Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఒకటవ భాగము

సప్తమీతిథి- సూర్యోపాఖ్యానం

పూర్వం జ్ఞానం, శక్తి ఉన్న సనాతనమైన ఆత్మ ఒక్కటే ఉండేది. ఆ ఆత్మ రెండోదాన్ని కోరుకోవటంతో దానిలో ఉన్న వెలుగు బైటికి వచ్చింది. ఆ వెలుగు రూపమే సూర్యుడు. ఆ సూర్యుడి వెలుగులన్నీ ఒక దానిలో ఒకటి బాగా కలిసిపోయి అన్ని లాకాల్నీ ప్రకాశింపచేస్తున్నాయి. ఆ సూర్యుడి నుంచి ఒక్కసారిగా దేవతలు, సిద్ధులు, సకల దేవతాగణాలు, మహర్షులు జన్మించారు. అందుకే ఆయన సూర్యుడయ్యాడు. సూర్యుడు అంటే పుట్టుకకి కారణమైనవాడు అని అర్థం.

దేవతలు చేసిన సూర్యస్తవం

తస్మిన్ సర్వే సురాః సిద్ధాగణాః సర్వే మహర్షిభిః ||

సమం సూతా ఇతి విభో తస్మాత్ సూర్యో భవత్ స్తుతః!!

లోలీభూతస్య తస్యాశు తేజసో భూ చ్చరీరకమ్ |

పృథక్త్వేన రవిః సోథ కీర్త్యతే వేదవాదిభిః ॥

భాసయన్ సర్వలోకాంస్తు యతో సా వృద్ధితో దివి |

అతో సౌ భాస్కరః ప్రోక్తః ప్రకర్షచ్చ ప్రభాకరః ॥

దివాదివస ఇత్యుక్త స్తత్కారిత్వా దివాకరః

సర్వస్య జగత స్వాది రాదిత్య సేన ఉచ్యతే

ఏతస్య ద్వాదశాదిత్యాః సంభూతా స్తేజసా పృథక్ |

ప్రధాన ఏవ సర్వేషాం సర్వదా స విబుధ్యతే ॥

తం దృష్ట్వా జగతో వ్యాప్తిం కుర్వాణం పరమేశ్వరమ్|

తస్యైవాన్తః స్థితా దేవా వినిష్క్రమ్య స్తుతిం జగుః |

భవాన్ ప్రసూతి ర్జగతః పురాణః ప్రయాసి విశ్వం ప్రలయే చ హంసి,

సముత్థతో నాథ శమం ప్రయాహి మా దేవ లోకాన్ ఫుష కర్మసాక్షిన్ ॥

త్వయా తతం సర్వత ఏవ తేజః ప్రతాపినా సూర్య యజుః ప్రవృత్తే

తిగ్మం రథాఙ్గం తవ దేవకల్పం కాలాన్త మధ్వాన్తకరం వదన్తి ॥

ప్రభాకర స్త్వం రవి రాదిదేవ ఆత్మా నమస్తస్య చరాచరస్య

పితామహ స్తం వరుణో యమశ్చ భూతం భవిష్యచ్ఛ వదన్తి సిద్ధాః ॥

ధ్వాన్తం ప్రణుత్వం సురలోక పూజ్య ప్రయాహి శాస్త్రం పితరో వదన్తి

వేదాన్త వేద్యోసి మఖేషు దేవ త్వం హూయసే విష్ణు రసి ప్రసహ్య ||

(శ్లో॥4-13,అధ్యా-26)

ప్రచండమైన వెలుగులతో ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి దేవతలంతా ఈ విధంగా స్తుతించగా, సూర్యుడు ప్రసన్నుడై తన తాపాన్ని తగ్గించుకుని దేవతలకు ప్రత్యక్షమయ్యాడు. ఇలా సూర్యుడు ఆవిర్భవించటం, తన తాపాన్ని తగ్గించుకుని దేవతలకి దర్శనమివ్వటం అనేవి సప్తమీ తిథినాడే జరిగాయి. కనుక సూర్యుడికి ప్రీతి పాత్రమైన తిథి సప్తమి. సూర్యభగవానుడు సప్తమి తిథినాడే భూమండలం మీద ఆకారాన్ని పొందాడు. ఎవరైతే సప్తమితిథినాడు దేవతలు చేసిన సూర్యస్తవాన్ని శ్రద్ధగా పఠిస్తారో వారు సూర్యానుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment