునైన శ్రీహరి అవినాశి, శాంతుడు, సత్త్వస్వరూపుడు, “ధ్రువుడు, శుద్ధుడు, సర్వవ్యాపి, నిరంజనుడు. ఆ విష్ణుదేవుడే తన స్వీయమాయ యొక్క ప్రభావం ద్వారా అయిదు ప్రకారాలుగా కనిపిస్తున్నాడు. ఈ ప్రకారాలు అయిదు రూపాలుగా, తత్త్వముగా పూజింపబడుతూ ఉన్నాయి. విష్ణువు యొక్క పంచరూపాల వాచక మంత్రాలు వారి పేర్లతోనే ఇలా వుంటాయి.
ఓం అం వాసుదేవాయ నమః,
ఓం అం సంకర్షణాయ నమః,
ఓం అం ప్రద్యుమ్నాయ నమః,
ఓం అః అనిరుద్ధాయ నమః,
ఓంఓం నారాయణాయ నమః
సర్వపాతకాలనూ, మహాపాతకాలనూ నశింపజేసి పుణ్యాన్ని ప్రదానం చేసి, సర్వ రోగాలనూ దూరం చేసే, అయిదుగురు మహా దైవతముల వాచకాలే,ఈ పంచమంత్రాలు..
ఈ పంచదేవ పూజకై సాధకుడు ముందుగా స్నానం చేసి విధివత్తుగా సంధ్యవార్చి మరల కాలుసేతులు కడుగుకొని పూజామందిరలో ప్రవేశించి ఆచమనం చేసి తమ మనసుకు నచ్చిన ఆసనాన్ని వేసుకొని స్థిరంగా కూర్చుని అంక్షాం రం అనే మంత్రాలను ఉచ్చరిస్తూ శోషణాది క్రియలను చేయాలి. అనగా శరీరాన్ని పొడిగా చేసుకోవాలి.
శ్రీ వాసుదేవకృష్ణుడే ఈ జగత్తుకి స్వామి. పీతాంబర విభూషితుడు, సహస్ర సూర్య సమాన తేజఃసంన్నుడు, దేదీప్యమాన మకరాకృతిలో నున్న కుండల సుశోభితుడునగు ఆ శ్రీకృష్ణ భగవానుని ముందుగా ప్రతి హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి. తరువాత సంకర్షణ భగవానుని అనగా బలరామదేవుని, ఆపై యథాక్రమంగా ప్రద్యుమ్న, అనిరుద్ధ, శ్రీమన్నారాయణులను ధ్యానించాలి.
పిమ్మట ఆ దేవాధిదేవుని నుండి జనించిన ఇంద్రాది దేవతలను కూడా ధ్యానించాలి. మూలమంత్రం ద్వారా రెండు చేతులతో వ్యాపక రూపంలో కరన్యాసం అనంతరం అంగన్యాస మంత్రాలతో అంగన్యాసం నెరవేర్చి సర్వదేవత లనూ పూజించాలి. ఆ వ్యాస మంత్రాలనూ, పూజా మంత్రాలనూ వినిపిస్తాను, వినండి.
నిత్యుడు, అచలుడు అని అర్ధము తరువాత ఓం పద్మాయ నమః అంటూ స్వస్తిక, సర్వతోభద్రాది మండలాలను నిర్మించి ఆ మండలంలో ఇవే మంత్రాలతో దేవతలందరినీ పూజించాలి. మూలమంత్రాలతో పాద్యాది నివేదనాన్ని గావించి స్నాన, వస్త్ర, ఆచమన, గంధ పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులు నర్పించి, ఈ దేవతలకు నమస్కార ప్రదక్షిణలను గావించిన పిమ్మట యధాశక్తి పలుమార్లు మూలమంత్రాన్ని జపించి దాని ఫలాన్ని శ్రీకృష్ణ వాసుదేవ ప్రభునికి అర్పించాలి.
తరువాత వాసుదేవునికి నమస్కరిస్తూ ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి.
ఓం నమో వాసుదేవాయ నమః, సంకర్షణాయ చ ||
ప్రద్యుమ్నాయాది దేవాయానిరుద్ధాయ నమోనమః ||
నమో నారాయణాయైవ నరాణాం పతయే నమః ||
నరపూజ్యాయ కీర్త్యాయ స్తుత్యాయ వరదాయచ ||
అనాదినిధనాయై వ పురాణాయ నమోనమః ||
సృష్టి సంహారక కర్తేచ బ్రహ్మణః పతయే నమః ||
నమో వైవేద వేద్యాయ శంఖచక్రధరాయ చ ||
కలి కల్మష హఠేచ సురేశాయ నమోనమః ||
సంసార వృక్ష చ్ఛేత్రేచ మాయా భేత్రే నమో నమః ||
బహురూపాయ తీర్థాయ త్రిగుణాయ గుణాయచ ||
బ్రహ్మవిష్ణ్వాశరూపాయ మోక్షదాయ నమో నమః ||
మోక్షద్వారాయ ధర్మాయ
నిర్వాణాయ నమోనమః ||
సర్వకామ ప్రదాయైవ
పరబ్రహ్మ స్వరూపిణే ||
సంసార సాగర ఘోరే
నిమగ్నం మాం సముద్ధర ||
త్వదన్యోనాస్తి దేవేశ
నాస్తిత్రాతా జగత్ప్రభో ||
త్వామేవ సర్వగం విష్ణుం తోరణం తతః ||
జ్ఞానదీప ప్రదానేన
తమోముక్తం ప్రకాశయ ||
ఈ విధంగా సమస్త కష్టాలనూ దూరం చేసే దేవేశుడైన వాసుదేవ భగవానుని స్తుతించాలి. ఇతర వైదిక స్తుతులతో కూడా విష్ణు దేవుని హృదయంలో భావిస్తూ స్తుతించ వచ్చును. తరువాత విసర్జన చేసి మందిరంలో నుండి బయటికి రావాలి. ఈ పంచతత్వ యుక్తమైన విష్ణు పూజ సంపూర్ణ కామనలను నెరవేర్చే వాసుదేవుని పూజలలో సర్వశ్రేష్ఠంగా వ్యవహరింపబడుతోంది.
నీలలోహిత శివ మహాదేవా! ఈ పూజనొక్క మారు చేసినా మనిషి కృతకృత్యుడవుతాడు. దీనిని చదివినవారూ, విన్నవారూ, ఇతరులకు వినిపించినవారూ దేహాంతంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు”.
ఇరవయ్యవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹