వసిష్ఠ జనక సంవాదోప సంహారము
ఆ ప్రబుద్ధావస్థలో నుండు జీవుడు అవగక్తమును నిర్గణమునునగు ఇరువదియైదవ తత్త్వమును కూడ సగుణతత్త్వముగా భావించును. ఆతత్త్వమునందు ఆరోపింపబడు గుణము లను సృజించుచు ఉపసంహరించుచు ఉన్నట్లు కల్పనచేసికోనును. ఓజనకరాజా! ఆమూల తత్త్వము అజము జన్మరహితము ఐనను క్రీడార్థమై వికారములను పొందుచున్నాడు. తన్నుతాను అనేక తత్త్వముల రూపమున కల్పించుకొని నానా రూపముల నొందినవాడువలె చెప్పబడుచున్నాడు. ఇట్లు వికృతి నొందుచుండియు ఇట్లని వాస్తవ స్థితిని ఎరుగలేకున్నాడు. అవ్యక్త తత్త్వస్వరూపము ఇది యని తత్త్వబొధ చేయబడినవుడు జ్ఞాన సాధనదశలో అతడు బుధ్యమానుడు బోధమును జ్ఞనమును అందుకొనుచున్న వాడు అని వ్యవహరింపబుడు చున్నాడు. కాని ఇట్లు బోధింపడుచుండియు సగుణమైనదివలె కనబడు ఈ అవ్యక్తతత్త్వమును వాస్తవమున నిర్గుణమైనదానినిగా గుర్తింపలేకపొవుచున్నాడు. ఇరువదియైదవదియగు ఈ అవ్యక్తతత్త్వ స్వరూపమును దాని నిర్గుణత్వమును ఒకానొకప్పుడీతడు తెలిసికొన గలిగిన యెడల ప్రతిబుద్ధుడు అని వ్యవహరింపబడును. బుధ్యమాన దశలో జీవుడు మమకారావృతుడు. అన్నితత్తమలకును అతీతమగు ఇరువదియారవతత్త్వము విమలమును బుద్ధమును- జ్ఞానాత్మకమును ఆప్రమేయమును. ఇట్టిది అని ఎరుగశక్యముకానిది-ననాతనవ సస-శాశ్వతమైనది. దానిని గుర్తింపగలిగినప్పుడు సృష్టి ప్రళయధర్మయుక్తమగు ఇరువదియైదవ తత్త్వముగా నుండుటను గూడ అతిగతమై అతగున్నదదశనందుకొనును. అప్పుడీతడు వస్తుతః గుణరహితమును జడమునునగు ప్రకృతిని సగుణత్ము నొందిన దానినిగా గురైరుగును. తాను కేవల జ్ఞానాత్మకుడై అవ్యక్తతత్త్వమును గూడ వాస్తవ రూపమున దర్శింపగలుగును.
ఓ రాజా! తత్త్వముల నాశ్రయించిననేకాని నరుడు తత్త్వజ్ఞుడుకాజాలడు. నాయనా ! తత్త్వజ్ఞుడు సంసారగతులలో మునుగడు. తత్త్వములిరువదియైదని విద్వాంసులు చెప్పు చున్నారు. వీని లక్షణమును తెలిసికొన్నచో వీటిమూలతత్త్వమునుకూడ చేరగలుగను. ఏలయన- ఇరువదియారవది సర్వమూతత్త్వము. ఇతడు ఇదియే ఇరువదియారవ తత్త్వమని సరిగా గుర్తించినచో జరామరణములు లేక శుద్ధయోగబలముచే సమతాస్థితిని పొందును. సందేహములేదు. ఐనను అజ్ఞానానికి జ్ఞానబోధ చేయుటకై తత్త్వములు ఇరువదినాల్గేయని ఇరువదియైదేయని ఏకత్వమునుండి నానాత్వము జరిగిన విధము ఇదియని సాంఖ్య దర్శనము. ఎపుడుచేతన తత్త్వము కూడిన ఈ పంచవింశతితమ తత్త్వమయొక్క ఏకత్వము బుద్ధియందు స్థిరమై ఆవగతమై నిలుచునో అపుడు ముముక్షువు సమత్వము పొందును. ఏలయన నిఃసంగుడై యుండియు పరమాత్ముడు మాయాకృతమైన సంగవశమున నంసారములో వరిభ్రమించుచున్నాడు. మాయదూరమైనపుడు ముక్తినందు చున్నాడు. నిఃసంగరూపుడగు పంచవింశతితమతత్త్మును ఎరిగిన తరువాత అజుడగు- జన్మరహితు డగు-ఆ ఇరువదియారవ తత్త్వము నెరుగగలుగును. అవ్యక్త తత్త్వము నెరుగుటచేతనే ఈ పరమ విబోధము జ్ఞానము కలుగును. చతుర్వింశతి తత్త్వముల నెరుగుటకూడ ఈ ఇరువదియారవతత్త్వము నెరిగిముక్తి నందుటకు సాధనమే. ఓ అనముడవగు జనకరాజా! నీకిట్లు సాంఖ్య విధానమున బుద్ధ-బుద్యమాన-అప్రతిబుద్ధుల లక్షణములను తెలిపితిని. ఈ తెలిపిన తత్త్వముల-నానాత్వము-ఏకత్వముల సంబంధము చేపకునీటికిని -మేడికాయకు దానియందలి పురుగులకును- గలసంబంధము వంటిది. జ్ఞానము విజ్ఞానము అని వ్యవహరింపబటడు ముక్తి స్వరూపమిదియే. ఈ దేహమున సాక్షితత్త్ముగానున్న ఇరువది యైదవ అవ్యక్త తత్త్వము నెరుగనిదే ముక్తి కలుగదు. ఈ ఇరువది యారవతత్త్వము పరతత్త్వము పరమగు ధర్మము కలిగినది; ఏమాత్రమును ఆశుద్ధము కాని శుద్ధతత్త్ము; విశుద్ధ మగుధర్మముకలది; జ్ఞానశాలి; జ్ఞానాత్మకుడు; వాస్తవమున ఆలోచించినచో సర్వధర్మములనుండి విముక్తుడు; కాని సంయోగ వియోగ ధర్మములుకల ఈ చుతుర్వంశతితత్త్వాత్మకమగు ఈ ప్రకృతితో సంబధము కలుగుటవలన బుద్ధుడైనందున మరల దానినుండి విడివడినప్పుడు ముక్తి నందెనని వ్యవహరించుట, వాస్తవమున అతనికి బంధము మోక్షములేవు. అట్లతడు విమోక్షిగా- శుచికర్మునితో కలిసిశుచిగా విమలాత్మునితో కలిసి విమలాత్ముడుగా కేవలునితో కలిసికేవలాత్ముడుగా అగుచున్నాడు . స్వతంత్రునితో కలిసి స్వతంత్రుడై స్వాతంత్ర్యమును పొందుచున్నాడు.
ఓ మహారాజా! ఇంతవరకు నేను నీకిట్లు యథార్థతత్త్వము తెలిపితిని. నీవశను విశుద్ధమును ఆద్యమును సనాతనము-శాశ్వాతమును-అగు బ్రహ్మతత్త్వమును అమత్సరుడవై మనో దోషములేవియులేనివాడవై ప్రతి గ్రహించితివి. నీవును ఈ పరమ విద్యానుశాసనమును వేదనిష్ఠ-వేదములయందును శాస్త్రములయందును ప్రామాణ్యబుద్ధి- కలిగిప్రబోధము నొందుటకైప్రణతుడై తెలిసికొనగోరి ఆడిగిన వానికి మాత్రమే ఈయవలెను. అసత్యవాది – మోసగాడు- కపటబుద్ధి- ఆసమర్థుడు- జ్ఞానపరులగు పండితులను నొప్పించువాడు అగువానికీయరాదు- శిష్యులకు జ్ఞానము కలిగించుటకై నీవీవిద్యను శ్రద్ధకలవాడు సద్గుణ వంతుడు పరనిందచేయనివాడు వివేచనతో కూడిన శీలముకలవాడు వేదశాస్త్ర విధియందు ప్రీతికలవాడు వివాదములు చేయనివాడలు అనేక శాస్త్రములను పెద్దలవలన వినినవాడు వినయమును తెలుపు వేషముకలవాడు హేతువాదము చేయనివాడు -ఇట్టివానికి మాత్రమే తెలుపవలయును. విశుద్ధమగు వరబ్రహ్మతత్త్వమును ఈ సద్గుణములు లేనివాని కీయరాదు. ఇచ్చినచో అపాత్రదానమువలన ప్రవచనము చేసిన గురువునకు కూడ శ్రేయస్సు కలుగదు. వ్రతనియమములు లేనివాడు తాను సమస్తరత్నములతో ఈ భూమినంతటికి విద్యకు ప్రతిఫలముగా ఇత్తుననినను అట్టివానికి విద్యను బోధించరాదు. ఓనరేంద్రా! తత్త్వము నెరుగగోరి జితేంద్రియుడై ప్రయతుడైన-ఇంద్రియని గ్రహము శుచిత్వము కలిగిన-వానికి మాత్రమే ఇది బోధించవలెను. ఓజనకా! నీవు పరమ పవిత్రమును అత్యంతము శోకరహితమును అనాది మధ్యమును ఆగుబ్రహ్మతత్త్వమును వాస్తవముగ ప్రవచించగా వింటివి. నీకిక సంసారభయములేదు. ఈ తత్త్వము అగాధము- అజరామరము- దోషరహితము- భయరహితము- శుభకరము- పంవాదము అనుపేరుగల ఈ తత్త్వర్థము- తెలిసికొని మోహస్వరూపమునుగుర్తించి విడువుము.
ఓ రాజా! పూర్వము హిరణ్య గర్భబ్రహ్మ సనాతనపరమాత్మనుండి ఈ విద్యను గ్రహించెను. మహాతేజస్వియగు ఆబ్రహ్మనుండి నేను ఆయనను అనుగ్రహింపజేసికొని గ్రహించితిని. నీవడిగినందున నేను నీకిది ప్రతి పాదించితిని. ఇదియునేను బ్రహ్మవలన ఎంత ఎట్లు తెలిసికొంటినో అంతయ అట్లే తెలిపితిని కాని ప మాత్రము మార్చులు చేర్పులు చేయలేదు.
వ్యాసుడిట్లుమునులతో పలికెనుః ఓ మునిశ్రెష్ఠులారా! వసిష్ఠుడు పంచవింశతితమ తత్త్వసంబంధియగు తత్త్వమును ఇట్లు తెలిపెను. ఈ తత్త్వము ఎరిగినదని ద్వారమున షడ్వింశ- ఇరువదియారవ-తత్త్వమును చేరినవారికి జననమరణ రూపసంసారములో పునరావృత్తియుండదు. ఇది పరమమగు జ్ఞానము. దీనినిమించినజ్ఞానము లేదు. ఇది ఎరిగినవారు అజరామరమగు తత్త్వము చేరుదురు. ఓద్విజులారా! నిఃశ్రేయసకరమగు ఈ పరమజ్ఞానము దేవర్షియగు నారదునివలన వినినేనున్నదున్నట్లు మీకు తెలిపితిని. ఏలయన-హిరణ్య గర్భునినుండి వసిష్ఠుడును అతని నుండి నారదుడును అతనినుండి నేనును వింటిమి. దీనిని వినినందున మీకును సంసారములన శోకముకలుగదు. క్షరాక్షర తత్త్వమల భేదాభేదము నెరిగిన వారికి భయముండదు. ఎరుగని మూఢాత్ముడు మాత్రము అనేక జన్మపరంపరలనొంది మరలమరల ఉపద్రవముల పొందును. జననము- మరణము- దేవలోకము- నరకలోకాము- నరకలోకము- తిర్యగ్యోనులు- మనుష్య జన్మము ఇదే క్రమమున పునఃపునరావృత్తి పొందును. అవ్యక్తాగాధమగు అజ్ఞాన సముద్రమున మునుగును.
ఓముని శ్రేష్ఠులారా! నేనిట్లు మిగుల సారతమమగు పరతత్త్వమును మీకు తెలిపితిని. దీనిని తెలిసికొనినవారు పరమ మోక్షమును పొందుదురు. మరల జననమరణ పునరావృత్తి పొందరు. ఓవిప్రులారా! దీనిని నాస్తికుడు అభక్తుడు దుష్టమతి శ్రద్ధారహితుడు అగువానికి తెలుపరాదు.
ఇది శ్రీమహాపురాణమున అది బ్రాహ్మమున వసిష్ఠ జనక సంవాద సవాప్తినిరూపణమను నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹