గదాధర స్తోత్రం :-
గదాధరం విబుధజనై రభిష్టుతం ధృతక్షమం క్షుదితజనార్తి నాశనమ్ |
శివం విశాలాసురసైన్య మర్దనం నమామ్యహం హతసకలాశుభం స్మృతౌ॥
పురాణ పూర్వం పురుషం పురుషుతం పురాతనం విమలమలం నృణాం గతిమ్ ||
త్రివిక్రమం ధృతధరణిం బలేర్హరం గదాధరం రహసి నమామి కేశవమ్ ॥
సుశుద్ధభావం విభవై రుపావృతం శ్రియావృతం విగతమలం విచక్షణమ్ |
క్షితీశ్వరై పగతః స్తుతం గదాధరం ప్రణమతి యఃసుఖం వసేత్ ॥
సురాసురై రర్చిత పాదపఙ్కజం కేయూర హారాజద మౌళిధారిణమ్ |
అబౌ శయానం చ రథాఙ్గపాణినం గదాధరం ప్రణమతి యఃసుఖం వసేత్ ||
సితం కృతే త్రేతాయుగే రుణం విభుం తథా తృతీయే పీతవర్ణ మచ్యుతమ్ ||
కలౌ ఘనాలిప్రతిమం మహేశ్వరమ్ గదాధరం ప్రణమతి యఃసుఖం వసేత్ ||
బీజోద్భవో యః సృజతే చతుర్ముఖ స్తథైవ నారాయణరూపతో జగత్ |
ప్రపాలయేద్, రుద్రవపు స్తథాన్తకృద్ గదాధరో జయతు షడర్ధమూర్తిమాన్ ॥
సత్త్వం రజ శ్చైవ తమో గుణాస్త్రయ స్త్వేతేషు నాన్యస్య సముద్భవః కిల ||
స చైక ఏవ త్రివిధో గదాధరో దధాతు ధైర్యం మమ ధర్మమోక్షయోః ॥
సంసారతోయార్ణవ దుఃఖ తన్తుభి ర్వియోగ వక్రక్రమణైః సుభీషణైః |
మజ్జన ముచ్చైః సుతరాం మహాప్లవే గదాధరో మాము దధాతు పోతవత్ ॥
స్వయం త్రిమూర్తిః స్వమినాత్మ నాత్మవి స్వశక్తిత శ్చాణ్ణ మిదం సంససర్జ హ,|
తస్మిజ్ఞలో త్థాసన మార్యతేజసం ససర్జ యస్తం ప్రణతోస్మి భూధరమ్ ||
మత్స్యాది నామాని జగత్సు కేవలం సురాది సంరక్షణతో వృషాకపిః |
ముఖ్యస్వరూపేణ నమస్తతో విభు ర్గదాధరో మే విదధాతు సద్గతిమ్ ॥
(శ్లో॥ 29-38, అధ్యా – 7)
ఈ విధంగా రైభ్యుడు భక్తితో చేసిన స్తోత్రాన్ని విని పీతాంబరధారి అయిన శ్రీహరి వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శంఖ, చక్ర, గదాధారి అయిన ఆ పురుషోత్తముడు మేఘగంభీరధ్వనితో ఇలా అన్నాడు.
ఓ రైఖ్యా! నీవు చేసిన స్తోత్రం వల్ల నీవు చేసిన గయాతీర్థ స్నానం వల్ల నేనెంతో సంతోషించాను. నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. “రైభ్యుడు స్వామికి నమస్కరించి “ప్రభూ! గదాధరా! నీవు నాకు సనకసనందనాది మహర్షులుండే స్థానాన్ని అనుగ్రహించు. ఇదే నేను కోరే వరం అని అడిగాడు. తథాస్తు అని ఆశీర్వదించి శ్రీహరి అంతర్థానంకాగా రైభ్యుడు కూడా దివ్యజ్ఞానాన్ని పొంది వర ప్రభావంతో సనకాది సిద్ధులు నివసించే స్థానానికి చేరుకున్నాడు.
రైభ్యుడు ఎంతో భక్తితో చేసిన ఈ గదాధర స్తుతిని శ్రద్ధగా పఠించిన వాడు గయలో పిండ ప్రదానం చేసినంత ఫలితాన్ని పొందుతాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹