Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – పద్నాల్గవ భాగము

ప్రతిపత్తిథి – అగ్నివృత్తాంతం

పూర్వం బ్రహ్మదేవుడి కోపం నుంచి అగ్ని పుట్టింది. అలా పుట్టిన అగ్ని బ్రహ్మతో ప్రభూ! నాకొక తిథిని ప్రసాదించండి. ఆ తిథినాడు నేను అందరిచేతా పూజించబడుతూ ఖ్యాతిని పొందుతాను అని కోరింది. అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నితో “ఓయీ! పావకా! దేవ, దానవ, యక్ష, గంధర్వులలో ఉత్తముడవైన నీవు పాడ్యమి అనగా ప్రతిపత్తిథిలో జన్మించావు. కనుక నేటినుంచీ నీకు ప్రత్యేకమైన తిథిగా ప్రతిపత్తిథిని నిర్ణయిస్తున్నాను అన్నాడు.

ప్రజాపతి ద్వారా అగ్నిదేవుడి కోసం నిర్ణయించబడ్డ ప్రతిపత్తి (పాడ్యమి) తిథినాడు హోమం చేస్తే పితృదేవతలు, ఇతర దేవతలు ఎంతో సంతోషిస్తారు. వారే కాదు పశువులు, అసురులు, గంధర్వులు లాంటివారు పంచభూతాల్లో మిగిలిన నాలుగు భూతాలు కూడా తృప్తి చెందుతాయి. అగ్నిదేవుణ్ణి ఉపాసించేవారు. పాడ్యమినాడు ఉపవాసం చేసినా, లేక కేవలం పాలుమాత్రమే త్రాగి గడిపినా ఎంతో గొప్ప ఫలం పొందుతారు. ఈ విధంగా నియమంతో అగ్నిని ఉపాసించేవారు. ఇరవై ఆరు మహాయుగాలు స్వర్గంలో నివసిస్తారు.

అగ్నిని పూజించి, అగ్నివ్రతాన్ని ఆచరించిన వారికి గొప్ప తేజస్సు, సౌందర్యం, సంపద, ఆరోగ్యం లభిస్తాయి. ఉన్నతమైన భోగాల్ని ఇహపరాలు రెండిట్లో అనుభవిస్తారు. ప్రతిరోజూ ఉదయం అగ్నిని గురించి చెప్పిన ఈ కథనాన్ని ఎవరైతే పఠిస్తారో వారు అన్ని పాపాలనుంచీ విముక్తి పొందుతారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment