రుద్రుడు – విష్ణువు అభేదం
పూర్వం బ్రహ్మదేవుడు తననుంచి ఆవిర్భవించిన రుద్రుణ్ణి పిలిచి సృష్టిచేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు సృష్టిచేసే సామర్థ్యం లేనికారణంగా రుద్రుడు నీళ్ళలోకి మునిగాడు. అలా నీటిలోకి చేరిన రుద్రుడు బొటనవేలంత పరిమాణంలో ఉన్న పరబ్రహ్మని ధ్యానిస్తూ అక్కడే ఉన్నాడు. అంతలో ఆయన ముందు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న పదకొండుమంది మహాపురుషులు, నీళ్ళలోంచి పైకి లేచి వెళుతున్నారు. వారిప్రభావంతో ఆ జలమంతా వేడెక్కిపోయింది. అప్పుడు రుద్రుడు వారితో అయ్యా మీరెవరు? ఎక్కడికి వెళుతున్నారు? అని అడిగాడు. అయితే వారెవరూ ఈయనకి సమాధానం చెప్పలేదు.
పదకొండు మంది పురుషులు పైకి వెళ్ళిపోగానే రుద్రుడి కళ్ళకి మహాసుందరుడు, మేఘంలాంటి శరీరఛాయతో ప్రకాశిస్తున్నవాడు, పద్మాల్లాంటి నేత్రాలతో వెలుగొందేవాడు అయిన మరోపురుషుడు కనిపించాడు. రుద్రుడు ఆయన్ని పిలిచి మహానుభావా! నీవెవరు? ఇంతకుముందు వెళ్ళిన పదకొండు మంది ”పురుషులు ఎవరు?” దయచేసి చెప్పండి అని కోరాడు. అప్పుడా మహాపురుషుడు రుద్రుడితో…..
భవా! దివ్యతేజస్సుతో వెలిగిపోతూ పైకి వెళ్ళిన వారు ఆదిత్యులు. బ్రహ్మ వారి గురించి సంకల్పించాడు. అందుకే వారలా వెళ్ళారు. బ్రహ్మ చేసిన సృష్టిని వారంతా పరిరక్షిస్తారు అని చెప్పాడు. మహాపురుషుడి మాటలు విన్న రుద్రుడికి ఎంతో ఆశ్చర్యం కలిగి ఆయనతో “మహానుభావా! తమరు నన్ను భవా! అని సంబోధించారు. నా పేరు మీకెలా తెలిసింది? అని ప్రశ్నించాడు. అందుకా మహాపురుషుడు నవ్వుతూ శివుడికిలా సమాధానం చెప్పాడు.
భవా! నా పేరు నారాయణుడు. నేను నీటిలోనే నిద్రిస్తాను. నీరే నా నివాసస్థానం. నే సనాతనుణ్ణి నీకు దివ్యదృష్టి ప్రసాదిస్తున్నాను. నా నిజస్వరూపాన్ని తెలుసుకో అన్నాడు నారాయణుడు. ఆయనలా పలకగానే సూర్యుడిలా ప్రకాశిస్తూ బొటనవేలంత పరిమాణంతో ఒకస్వామి దర్శనమిచ్చాడు. రుద్రుడు అతన్ని బాగా పరీక్షించి చూసాడు. ఆ దివ్యపురుషుడి బొడ్డులో ఒక పద్మం ఆ పద్మం మధ్యలో బ్రహ్మని ఆయన దేహంలో తన రూపాన్ని దర్శించాడు. ఆ మహాపురుషుడైన నారాయణుణ్ణి చూసి పరమానందభరితుడైన రుద్రుడు ఎంతో ఘనంగా ఇలా కీర్తించాడు.
రుద్రుడు చేసిన నారాయణ స్తుతి
నమోస్త్వనంతాయ విశుద్ద చేతసే సరూప రూపాయి సహస్రబాహవే
సహస్రరశ్మి ప్రవరాయ వేధసే విశాల దేహాయ విశుద్ధ కర్మిణే||
సమస్తవిశ్వార్తి హరాయ శంభవే సహస్ర సూర్యానిల తిగ్మతేజసే
సమస్త విద్యా విధృతాయ చక్రిణే సమస్త గీర్వాణ మతే సదా నఘ ॥
అనాది దేవాచ్యుత శేషశేఖర ప్రభో విభో భూతపతే మహేశ్వర
మరుత్పతే సర్వపతే జగత్పతే భువః పఠే భువనపతే సదా నమః ॥
జలేశ నారాయణ విశ్వశంకర క్షితీశ విశ్వేశ్వర విశ్వలోచన
శశాంక సూర్యాచ్యుత వీర విశ్వగా ప్రతర్క్య మూర్తే మృతమూర్తి రవ్యయః ॥
జ్వలద్దుతాశార్చి విరుద్దమండల ప్రపాహి నారాయణ విశ్వతోముఖ నమోస్తు దేవార్తి హరామృతావ్యయ ప్రపాహి మాం శరణగతం సదాచ్యుత ॥
వణ్య కాని విభో తవాహం పశ్యామి మధ్యస్థగతం పురాణమ్|
బ్రహ్మాణ మీశం జగతాం ప్రసూతిం నమో స్తు తుభ్యం తు పితామహాయ॥
సంసార చక్రభ్రమణై రనేకైః క్వచిద్ భవాన్ దేవవరాది దేవ
సన్మార్గిభి ర్జాన విశుద్ధ సత్వై రుపాస్యసే కిం ప్రలపామ్యహం త్వామ్ ॥
ఏకం భవన్తం ప్రకృతేః పరస్తాద్ యో వేత్త్వసౌ సర్వవిదాదిబోద్ధా,
గుణా నతేషు ప్రసభం విభేద్యా విశాలమూర్తి ర్హి సుసూక్ష్మరూపః||
నిర్వాక్యో నిర్మన విగతేన్టియోం సి కర్మాభవాన్నో విగతైక కర్మా,
సంసారవాం స్త్వం హి న తాదృశో సి పునః కథం దేవవరా సి వేద్యః ||
మూర్తిమూర్తం త్వతులం లభ్యతే తే పరం వపు ర్దేవ విశుద్ధ్భవైః
సంసార విచ్ఛిత్తికరై ర్యజద్భి రతో వసీయేత చతుర్భుజ స్త్వమ్ |
పరంన జానన్తి యతో వపుస్తే దేవాదయో ప్యద్భుత కారణం తత్
అవతారోక్తతనం పురాణ మారాధయేయుః కమలాసనాద్యాః |
న తే వపు ర్విశ్వసృగజ్జయోని రేకాంతతో వేద మహానుభావః
వరం త్వహం వేది కవిం పురాణం భవన్త మాద్యం తపసా విశుద్ధః ॥
పద్మాసనో మే జనకః ప్రసిద్ధ శ్చైతత్ ప్రసూతా వసకృత్పురాణైః
సంబోధ్యతే నాథ న మద్విధ్ పి విదుర్భవన్తం తపసా విహీనాః |
బ్రహ్మాదిభి స్తత్ప్రవరై రబోధ్యం త్వాం దేవ మూర్ఖః స్వమనన్త నత్యా
ప్రబోధ మిచ్ఛన్తి నతేషు బుద్ధి రుదారకీర్తి ష్వపి వేదహీనాః ॥
జన్మాంతరై ర్వేదవిదాం వివేక బుద్ధి ర్భవే న్నాథ తవ ప్రసాదాత్
త్వల్లబ్ధ లాభస్య న మానుషత్వం న దేవగంధర్వ గతిః శివం స్యాత్ ॥
త్వం విష్ణురూపోసి భవాన్ సుసూక్ష్మః స్థూలోని చేదం కృతకృత్యతాయాః
స్థూలః సుసూక్ష్మః సులభో సి దేవ త్వద్బాహ్యవృత్త్యా నరకే పతన్తి ॥
కి ముచ్యతే వా భవతి స్థితే స్మిన్ ఖాత్మ్యేన్దు వహ్న్యర్క మహీమరుద్భిః
తత్వైః సతోయైః సమరూపధారి, ణ్యాత్మస్వరూపే వితతస్వభావే ||
ఇతి స్తుతిం మే భగవన్ననంత జుషస్వ భక్తస్య విశేషతస్య, సృష్టిం సృజస్వేతి తవోదితస్య సర్వజ్ఞతాం దేహి నమోస్తు విష్ణో ॥
చతుర్ముఖో యో యది కోటివక్రో భవేన్నరః క్వాపి విశుద్ధచేతాః
స తే గుణానా మయుతై రనేకై ర్వదేత్ తదా దేవవర ప్రసీద ॥
సమాధి యుక్తస్య విశుద్ధబుద్ధే సద్భావ భావైక మనో నుగస్య సదా హృదిస్థో సి భవాన్నమస్తే న సర్వగస్యాస్తి పృథగ్వ్యవస్థా ॥
ఇతి ప్రకాశ కృత మేత దీశస్తవం మయా సర్వగతం విభుధ్యా ,
సంసార చక్రక్రమమాణ యుక్త్వా భీతం పునీహ్యమచ్యుత కేవలత్వమ్॥
(శ్లో॥ 17-37, అధ్యా-73)
మహాతేజో వంతుడైన రుద్రుడు స్తుతించగా సంతోషించిన నారాయణుడు గంభీరమైన స్వరంతో ఓ రుద్రా! నీకు మేలు కలుగుతుంది. నీకేం వరం కావాలో కోరుకో. మనిద్దరికీ ఎలాంటి భేదం లేదు. ఇద్దరం ఒక్కటే అని అన్నాడు.
అప్పుడు రుద్రుడు విష్ణువుకి నమస్కరించి, ప్రభూ! పూర్వం నన్ను బ్రహ్మదేవుడు సృష్టి చేయమని ఆజ్ఞాపించాడు. నాకు సృష్టి చేసే జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరాడు. విష్ణువు తథాస్తు అని పలికి రుద్రుడికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ తరువాత రుద్రుడు బైటికి వచ్చి తామసగణాల్ని సృష్టించాడు. శివుడు ఎంతో సంతోషంతో తనకి వరాన్ని ప్రసాదించిన విష్ణువు గొప్పతనాన్ని ఇలా వర్ణించాడు.
నారాయణాత్ పరోదేవో నభూతో నభవిష్యతి
ఏతత్ రహస్యం వేదానాం పురాణానాంచ సత్తమ ॥
(శ్లో॥51, అధ్యా – 74)
నారాయుణుడి కన్నా గొప్పదైవం ఇంతకుముందు లేడు. భవిష్యత్తులో ఉండబోడు. ఇది వేదాల్లో, పురాణాల్లో చెప్పబడ్డ రహస్యం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹