దుర్గాదేవి స్వరూపం సూర్యధ్యానం మరియు మాహేశ్వరీ పూజన విధి
మహాదేవా! నవమి మున్నగు తిథులలో ‘ఓం హ్రీం దుర్గే రక్షిణి’ అనే మంత్రంతో పూజించాలి. మార్గశిర తదియనాడు మొదలుపెట్టి క్రమగా ఈ నామాలతో రోజుకొక్క స్వరూపంతో అమ్మవారిని పూజించాలి.
ఆ నామరూపాలేవనగా గౌరీ, కాళీ, ఉమా, దుర్గా, భద్రా, కాంతీ, సరస్వతీ, మంగళా, విజయా, లక్ష్మీ, శివా, నారాయణీశక్తులు. ఈ నామ, రూప, శక్తులు గల దేవిని పూజించువానికి ఇష్టవస్తు, ప్రియజన వియోగముండదు.
దుర్గాదేవికి పదునెనిమిది హస్తాలుంటాయి. వాటిలో ఖేటక, ఘంట, దర్పణ, ధను, ధ్వజ,డమరు, పరశు, పాశ, శక్తి, ముద్గర, శూల, కపాల, బాణ, అంకుశ, వజ్ర, చక్ర, శలాకలుండగా ఒకే చేయి తర్జనీ ముద్రలో వుంటుంది. అష్టాదశ భుజియైన దేవి స్వరూపాన్ని స్మరించిన వారికి అప్లైశ్వర్యాలూ అబ్బుతాయి. మహిషాసుర మర్దినియైన ఈ దేవి సింహంపై ఉంటుంది.
శివదేవా! సూర్యార్చన విధిలో సూర్యభగవానుని తేజః స్వరూపాన్ని, రక్త వర్ణ కాంతి రూపాన్ని, శ్వేత పద్మం పై స్థితుని, ఏకచక్ర రథంపై ఆసీనుని, ద్విభుజయుక్తుని, కమలధరుని ధ్యానించాలి.
మాహేశ్వరి పూజను వర్ణిస్తాను వినండి. ముందుగా స్నానం, ఆచమనం నిర్వర్తించి ఆసనంపై కూర్చుని న్యాసం చేసి ఒక మండలంలో మహేశ్వరుని చిత్రించి పూజించాలి. ఈ హరపూజను వీలైనంత ఎక్కువగా హరుని పరివారమంతటితో సహా చేయాలి.
‘ఓం హాం శివాసనదేవతా ఆగచ్ఛత’ అనే మంత్రంతో ఆసన దేవతలందరినీ ఆవాహనం చేసి, మండల ముఖ్యద్వారంలో స్నాన, గంధాదులతో ఈ క్రింది మంత్రాల ద్వారా ఆయా మంత్రాధి దేవతలను పూజించాలి.
ఓం హాం గణపతయే నమః,
ఓం హాం సరస్వత్యై నమః,
ఓం హాం నందినే నమః,
ఓం హాం మహాకాలాయ నమః,
ఓం హాం గంగాయై నమః,
ఓం హాం లక్ష్మ్యైనమః,
ఓం హాం మహాకాలాయై నమః,
ఓం హాం అస్త్రాయ నమః,
ఓం హాం బ్రహ్మణే వాస్త్వధిపతయే నమః,
ఓం హాం గురుభ్యో నమః,
ఆధారశక్తి నుండి అనైశ్వర్య శక్తి దాకా గల అన్ని మంత్రాలనూ (కూర్మ, పృథ్వి తప్ప) పంచతత్త్వ పూజలోలాగే చదివి, తరువాత
ఓం హాం ఊర్ధ్వచ్ఛందాయ నమః,
ఓం హాం అధశ్ఛందాయ నమః,
ఓం హాం పద్మాయ నమః,
ఓం హాం కర్ణికాయై నమః,
ఓం హాం వామాయై నమః,
ఓం హాం జ్యేష్టాయై నమః,
ఓం హాం రౌద్రే నమః,
ఓం హాం కాల్యై నమః,
ఓం హాం కలవికరణ్యై నమః,
ఓం హాం బలప్రమథిన్యై నమః,
ఓం హాం సర్వభూతదమన్యై నమః,
ఓం హాం మనోన్మన్యై నమః,
ఓం హాం మండలత్రితయాయ నమః,
ఓం హాం హోంహం శివమూర్తయే నమః,
ఓం హాం విద్యాధిపతయే నమః,
ఓం హాం హీం హొం శివాయ నమః,
ఓం హా హృదయాయ నమః,
ఓం హీం శిరసే నమః,
ఓం హూం శిఖాయై నమః,
ఓం హైం కవచాయ నమః,
ఓం హోం నేత్రత్రయాయ నమః,
ఓం హం అస్త్రాయ నమః,
ఓం హాం సద్యోజాతాయ నమః
సద్యోజాత భగవానునికి ఎనిమిది కళలుంటాయి. వాటిని పూర్వాది దిశలో, క్రమంగా గంధాదులతో ఈ క్రింది మంత్రాలతో పూజించాలి.
ఓం హం సిద్యై నమః,
ఓం హాం బుద్యై నమః,
ఓం హాం విద్యుతాయై నమః,
ఓం హాం లక్ష్మ్యై నమః,
ఓం హాం బోధాయై నమః,
ఓం హాం కాల్యై నమః
ఓం హాం స్వధాయ నమః,
ఓం హాం ప్రభాయై నమః
ఫాలలోచనా! వామదేవునికి పదమూడు కళలుంటాయి. వాటిని కూడా గంధ పుష్పాదు ఓం వామదేవాయ నమః అనే మంత్రంతో వామదేవుని అన్ని ఉపచారాలతో అర్చించిన తరువాత ఈ క్రింది మంత్రాలతో పూజించాలి. (కళల మంత్రాలివి)
ఓం హాం రజనే నమః,
ఓం హాం రక్షాయై నమః,
ఓం హాం రత్యై నమః,
ఓం హాం కన్యాయై నమః,
ఓం హాం కామాయై నమః,
ఓం హాం జనన్యై నమః,
ఓం హాం క్రియాయై నమః,
ఓం హాం వృద్ధ్యె నమః,
ఓం హాం కార్యాయై నమః,
ఓం హాం “రాత్ర్యై నమః,
ఓం హాం భ్రామణ్యై నమః,
ఓం హాం మోహిన్యై నమః,
ఓం హాం “క్షరాయై నమః
హే మహేశ్వరాదులారా! తత్పురుష దైవతానికి నాలుగు కళలుంటాయి. ముందు ఓం హాం తత్పురుషాయ నమః అనే మంత్రం ద్వారా ఆ దేవతను పూజించి ఆ తరువాత ఈ క్రింది మంత్రాల ద్వారా ఆ కళలనర్చించాలి.
ఓం హాం నివృత్యై నమః,
ఓం హాం ప్రతిష్ఠాయై నమః,
ఓం హాం విద్యాయై నమః,
ఓం హాం శాంత్యై నమః.
పిమ్మట అఘోర భైరవ సంబంధి కళలారింటినీ ముందుగా ఓం హాం అఘోరాయ నమః అనే మంత్రంతో ఆయనను పూజించిన పిమ్మట ఈ క్రింది మంత్రాలతో పూజించాలి.
ఓం హాం ఉమాయై నమః,
ఓం హాం క్షమాయై నమః,
ఓం హాం నిద్రాయై నమః,
ఓం హాం వ్యాధ్యై నమః,
ఓం హాం క్షుధాయై నమః,
ఓం హాం తృష్ణాయై నమః.
మహేశా! ఈశానదేవునికి కూడా అయిదు కళలుంటాయి. ముందుగా ఆ స్వామిని ఓం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించిన అనంతరం ఆ కళలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి.
ఓం హాం సమిత్యై నమః,
ఓం హాం అంగదాయై నమః,
ఓం హాం కృష్ణాయై నమః,
ఓం హాం మరీచ్యై నమః,
ఓం హాం జ్వాలాయై నమః,
శంకరా! ఆ తరువాత ఓం హాం శివపరివారేభ్యో నమః అంటూ పరమశివుని పరివారాన్నీ ఆ తరువాత ఈ క్రింది మంత్రాలతో దిక్పాలకులనూ, అనంతునీ, బ్రహ్మనీ, చండేశ్వరునీ ఆవాహన చేసి స్థాపన, సన్నిధాన, సంనిరోధ, సకలీకరణాలను గావించాలి.
ఓం హాం ఇంద్రాయ సురాధిపతయే నమః,
ఓం హాం అగ్నయే తేజోధిపతయే నమః,
ఓం హాం యమాయ ప్రేతాధిపతయే నమః,
ఓం హాం నిరృతయే రక్షో ధిపతయే నమః,
ఓం హాం వరుణాయ జలాధిపతయే నమః,
ఓం హాం వాయవే ప్రాణాధిపతయే నమః,
ఓం హాం సోమాయ నేత్రాధిపతయే నమః,
ఓం హాం ఈశానాయ సర్వవిద్యాధిపతయే నమః,
ఓం హాం అనంతాయ నాగాధిపతయే నమః,
ఓం హాం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః,
ఓం హాం ధూలి చండేశ్వరాయ నమః,
అనంతరము తత్త్వ న్యాస , ముద్రాప్రదర్శన, ధ్యానాలను నిర్వర్తించి పాద్య, ఆసన, అర్ఘ్య, పుష్ప, అభ్యంగ ఉద్వర్తన, స్నాన, సుగంధానులేపన, వస్త్ర అలంకార, భోగ, అంగన్యాస, ధూప, దీప, నైవేద్యార్పణ, తాంబూల నివేదనల ద్వారానూ, నృత్య, వాద్య, గీతాలతోనూ మహేశ్వరుని సంతుష్టపఱచాలి. దేవదేవుని రూపాన్ని మనసులో ధ్యానిస్తూ జపం చేయాలి. పూజనూ, జపాన్నీ ఆయనకే సమర్పించి వేయాలి.
ఈ ప్రకారంగానే వివిధ కామనల సిద్ధికై విశ్వావసు అను గంధర్వునీ కాళరాత్రీ దేవినీ కూడా ఉపాసిస్తారు..
ఇరవై నాల్గవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹