విష్ణు పవిత్రారోపణ విధి
భోగ, మోక్షాలు రెండింటినీ ప్రసాదిస్తూ విజయాన్ని కూడా కలిగించేది విష్ణు పవిత్రారోపణ. ఒకప్పుడు దానవులతో పోరాడి పరాజితులైన దేవతలు బ్రహ్మతో సహా వచ్చి విష్ణువును శరణు వేడగా ఆయన చెప్తున్నది విష్ణువే అయినా ఈ పురాణంలో నన్ను, నేను అనే పదాలను వాడకపోవడానికి కారణం సూతుడు శౌనకాదులకు వివరిస్తుండడం.
సర్వనామాలు వాడితే అర్థం బోధపడకపోవచ్చు అను వారి కడగండ్లను చూసి, విని కరిగిపోయి తన మెడలోని హారాన్నీ, పవిత్రయను పేరు గల గ్రీవాభరణాన్ని, ఒక ధ్వజాన్నీ, వారికి ప్రసాదించి ”దానిని చూస్తూనే దానవులు ధైర్యాన్ని కోల్పోవాల”ని దీవించాడు. ఆ తరువాత దేవతలు ఘనవిజయాన్ని సాధించారు. అప్పటి నుండి ఈ పవిత్రకాలను అందరూ పూజిస్తున్నారు.
సదాశివా! పాడ్యమి నుండి పున్నమ దాకా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవత పూజకు నిర్దేశింపబడింది. ఆయా దేవతలకు ఆయా తిథులలో పవిత్రారోపణ పూజను గావింపవలసి యుంటుంది. విష్ణువుకు ద్వాదశినాడు చేయాలి. వ్యతీపాతయోగ, ఉత్తరాయణ, దక్షిణాయన, చంద్ర సూర్యగ్రహణ, వివాహ, వృద్దికార్య, గురుజన ఆగమన సందర్భాలలో కూడా ఈ పూజను చేయవచ్చును.
బ్రాహ్మణులకు పట్టుదారాలనూ, పత్తినీ, లతలనూ, క్షత్రియులకు పట్టునూ వైశ్యులకు క్షేమ, భోజపత్రదారాలనూ పవిత్రక నిర్మాణాలకై ఋషులు నిర్దేశించారు. పత్తి లేదా కమల నిర్మిత పవిత్రకాన్ని అన్ని వర్ణాల వారూ వాడవచ్చును.
ఈ పవిత్రక నవతంతువులలో ఓంకార, శివ, చంద్ర, అగ్ని, బ్రహ్మ, శేష, సూర్య, గణేశ, విష్ణు దేవతలుంటారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పవిత్రకంలోని మూడు సూత్రాలకూ అధిష్టాన దేవతలు, ఈ సూత్రాలను బంగారం, వెండి, రాగి, వెదురు లేదా మట్టిపాత్రలలో వుంచాలి. నూట యెనిమిది, యాభై ఒకటి, లేదా ఇరవై యేడు తంతువులతో పవిత్రకాన్ని నిర్మించవచ్చు.
ఉపవాసం చేసి ఈ సూత్రాలను కుంకుమ, పసుపు, చందనాలతో చర్చితం చేసి అధివసితం గావించాలి. ప్రతి పవిత్రకాన్నీ వేరు వేరుగా అభిమంత్రితం చేసి పూజించాలి. తరువాత, అప్పటికే మండలంలో స్థాపించి వుంచిన దేవ ప్రతిమకెదురుగా పవిత్రకాన్ని పెట్టాలి.
బ్రహ్మాది అన్య దేవతలను కూడా మండలంలో స్థాపించి పూజించాలి. సూత్రాలను సిద్ధం చేసుకొని మూడు నుండి తొమ్మిది మార్లు వాటిని తిప్పివేది చుట్టూ కట్టాలి.
తరువాత కలశ, నెయ్యి. అగ్నికుండం, విమానం, మండపం, గృహాలను సూత్రాలతో కట్టి తనను కూడా సూత్రంతో నుదుట చుట్టుకొని, ఒక పవిత్రకాన్ని దేవత మస్తకంపై వుంచాలి.
సంపూర్ణ సామగ్రిని విష్ణుదేవునికి నివేదించి, పూజించి ఈ మంత్రాన్ని పఠించాలి.
ఆవాహితోఒసి దేవేశ పూజార్థం పరమేశ్వర ||
తత్ప్రభాతే ర్చయిష్యామి సామగ్ర్యాః సన్నిధోభవ ||
ఇలా ”ప్రాతఃకాలమే నీకు పూజ చేస్తాను స్వామీ” అన్ని విన్నపం చేసి ఆ రాత్రంతా జాగరం చేసి తెల్లారగానే కేశవస్వామిని పూజించి పవిత్రకాలను ఆయన కర్పించాలి. తరువాత స్వామికీ పవిత్రకాలకూ సుగంధిత ఆహ్లాదక ధూపాన్ని వేసి మంత్రాన్ని చదవాలి. (ఇలాటపుడే నాలుగు పాదాల గాయత్రిని పఠిస్తారు)
అనంతరం పవిత్రకాలతో దేవుని పూజించి వాటిని ఆయన ఎదుట పెట్టి ఇలా ప్రార్థించాలి.
విశుద్ధ గ్రంథికంరమ్యం మహాపాతక నాశనం |
సర్వపాప క్షయం దేవతవాగ్రే ధారయామ్యహం ||
తరువాత ఈ మంత్రం చదువుతూ సాధకుడు పవిత్రకాన్ని ధరించాలి.
పవిత్రం వైష్ణవం తేజః సర్వపాతక నాశనం ||
ధర్మకామార్థ సిద్ధ్యర్థం స్వకంఠే ధారయామ్యహం ||
త్రివర్గ సిద్ధికై తానీ పవిత్రకాన్ని ధరిస్తున్నాని దేవునికి విన్నవించిన సాధకుడు ఆయనను ఇలా ప్రార్ధించాలి.
వనమాలా యథాదేవ కౌస్తుభం సతతం హృది ||
తద్వత్ పవిత్రం తంతూనాం మాలాం త్వం హృదయే ధర ||
అనంతరం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి సాయంకాలంగానీ మరునాడుగానీ మరల ఇలాగే పూజనొనర్చి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దీక్షను విరమించాలి.
సాంవత్సరీ మిమాం పూజాం సంపాద్య విధి వన్మయా ||
ప్రజపవిత్రకే దానీం విష్ణులోకం విసర్జితః ||
తన వల్ల విసర్జింపబడుతున్న పవిత్రకం తనకన్న ముందే విష్ణులోకం చేరాలనిసాధకుని ఉద్దేశ్యం.
ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹