ప్రజాపాలుడు – గోవింద స్తవం
పూర్వం ప్రజాపాలుడనే మహారాజుండేవాడు. అతడెంతో ధర్మ పరాయణుడు. అతడి పూర్వీకులందరూ మొదటి త్రేతాయుగంలో మణివంశంలో జన్మించిన వారు. వారంతా తిరిగి రెండో త్రేతాయుగంలో కూడా జన్మించారు.
వారిలో మణివల్ల జన్మించిన దీప తేజుడనే వాడు రెండో త్రేతాయుగంలో శంతుడనేవాడిగా, అలాగే సురరశ్మి – శతకర్ణుడుగా, శుభదర్శనుడు పాంచాలుడిగా, సుశాంతి అనేవాడు సుందరుడుగా, సుందుడనే వాడు ముచికుందుడుగా, సుద్యుమ్నుడనేవాడు – తురుడిగా, సుమనుడు అనేవాడు సోమదత్తుడుగా, శుభుడనేవాడు – సంవరణుడుగా, సుశీలుడు – వసుదాసుడుగా, సుఖుడు – అసుపతిగా పుట్టారు.
అదేవిధంగా శంభుడనేవాడు సేనాపతిగా జన్మించగా కాంతుడనేవాడు దశరథుడుగా పుట్టాడు. సోముడనేవాడు జనకమహారాజయ్యాడు. ఈవిధంగా రెండో త్రేతాయుగంలో జన్మించిన వారంతా ఎన్నో యజ్ఞయాగాది క్రతువుల్ని ఆచరించి స్వర్గాన్ని చేరుకున్నారు. ప్రజాపాలుడు తన పూర్వీకుల వృత్తాంతాన్ని తెలుసుకుని తాను కూడా మోక్షం పొందాలనే కాంక్షతో తపస్సుచేయటం కోసం అడవికి వెళ్ళాడు. ప్రజాపాలుడు కొన్నాళ్ళు అడవిలో తపస్సు చేసి ఆ తరువాత గోవిందుడి నివాసమైన బృందావన ధామానికి వచ్చాడు. అక్కడ గోవిందుడు ప్రసిద్ధి చెందిన శ్రీహరిని ఎంతో భక్తి ప్రపత్తులతో ఇలా స్తుతించాడు.
గోవింద స్తుతి
నమామి దేవం జగతాం చ మూర్తిం గోపేన్ద మిన్దానుజ మప్రమేయమ్
సంసార చక్ర క్రమణైకరక్షం క్షితి దేవవరం నమామి ॥
భవోదధౌ దుఃఖశతోర్మిభీమే జరావర్తే కృష్ణ పాతాళమూలే
తదన్త మేకో దధతే సుఖం మే నమోస్తుతే గోపతి రప్రమేయ ॥
వ్యాధ్యాది యుక్తేః పురుషై రహైశ్చ సంఘట్టమానం పునరేవ దేవ
నమోస్తుతే యుద్ధరతే మహాత్మనే జనార్దనో పేన సమస్తబనో ॥
త్వముత్తమః సర్వవిదాం సురేశ త్వయా తతం విశ్వమిదం సమస్తమ్
గోపేన్ద్ర మాం పాహి మహానుభావ భవాద్భీతం తిగ్మరథా ఙ్గపాణే
పరోసి దేవ ప్రవరః సురాణాం పుంసః స్వరూపో సి శశిప్రకాశః
హుతాశ వక్రాచ్యుత తీవ్రభావ గోపేంద్ర మాం పాహి భవే పతన్తమ్ ॥
సంసార చక్ర క్రమణా ననేకా న్యావిర్భవన్యచ్యుత దేహినాం యత్
త్వన్మాయయా మోహితానాం సురేశ కస్తే మాయాం తరతే ద్వన్ద్వధామా॥
అగోత్ర మస్పర్శ మరూపగన్ద మనామ నిర్దేశ మజం వరేణ్యమ్
గోపేన్ద త్వాం యద్యుపాసన్తి ధీరా స్తే ముక్తిభాజో భవబద్ధముక్తాః
శబ్దాతిగం వ్యోమరూపం విమూర్తిం వికర్మిణం శుభభావం వరేణ్యమ్
చక్రాబ్జపాణింతు తథోపచారా దుక్తం పురాణే సతతం నమామి।।
త్రివిక్రమం క్రాస్తజగత్తయంచ చతుర్మూర్తిం విశ్వగతం క్షితీశమ్
శంభుం విభుం భూతపతిం సురేశం నమా మ్యహం విష్ణు మనన్త మూర్తిమ్ ॥
త్వం దేవ సర్వాణి చరాచరాణి సృజస్యథో సంహరసే త్వమేవ, మాం ముక్తికామం నయ దేవ శీఘ్రం యస్మిన్ గతా యోగినో నాపయాన్తి॥
జయస్వ గోవిన్ద మహానుభావ జయస్వ విష్ణో జయ పద్మనాభ,
జయస్వ సర్వజ్ఞ జయాప్రమేయ జయస్వ విశ్వేశ్వర విశ్వమూర్తే ॥
(శ్లో॥ 12-22,అధ్యా-36)
ఈ విధంగా ప్రజాపాలుడు స్తుతించగానే భక్తవరదుడైన గోవిందుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఎంతో తన్మయత్వంతో తన శరీరాన్ని విడిచి గోవిందుడిలో ఐక్యమైపోయాడు ప్రజాపాలుడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹