Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వరాహ పురాణం 🌹🌹🌹 – పదకొండవ భాగము

ధర్మవ్యాధుడు చేసిన విష్ణుస్తోత్రం

నమామి విష్ణుం త్రిదశారినాశనం విశాల వక్షః స్థల సంశ్రితశ్రియమ్ |

సుశాసనం నీతిమతాం పరాం గతిం త్రివిక్రమం మన్దరధారిణం సదా ॥

దామోదరం రక్షితభూతలం ధియా యశోo శుశుభ్రం భ్రమరాఙ్గ సప్రభమ్ |

ధరాధరం నరకరిపుం పురుషుతం నమామి విష్ణుం శరణం జనార్ధనమ్ ॥

నరం నృసింహం హరి మీశ్వరం ప్రభుం త్రిధామనామాన మనన్త వర్చసమ్ ||

సుసంస్కృతస్య శరణం నరోత్తమం ప్రజామి దేవం సతతం త మచ్యుతమ్ ||

త్రిధా స్థితం తిగ్మ రథాఙ్గ పాణినం నయస్థితం తృప్త మమత్తమై ర్గుణైః |

నిః శ్రేయసాఖ్యం క్షపితేతరం గురుం నమామి విష్ణుం పురుషోత్తమం త్వహమ్ ||

హతా పురాణా మధుకైటభా వుభౌ బిభర్తి చ క్ష్మాం శిరసా సదా హి సః ।

యథా స్తుతో మే ప్రసభం సనాతనో దధాతు విష్ణుః సుఖ మూర్జితం మమ ॥

మహావరాహో హవిషామ్భుభోజనో జనార్దనో మే హితకృచ్చితీముఖః ||

క్షితీధరో మా ముదధిక్షయో మహాన్ స పాతు విష్ణుః శరణార్థినం తు మామ్ ॥

మాయాతతం యేన జగత్రయం కృతం యథాగ్ని నైకేన తతం

చరాచరమ్ చరాచరస్య స్వయ మేవ సర్వతః స మే స్తు విష్ణుః శరణం జగత్పతిః

భవే భవే యశ్చ ససర్జ కం తతో జగత్ ప్రసూతం సచరాచరం త్విదమ్ |

తతశ్చ రుద్రాత్మవతి ప్రలీయతే స్వతో హరిర్విష్ణు హర స్తథోచ్యతే ॥

ఖాత్మేన్దు పృథ్వీ పవనాగ్ని భాస్కరా జలం చ యస్య ప్రభవన్తి మూర్తయః |

స సర్వదా మే భగవాన్ సనాతనో దదాతు శం విష్ణు రచిన్త్యరూపధృక్ ॥

(శ్లో॥ 42-48, అధ్యా-8)

ఈ విధంగా ధర్మవ్యాధుడు స్తుతించగానే సనాతనుడైన శ్రీహరి ఎన్నో పాదాలతో, ఎన్నో చేతులతో ఆశ్చర్యంగొలిపే రూపంతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ధర్మవ్యాథుడు “స్వామీ! నా పుత్రులు, పౌత్రులు అలాగే నా కులంలో పుట్టిన వారందరూ నా లాగానే సత్యధర్మ పరాయణులుగా ఉండేలా వరమివ్వు. అలాగే నాకు నాతరం వారికి ధర్మయుగాల్లోనే జన్మ లభించాలి. కలియుగంలో మేము జన్మించకూడదు. నా కులం వారికి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా జ్ఞానం ఉదయించాలి. ప్రభూ! శ్రీహరి! నాకిక జీవితం మీద ఏమాత్రం ఆసక్తి లేదు. నీలో లయమవ్వాలని భావిస్తున్నాను” అని వినయంగా పలికాడు.

ధర్మవ్యాథుడి కోరిక విన్న శ్రీహరి “ధర్మవ్యాధా! నీ కోరిక ఫలిస్తుంది. నీ కులానికి గొప్ప కీర్తి లభిస్తుంది. నీకు శాశ్వతంగా నాలో స్థానం లభిస్తుంది అని ఆశీర్వదించాడు. వెంటనే ధర్మవ్యాధుడి శరీరం నుంచి ఒక దివ్యమైన వెలుగు బైటికి వచ్చి సనాతనుడైన ఆ శ్రీహరిలో కలిసిపోయింది. ఏకాదశినాడు ఉపవాసముండి శ్రీహరిని ఆరాధించి ధర్మవ్యాధుడు చేసిన ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించేవాడు, విన్నవాడు డెబ్భై మన్వంతరాల కాలం శ్రీహరి నివాసంలో సుఖంగా నివసిస్తారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment